మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ఉచ్చు? సీఐడీ అదుపులో ప్రధాన అనుచరుడు

రెవెన్యూ రికార్డుల దగ్ధం కేసులో అందరూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి వైపే చూస్తున్నారు. ఇందులో సీఐడీ అదుపులోకి తీసుకున్న పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడి పాత్ర ఏమిటి? ఆయన సతీమణి పేరిట వందలాది ఎకరాల రిజిస్ట్రేషన్ జరిగిందా? ఈ కేసులో మొదటిసారి పోలీసులపై వేటు పడింది.

Update: 2024-07-24 10:45 GMT

రెవెన్యూ రికార్డుల దగ్ధం కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసు మిస్టరీ రోజుల వ్యవధిలోనే చిక్కుముడి వీడే అవకాశం ఉంది. ఇప్పటికే ఇంటిదొంగలపై ఓ నిర్ధారణకు వచ్చిన సీఐడీ, పోలీస్ దర్యాప్తు అధికారులు కీలకమైన వ్యక్తి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆయన నివాసం నుంచి రెండు బస్తాల పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సీఐడీ తోపాటు విచారణ సాగిస్తున్న ఐఏఎస్ అధికారుల బృందాలు, ప్రభుత్వం కూడా మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాత్రపై సందేహాలు వ్యక్తం చేయడమే కాకుండా, ఆ దిశగా ఫోకస్ పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడి వల్ల భూములు కోల్పోయిన బాధితుడు బుధవారం బయటికి వచ్చి, తనకు జరిగిన అన్యాయం, భూముల వివరాలు వెల్లడించారు.

ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. సీఎం ఎన్. చంద్రబాబునాయుడు ఆదేశాలతో రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పీ సిసోడియో మంగళవారం మదనపల్లో సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని పరిశీలించారు. దర్యాప్తు తీరును ఆయన వాకబు చేశారు. దగ్ధమైన రికార్డులకు సంబంధించి ఒరిజినల్ ఫైళ్లను రిట్రీవ్ చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు ఇచ్చారని తెలిసింది.
ఈ వ్యవహారంలో ప్రస్తుతం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో పనిచేస్తున్న మురళీ మదనపల్లె ఆర్డీవోగా ఉన్నారు. ఘటన జరగడానికి ముందు రోజు అంటే,  శనివారం నుంచి ఆయన పట్టణంలోనే ఉన్నారని గుర్తించారు. ఒంగోొలు ఆర్డీఓగా ఉన్న సమయంలో ఆయన క్రమశిక్షణా చర్యలకు గురై, తహసీల్దార్ గా రివర్షన్ ఇచ్చారని తెలిసింది. ఆ తరువాత ఆయనకు పదోన్నతితో పాటు మదనపల్లెలో ఆర్డీఓగా నియమించడానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారం అందించారనే వార్తలు వస్తున్నాయి. దీంతో మురళీ భూేముల వ్యవహారంలో తన వంతు సహకారం అందించారనీ, దీంతో ఆయన ప్రస్తుతం సీఐడీా కష్టడీలో విచారణ ఎదుర్కొంటున్నట్లు సమాచారం. 
మొదటి వేటు

రెవెన్యూ రికార్డుల దగ్ధం కేసులో మదనపల్లె సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లపై మొదటి వేటు పడింది. సీఐ వలి బసును వీఆర్ కు పంపారు. ఇద్దరు బ్లూ కోల్ట్ కానిస్టేబుళ్లను బుధవారం సస్పెండ్ చేసినట్లు సమాచారం గస్తీ తిరుగుతున్న ఇద్దరు కానిస్టేబుళ్లు కార్యాలయంలో మంటలు చెలరేగిన విషయం టూ టౌన్ సెంట్రీకి సమాచారం ఇవ్వగా, ఆయన సీఐకి తెలిపారు. ఈ సంఘటనపై ఉదయం వరకు డీఎస్పీ, ఎస్పీకి తెలియజేయడంలో నిర్లక్ష్యంపై సీఐపై వేటు వేశారని, కానిస్టేబుళ్లు సమాచారం ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకున్నది తెలియడం లేదు.

