మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన పొడిగింపునకు ఎగువ సభలో ఆమోదం..

బీహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్ష ఎంపీలు ..;

Update: 2025-08-05 13:47 GMT

మణిపూర్‌(Manipur)లో రాష్ట్రపతి పాలన పొడిగింపునకు రాజ్యసభ(Rajya Sabha) ఆమోదం తెలిపింది. దీంతో మరో ఆరు నెలలు పాటు ప్రెసిడెంట్ పాలన అమల్లో ఉంటుంది. ప్రతిపక్షాల భారీ నినాదాలు, నిరసనల మధ్య కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈరోజు(ఆగస్టు 5) ఎగువ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను పొడిగించాలని లోక్‌సభలో తీర్మానాన్ని జూలై 30న ఆమోదించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి పదవికి ఎన్ బిరేన్ సింగ్ రాజీనామా చేసిన కొన్ని రోజుల తర్వాత.. ఫిబ్రవరి 13న మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. దాదాపు రెండు సంవత్సరాల పాటు రాష్ట్రంలో హింస, రాజకీయ అస్థిరత నెలకొన్న నేపథ్యంలో సింగ్ రాజీనామా చేశారు.

ఉభయ సభల్లో రాష్ట్రపతి పాలనకు ఆమోదం లభించడంతో గవర్నర్ అధికారాలను ఇకనుంచి రాష్ట్రపతి ఉపయోగిస్తారు. రాష్ట్ర శాసనసభ అధికారాన్ని పార్లమెంటు స్వీకరిస్తుంది.

మణిపూర్ తీర్మానంపై మాట్లాడటానికి ప్రతిపక్ష ఎంపీలు నిరాకరించారు. బీహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై ముందస్తు చర్చకు డిమాండ్ చేసినా డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ మణిపూర్ తీర్మానంపై చర్చను ముందుకు తీసుకెళ్లడంతో మంగళవారం (ఆగస్టు 5) రాజ్యసభ గందరగోళంగా మారింది. 

Tags:    

Similar News