BRUTAL UURDER OF DOG | ఆ కుక్క తల్లిదండ్రులెవ్వరు..?
తిరుపతిలో ఓ కుక్క హత్యను హత్య చేశారు. ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లిన మహిళను పోలీసులు విచిత్రమైన ప్రశ్న వేయడంతో అవాక్కయ్యారు.
By : SSV Bhaskar Rao
Update: 2024-12-07 08:56 GMT
తిరుపతి నగరంలో ఓ కుక్కను కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటనను చూసిన పిల్లలు భయాందోళనకు గురయ్యారు. డ్యూటీకి వెళ్ళిన తల్లికి గురువారం సాయంత్రం ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆ సమయంలో కుక్కను విచక్షణారహితంగా నరుకుతున్న వ్యక్తులు పిల్లలపై దాడి చేసి ఉంటే, ఊహించడమే కష్టంగా ఉంటుంది..
ఈ సమాచారం అందుకున్న కుక్క యజమానురాలు ఇంటికి చేరుకుంది. జరిగిన విషయం తెలుసుకొని, ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వెళ్లిన ఆ మహిళను పోలీసులు విచిత్రమైన ప్రశ్నలతో మరింత వేదనకు గురి చేశారు.
"కుక్క చనిపోతే కేసు ఏమిటమ్మా? ఆ కుక్క తల్లిదండ్రులు ఎవరు? అది ఏ బ్రీడ్ కు చెందినది? దాని పేరేమిటి? పుట్టుపూర్వకరాలు చెబుతారా" అని వ్యంగ్యమైన ప్రశ్నలు వేస్తూనే నవ్వుతూ హేళనగా మాట్లాడారు" అని బాధితురాలు లావణ్య శుక్రవారం ఉదయం మీడియాకు ఈ సంఘటన వివరాలు చెప్పారు.
ఫిర్యాదు చేయడానికి స్టేషన్ కు వచ్చే వారితో గౌరవంగా మెలగండి అని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఒకపక్క చెబుతూనే ఉన్నారు. బాధతో వచ్చే వారి పట్ల సానుకూలంగా మాట్లాడి, శాంత పరచాలి అనే మాటలు కూడా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ సిబ్బందిలో మార్పు తీసుకు రావడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాజా ఘటన వివరాల్లోకి వెళితే..
తిరుపతి నగరం లీలామహల్ సర్కిల్ వద్ద ఉన్న స్కావెంజర్స్ కాలనీకి చెందిన లావణ్య శుక్రవారం ఉదయం తన ఇద్దరు పిల్లలు, పెంపుడు కుక్కను అదే కాలనీలోని మామయ్య ఇంటి వద్ద వదలింది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం పంచమి తీర్థం నిర్వహించారు. ఈ నేపథ్యంలో సేవా డ్యూటీకి లావణ్య వెళ్లింది.
తిరుపతి స్కావెంజర్స్ కాలనీలో ఆమె పిల్లలు బంధువుల ఇంటి వద్ద ఆడుకుంటున్నారు. వీరి అరుపులు, గెంతులు చూస్తున్న వారి పెంపుడు కుక్క అరుపులే పిలుపుగా గంతులు వేస్తోంది.
ఆ ఇంటికి సమీపంలోనే ఉన్న ఇద్దరు వ్యక్తులు కుక్క అరుపులు ఇబ్బందికరంగా ఉన్నాయని భావించారు. మద్యం మత్తులో ఉన్న వారిద్దరూ కత్తులు తీసుకువచ్చి మొరుగుతున్న కుక్కను విచక్షణారహితంగా నరికిపోగులు పెట్టారు.
ఈ సంఘటనతో భయపడిపోయిన కుమార్తెలు ఫోన్ చేసి లావణ్యకు సమాచారం అందించారు. అక్కడ ఆమె ఆందోళన చెందుతుంది. తమ పెంపుడు కుక్కను నరుకుతున్న తీరును చూసి, భయపడి పోయిన పిల్లలు కేకలు పెడుతున్నారు. అయినా, మద్యంమత్తులో ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులు విచక్షణ కోల్పోయి వ్యవహరించారు. భయపడిన పిల్లలు దూరంగా పారిపోయి సరిపోయింది. కుక్కను నరుకుతున్న వ్యక్తులు ఆవేశంలో పిల్లలపై దాడికి తెగబడి ఉంటే..? పరిస్థితి గోరంగా ఉండేది.
తిరుచానూరులో యాత్రికుల రద్దీ నుంచి తప్పించుకుని, దొరికిన వాహనం పట్టుకుని లావన్య తిరుపతిలోని స్కావెంజర్న్ కాలనీకి చేరుకుంది. తాను ముద్దుగా పెంచుకున్న కుక్క రక్తపుమడుగులో పడి ఉన్న తీరు చూసి, లావణ్య చలించిపోయింది. కాసేపటికి తేరుకుని, "తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళితే, పోలీసులు పరిహాసంగా మాట్లాడారు" అని శుక్రవారం మధ్యాహ్నం మీడియాకు వెల్లడించారు.
"మనుషులు చనిపోతేనే దిక్కులేదు. కుక్కను చంపితే కేసు ఏమిటమ్మా" అని వ్యంగ్యంగా మాట్లడారని లావణ్య మీడియాకు చెప్పారు. తాను నిలదీసిన తరువాత అనిమల్ యాక్టు కింద కేసు నమోదు చేసిన పోలీసులు పంచనామా చేయడానికి శుక్రవారం వస్తామని చెప్పి ఇంతవరకు స్పందించలేదని ఆమె ఆరోపించారు.
"నేను పెంచుకున్న నాలుగేళ్ల వయసున్న కుక్క ఆరోగ్యంగా ఉంది. వ్యాక్సిన్ కూడా వేయించాను. ఆ రిపోర్టులు నా వద్ద ఉన్నాయి" అని ఆమె స్పష్టం చేశారు. కాగా, ఈస్ట్ పోలీసులకు గురువారం ఇచ్చిన ఫిర్యాదులో నిందితుల పేర్లు స్పష్టంగా రాశాను. ఆమె చెప్పారు. అయితే ఫిర్యాదులో కొన్ని లోపాలు ఉన్నాయి. సరిదిద్దాలంటూ స్టేషన్ రమ్మని చెప్పిన పోలీసులు ఇద్దరు నిందితుల పేర్లు తప్పించారనే సందేహం వ్యక్తం చేశారు. ఒక రోజు కావస్తున్నా, ఇంతవరకు పోలీసులు ఘటనా స్థలానికి రాలేదని ఆమె వివరించారు.