నాగాలాండ్‌ ఆరు జిల్లాల్లో ఎన్నికలు బహిష్కరించిందెవరు?

నాగాలాండ్ లోని ఆరు జిల్లాల్లో ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ (ENPO) ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చింది.

Update: 2024-04-19 12:06 GMT

నాగాలాండ్ లోని ఆరు జిల్లాల్లో ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ (ENPO) ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చింది. దీంతో ఆ జిల్లాల్లో శుక్రవారం ఓటింగ్ జరగలేదు. ENPO గత కొంత కాలంగా ఆర్థిక స్వయంప్రతిపత్తితో కూడిన ప్రత్యేక పాలన కోరుకుంటోంది.

నోటీసు జారీ చేసిన ఈసీ

ఎన్నికలను బహిష్కరించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రీజియన్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ENPOకి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఓటింగ్‌ను బహిష్కరించినందుకు చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే ప్రజలు "స్వచ్ఛందంగానే ఓటింగ్‌ను బహిష్కరించారని ENPO వాదిస్తోంది. సెక్షన్ 171C తమకు వర్తించదంటున్నారు.

ENPO సమావేశం..

మార్చి 30న 20 మంది ఎమ్మెల్యేలు ఇతర సంస్థలతో ENPO సమావేశమైంది. అందులో లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉండాలని కోరింది. అనంతరం ENPO తన నిర్ణయాన్ని ఎన్నికల కమిషన్‌కు తెలిపింది.

పబ్లిక్ ఎమర్జెన్సీ..

మార్చి 8న "పబ్లిక్ ఎమర్జెన్సీ" ప్రకటించిన సమయంలో ENPO, దాని అనుబంధ సంస్థలు ఎన్నికల ప్రచారాన్నిబహిష్కరించాయి. ENPO గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని కూడా పిలుపునిచ్చింది. అయితే కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇవ్వడంతో పిలుపును ఉపసంహరించుకుంది.

నాగాలాండ్‌లో ఒక లోక్‌సభ స్థానం ఉంది. దీన్ని BJP మిత్రపక్షం నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (NDPP)కి చెందిన టోఖెనో యెప్తోమికి దక్కించుకుంది. 

Tags:    

Similar News