తిరుమలలో భోగశ్రీనివాసుడి కంఠాన అలరించనున్న లక్ష్మీపతకం..

బెంగళూరు భక్తుల్లో ఒకరు వజ్రాలు పొదిగిన రూ.22 లక్షల కానుక, మరొకరు అన్నదాన ట్రస్టుకు కోటి.రూపాయలు విరాళంగా ఇచ్చారు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-08-13 07:43 GMT
తిరుమల శ్రీవారి ఆలయం (ఫైల్)

తిరుమల శ్రీవారికి ఏడాదిలో భారీగా కానుకలు అందాయి. బంగారు, వజ్రాభరణాలు, టీటీడీ ట్రస్టులకు రూ. లక్షలాది రూపాయలు అందుతున్నాయి. ఆ కోవలో బుధవారం బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు శ్రీవారి పాదాల చెంత పూజలు అందుకునే భోగ శ్రీనివాసుడికి బంగారు వర్జం పొదిగిన 148 గ్రాముల లక్ష్మీ పతకం కానుకగా సమర్పించారు.


భోగశ్రీనివాసుడు అంటే ఎవరు?


తిరుమల అనగానే కళ్లముందు కదలాడేది శ్రీవేంకటేశ్వరస్వామి మూలవిరాట్టు. ఆ విగ్రహం పాదాల చెంత కనిపించే మరో చిన్న విగ్రహమే భోగశ్రీనివాసుడు. ఈ విగ్రహానికి రాత్రి పవళింపుసేవ, వేకువజామున సుప్రభాత సేవ నిర్వహించడం ఆనవాయితీ. యాత్రికులు ఆలయంలోకి వెళ్లగానే శ్రీవేంకటేశ్వరుడి మూలవిరాట్టును దర్శించుకుంటే పుణ్యం తోపాటు జన్మ ధన్యమైనట్లు భావిస్తారు. భోగశ్రీనివాసుడికి నిర్వహించే కార్యక్రమలన్నీ శ్రీవారికి దక్కినట్లే లెక్క.
శ్రీవారి సన్నిధిలో భోగశ్రీనివాసుడిని స‌హ‌స్రా శీర్ష పురుషుడిగా పరిగణిస్తారు. ఈ విగ్రహం క్రీ.శ 614 నాటిది. పల్లవ రాణి సామవాయి పెరుందేవి క్రీ.శ 614వ సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో 18 అంగుళాల పొడవుగల వెండి భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని తిరుమల శ్రీవారి ఆలయానికి కానుకగా సమర్పించారు. ఈ శాసనం ఆలయ మొదటి ప్రాకారంలోని విమాన వేంకటేశ్వరుని విగ్రహం కింది భాగంలో గోడపైన కనిపిస్తుంది. ఆగమం ప్రకారం శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని కౌతుకమూర్తి అని, శ్రీమనవాళపెరుమాళ్‌ అని కూడా పిలుస్తారు.
వజ్రాల కానుక 

ఇంతటి చారిత్రక నేపథ్యం కలిగిన శ్రీభోగశ్రీనివాసుడి కంఠానికి అలంకరించాలని కోరుతూ 148 గ్రాములు ఉన్న. 25 లక్షల విలువైన వజ్రం పొదిగిన లక్ష్మీపతకాన్ని బెంగుళూరుకు చెందిన కేఎం. శ్రీనివాసమూర్తి తిరుమల శ్రీవారి ఆలయంలో అధికారులకు అందించారు. ఈ ఆభరణం భోగశ్రీనివాసుడి విగ్రహానికి అలంకరించాలని కోరారు.
శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో దాత శ్రీనివాసమూర్తి నుంచి టీటీడీ అదనపు ఈఓ సిహెచ్.వెంకయ్య చౌదరి అందుకున్నారు. ఆయనకు శ్రీవారి దర్శనం తరువాత వేదాశీర్వాదం అందించారు. శ్రీవారి తీర్థప్రసాదాలు అధికారులు అందించారు.

రూ. కోటి విరాళం



 


టీటీడీ టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టు నిర్నివహిస్తోంది. ఈ పధకం కింద ట్రస్టుకు కూడా భారీగా విరాళాలు అందుతున్నాయి. బుధవారం బెంగుళూరుకు చెందిన  కల్యాణ్ రామన్ కృష్ణమూర్తి అనే భక్తుడు  రూ.కోటి విరాళంగా అందించారు. ఆయనకు శ్రీవారి దర్శనంతో పాటు తీర్థప్రసాదాలు అందించారు. 

Tags:    

Similar News