జరిగిన సంఘటనను రుజువు చేయడానికి శాస్త్రీయమైన ఆధారాలతో తెరవెనక ఉన్న సూత్రధారులను కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం. అది రోజుల వ్యవధిలోనే జరిగే అవకాశం ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న రెవెన్యూ శాఖ అధికారులు, నిషేధిత భూముల కొనుగోలు రిజిస్ట్రేషన్ లో కీలకంగా వ్యవహరించిన మాధవరెడ్డి ద్వారా రెవెన్యూ రికార్డులు దగ్ధం చేయడానికి ప్రేరేపించిన అసలైన పెద్దమనిషి పాత్ర పై కూపీ లాగుతున్నట్లు తెలిసింది.


వేల ఫైళ్లు దగ్ధం

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో 22/ఏకు సంబంధించిన కీలకమైన ఫైళ్లేనని ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇందులో 2,240 ఫైళ్లు కాలిపోయినట్లు ప్రాధమికంగా అంచనా వేసినట్లు సమాచారం. భూముల సర్వే సందర్భంగా సిద్ధం చేసిన రికార్డులు కూడా అందులోనే ఉన్నాయని గుర్తించారు. ప్రధానంగా 22/ఏ కేసులకు సంబంధించినవి 120 ఫైళ్లు గల్లంతయినట్లు తెలిసింది. కాలిపోయిన ఫైళ్ళలో పుంగనూరు మండలం రాగానే పల్లెకు చెందిన 982 ఎకరాల ఎస్టేట్ భూమికి సంబంధించిన ఫిజికల్ ఫైల్స్ కొన్ని ఉన్నట్లు తెలిసింది. కాగా, సంఘటన జరిగిన రోజు రాత్రే పోలీస్ అధికారులు మదనపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలోని 11 తహసీల్దార్ కార్యాలయాల్లో కంప్యూటర్ హార్డ్ డిస్కులు, ఫైళ్లను సీజ్ చేసినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది.

చిత్తూరు జిల్లా ( ప్రస్తుతం అన్నమయ్య జిల్లా) మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం అర్ధరాత్రి రెవెన్యూ రికార్డులు దగ్ధమైన విషయం తెలిసిందే. ఇందులో ప్రధానంగా 22/ఏ, ఈయన ఎస్టేట్ అసైన్ చుక్కల భూములు అటవీ శాఖలో వివాదాస్పద భూములకు సంబంధించి 2,240 ఫైళ్లు కాలిపోయినట్లు రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. పక్కా కుట్రపూరితంగానే ఫైలు దహనం చేశారని రెవిన్యూ శాఖ ఉన్నతాధికారులు, దర్యాప్తు చేస్తున్న సీఐడీ పోలీస్ బృందాలు ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చినట్లు సమాచారం. ట్రాన్స్కో, అగ్నిమాపక శాఖాధికారులు గంటల వ్యవధిలోనే మదనపల్లెకు వచ్చిన డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ కు ప్రాధమిక నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే.

దర్యాప్తులో కీలక పరిణామం

ఫైల్ దగ్ధమైన కేసులో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ సూపర్డెంట్ గౌతమ్ తేజ్, ఆర్డిఓ హరిప్రసాద్, ఆయన కంటే ముందు ఆర్డీఓ మురళీని అదుపులోకి తీసుకున్న దర్యాప్తు అధికారి, అన్నమయ్య జిల్లా అడిషనల్ ఎస్పీ రాజ్ కమల్ విచారణ చేస్తున్న విషయం తెలిసింది. వారిచ్చిన సమాచారం మేరకే మదనపల్లిలో నివాసం ఉంటున్న మదనపల్లెలో మిల్లు మాధవరెడ్డిని సోమవారం మధ్యాహ్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం ముందుగానే గ్రహించిన మాధవరెడ్డి కొన్ని రికార్డులను ఇంటి నుంచి మాయం చేశారని తెలిసింది. అయినా ఆయన నివాసంలో రెండు బస్తాల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వీరితోపాటు ఆర్డీవో సీసీ మణి, డిప్యూటీ తహసీల్దార్లు అస్లాం బాషా, భరత్ రెడ్డి పాత్రపై కూడా దర్యాప్తు అధికారులు సందేహాలు వ్యక్తం చేసి లోతుగా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఎవరీ మాధవరెడ్డి

పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండలానికి చెందిన వీ. మాధవరెడ్డి మదనపల్లెలో కొంతకాలం రైస్ మిల్లు కూడా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సన్నిహితంగా ఉంటూ ఆ తర్వాత ఆయన ప్రధాన అనుచరుడుగా మారినట్లు స్థానికుల కథనం. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చాక మాధవరెడ్డి మదనపల్లి తంబళ్లపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన భూ వ్యవహారాలు చూసేవారని ఆరోపణలు ఉన్నాయి. 22/ఏ ఫైల్ చూడడంతో పాటు వివాదం భూముల్లో పెద్దిరెడ్డి ప్రతినిధిగా జోక్యం చేసుకొని సెటిల్మెంట్ చేయడంతో పాటు భూముల కొనుగోలు వంటి వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఆ కోణంలోనే దర్యాప్తు అధికారులు కూడా సమాచారం సేకరిస్తున్నారు.

ఆయన పాత్ర ఏమిటి?

మదనపల్లి డివిజన్ పరిధిలోని 22/ఏ కింద నిషేధిత భూముల కోసం దరఖాస్తు చేసుకున్న వారి నుంచి భూములు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం. ఆ తర్వాత ఆ భూములను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన భార్య స్వర్ణలత పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించే వ్యవహారాల్లో చురుకైన పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి. కొనుగోలు చేసీ డీ.పట్టా భూముల్లో కొన్ని తన పేరుతో, ఇంకొన్ని కుమారుడు మౌనిష్ రెడ్డి పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించుకోవడంలో మాధవరెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. ఆ కోవలో...

తంబళ్లపల్లి నియోజకవర్గంలోని కురబలకోట మండలంలో 500 ఎకరాలు తంబళ్లపల్లెలో 200 ఎకరాలు, బి కొత్తకోట మండలంలో 50 ఎకరాలు, మదనపల్లిలో 100 ఎకరాలు బినామీ పేర్లతో మాధవరెడ్డి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు దర్యాప్తులో గుర్తించినట్లు తెలుస్తోంది.మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని తగలబెట్టకు ముందు వారం నుంచి ఆయన ప్రతిరోజు కార్యాలయానికి వెళ్లి అక్కడి ఉద్యోగులతో మాట్లాడినట్లు పోలీసులు సందేహిస్తున్నారు. ఇదిలా ఉండగా..


మాజీ మంత్రి పెద్దిరెడ్డి సతీమణి పేరిట..
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణలత పేరుపై వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగాయని తెలుస్తోంది అందులో ప్రధానంగా, పుంగనూరులో 60, భీమగానే పల్లెలో ఏకంగా 98 భూముల రిజిస్ట్రేషన్లు స్వర్ణలత పేరుపై జరిగినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం అక్కడితో ఆగలేదు పుంగునూరు మండలంలోని కుమ్మరనత్నం 8 మేలుపట్లలో 13 రాగానే పల్లె సమీపంలోని భూములకు సంబంధించి మూడు రిజిస్ట్రేషన్లు జరిగాయి. చౌడేపల్లి మండలం దిగోపల్లెలో సర్వేనెంబర్ 110 లో కొన్ని భూములు, ప్రధానంగా మదనపల్లి మండలం బండమీద కమ్మ పల్లెలో రెండు వలస పల్లెలో మూడు రిజిస్ట్రేషన్ సంబంధించి భారీ విస్తీర్ణంలో భూములు కొనుగోలు చేసినట్లు ఆయా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరిగాయి. అలాగే శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట సమీపంలో తూకివాకం, ఏర్పేడు మండలం వికృతమాల సమీప గ్రామాల్లో 22ఏ, అసైన్డ్ భూములను బినామీ పేర్లతో కొనుగోలు చేసిన వ్యక్తులు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య స్వర్ణలత పేరిట రిజిస్ట్రేషన్లు జరిగించినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ పరంపరలో ఆమె పేరు పై 38 అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్లు జరగగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి పేరిట 28 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు సబ్ రిజిస్టర్ కార్యాలయాల రికార్డులు తనిఖీ చేస్తే వెలడవుతుంది. ఇవి కాకుండా తిరుపతి నగరానికి చుట్టుపక్కల అనేక నిషేధిత భూములను కూడా ఇదే తరహాలో కొల్లగొట్టినట్లు సమాచారం. ఈ వ్యవహారా నీటి పైన రెవెన్యూ సిఐడి పోలీసు బృందాలు మరింత లోతుగా దర్యాప్తు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిగో సాక్ష్యం


ఫోర్టరీ సంతకాలతో మాధవరెడ్డి తన భూములను స్వాధీనం చేసుకున్నాడని మదనపల్లె పట్టణం మార్పూరివీధికి చెందిన బాధితుడు వెంకటేష్ ఆరోపించారు. భూముల స్వాధీనం చేసుకుని, అన్యాయం చేశారని గత ఆర్డీఓ మురిళీకి ఫిర్యాదు చేసినా, పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రికార్డుల దగ్ధం ఘటనతో అధికారులు రంగంలోకి దిగారని, పత్రికల్లో చూసి, ముందుకు వచ్చానని ఆయన వివరించారు. తన నుంచి స్వాధీనం చేసుకున్న భూములను మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సతీమణి స్వర్ణలత పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆయన ఆ వివరాలను వెల్లడించారు.
1. బీకేపల్లి సర్వే నెంబరు 420/10aలో 225 చదరపు అడుగులు. మార్కెట్ విలువ రూ.6.84లక్షలు
2. బీకేపల్లి సర్వే నెంబరు 420/14లో 1558 చదరపు అడుగులు. మార్కెట్ విలువ రూ.47.38లక్షలు
3. బీకేపల్లి సర్వే నెంబరు 410/10లో 6000 చదరపు అడుగులు. మార్కెట్ విలువ రూ.20.27లక్షలు
అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని బుధవారం ఆయన మీడియా వద్ద కోరారు.

చురుగ్గా విచారణ
ఘటన జరిగిన మరుసటి రోజు అంటే సోమవారం నుంచి అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మదనపల్లిలోనే ముఖం వేశారు అదనపు ఎస్పీ రాజ్ కమల్ ఆధ్వర్యంలో 10 పోలీసు బృందాలు చురుగ్గా దర్యాప్తు సాగిస్తున్నాయి. సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సిబ్బందిని ఒకరికొరిగా పిలిచి సమాచారం సేకరిస్తున్నారు. ఏ విభాగం ఫైలు ఎవరు పర్యవేక్షించేవారు? జరుగుతున్న లావాదేవీలు, లోపాయి కారీగా జరిగే వ్యవహారాలపై కూడా ఊపి లాగుతున్నట్లు సమాచారం. ఈ ఘటనపై రెవెన్యూ పోలీస్ బృందాలు ఎవరికి వారు విడివిడిగా విచారణ సాగిస్తున్నాయి కాలిపోయిన ఫైళ్ళ బూడిదను ఫోరెన్సిక్ బృందం చేసి తీసుకువెళ్లింది. ఏ కారణంతో ఈ ఫైల్స్ దగ్ధమయ్యాయి అని శాస్త్రీయంగా నిర్ధారించి, వాస్తవాలను నివేదికల ద్వారా బయటపెట్టే అవకాశం ఉంది.

సీఐడీ ఆధ్వర్యంలో పది బృందాలు లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. అనుమానిత ఆర్డీవోలు మురళీ, హరిప్రసాద్, సూపరింటెండెంట్ గౌతం తేజ్, డీటీలు ఇద్దరు, ఇంకొందరు సర్వేయర్లు, ఘటన జరిగిన సమయంలో కాపలా ఉన్న వాచ్ మన్ ను డివిజన్ పరిధిలోని వేర్వేరు పోలీస్ స్టేషన్లలో ఉంచి ఒకో బృందం ఒకోసారి రహస్యంగా విషయాలు బయటికి తీయడానికి విచారణ సాగిస్తున్నట్లు తెలిసింది.
Tags:    

Similar News