ప్రయాణికులను దోచుకుంటున్న ప్రయివేట్ విమానయాన సంస్థలు

కోల్ కత- ముంబై కి రూ. 90 వేలు వసూలు చేస్తున్న మిగిలిన సంస్థలు

Update: 2025-12-06 08:25 GMT
చెన్నై విమానాశ్రయంలో పడిగాపులు పడుతున్న ప్రయాణికులు

దేశీయ విమాన ప్రయాణంలో ఇంకా గందరగోళం కొనసాగుతూనే ఉంది. ఇండిగో వరుసగా విమానాలు రద్దు చేయడం వలన వేల సంఖ్యలో ప్రయాణికులు విమానాశ్రయాల్లో పడిగాపులు పడుతున్నారు.

డిమాండ్ కారణంగా మిగిలిన ప్రయివేట్ ఎయిర్ లైన్స్ సంస్థలు భారీ చార్జీలను ప్రయాణీకులు నుంచి వసూలు చేస్తున్నాయి. ప్రస్తుతం వన్ వే, వన్ స్టాప్ ఎకానమీ క్లాస్ స్పైస్ జెట్ కోల్ కత- ముంబై విమాన టికెట్ ధర రూ. 90 వేలుగా ఉండగా, ముంబై- భువనేశ్వర్ కు రూ. 84,485 వసూలు చేస్తున్నారు.

బెంగళూర్- న్యూఢిల్లీ మధ్య కూడా రూ. 88,000గా వసూలు చేస్తున్నారు. అనేక ఇతర మార్గాల్లో కూడా ఎయిర్ ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంది. దేశంలో అతిపెద్ద డొమెస్టిక్ విమానయాన సంస్థ అయిన ఇండిగో రాబోయే పది రోజులలో విమాన సర్వీసులను సాధారణ స్థితికి చేరుకుంటాయని ప్రకటించింది.

ప్రస్తుతం సుంకాలు నిబంధనలు ఇబ్బందిగా ఉన్నాయని ఆరోపించింది. ఈ విషయాన్ని డీజీసీఏ కూడా పరిశీలించనుంది. వరుసగా నాలుగు రోజుల నుంచి ఇండిగో పెద్ద సంఖ్యలో విమానాలు రద్దు చేయడం వలన ప్రధాన విమానాశ్రయాల్లో గందరగోళం నెలకొంది.

చాలామంది ప్రయాణికులు తమ లగేజీని కోసం వెతుకులాడటంలో బిజీగా ఉన్నారు. చాలామంది ప్రయాణీకులు ఈ అసౌకర్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని దేశీయ ట్రాఫిక్ లో మూడింట రెండువంతుల మందిని ఇండిగోనే నియంత్రిస్తుంది.

సాధారణంగా రోజుకు 2,300 విమానాలను నడుపుతోంది. అయితే పైలట్లకు కొత్త నిబంధనలు తీసుకురావడంతో విమానయాన సంస్థ వాటిని సరిగా నిర్వహించడంలో విఫలమైంది.

విమానయాన సంస్థలలో గందరగోళం నెలకొనడంలో దేశీయ విమాన ఛార్జీలు మూడు రెట్లు పెరగాయని ట్రావెల్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు. భారత్ లో అత్యంత రద్దీగా ఉండే కారిడార్లలో ఒకటైన న్యూఢిల్లీ నుంచి ముంబై వరకూ ఒకవైపు ప్రయాణ చార్జీలు రూ. 48,972 వరకు పెరిగాయి.
అలాగే ఢిల్లీ- బెంగళూర్ మార్గంలో చార్జీలు కూడా రెండింతలు పెరిగాయి. ఇవి ప్రస్తుతం రూ. 80,069 నుంచి రూ. 88,469 గా ఉంది. కొన్ని మార్గాలలో ప్రయాణ చార్జీలు ఆరురెట్లు పెరిగాయి.
బ్లాక్ మార్కెటింగ్..
‘‘ఏ ప్రాంతంలోనైనా రూ. పదివేల టికెట్ ను రూ. 60 వేలకు అమ్ముకుంటే దాన్ని బ్లాక్ మార్కెటింగ్ అంటారు. కాబట్టి ప్రభుత్వం ఈ రేట్లను పరిశీలించాల్సిన అవసరం ఎంతైన ఉంది’’ అని నోమాడ్ ట్రావెల్ సీఈఓ, ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు అజయ్ ప్రకాశ్ అన్నారు.
విమాన సంస్థలు భారీగా డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఒక విమానయాన సంస్థకు మార్కెట్ వాటాలో 64- 65 శాతం ఇవ్వడమే మార్కెట్ గుత్తాధిపత్యమని ఆయన అభిప్రాయపడ్డారు. సంక్షోభ సమయాల్లో ఎక్కువ చార్జీలు విధించకుండా కట్టడి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఢిల్లీకి చెందిన స్టిక్ ట్రావెల్ వ్యవస్థాపకుడు, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ మాజీ అధ్యక్షుడు సుభాశ్ గోయల్ మాట్లాడుతూ.. కోవిడ్ సమయంలో విమానయాన సంస్థలపై విధించిన పరిమితులను మరోసారి విధించాలని ఆయన కోరారు.
ఇండిగో కు ఉపశమనం..
విమానయాన సంస్థ ఇండిగో కు డీజీసీఏ కొంత ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టింది. విమాన డ్యూటీ సహాయ పరిమితులు మినహాయింపులతో పాటు నియంత్రణ సంస్థ కొన్ని ఇతర సడలింపులు అందించింది.
ఇవి ఇండిగోకు అంతరాయాలను తగ్గించడానికి, సాధారణ కార్యకలాపాలు అందించడానికి ఎక్కువ పైలట్లు ఉండటానికి సహాయపడతాయి. వేరే ప్రాంతాలలో ఉన్న శిక్షణ పైలట్లు, సాధారణ పైలట్లను కూడా ఫిబ్రవరి 2026 వరకూ విమానయాన సంస్థ ఉపయోగించుకోవచ్చని డీజీసీఏ తెలిపింది. ప్రస్తుతం వాచ్ డాగ్ ఇండిగో డిప్యూట్యేషన్ పై 12 మంది ప్లైట్ ఆపరేషన్స్ ఇన్ స్పెక్టర్లు(ఎఫ్ఓఐ) లు ఉన్నారు.
‘‘ఈ ఎఫ్ఓఐలు ఇండిగో పైలట్ షెడ్యూలింగ్ ను సులభతరం చేయడానికి ఒక వారం పాటు ప్లయింగ్ డ్యూటీలు చేపట్టడానికి అనుమతించారు. ఈ పైలట్లందరికీ చెల్లుబాటు అయ్యే లైస్సెన్స్ లు ఉన్నాయి’’ అని డీజీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుతం డీజీసీఏ నిబంధనల ప్రకారం.. ఇండిగో రాత్రిపూట ల్యాండింగ్ లపై పరిమితి ఉండదు. నిబంధనల ప్రకారం ఒక పైలట్ రోజుకు ఆరు ల్యాండింగ్ లు చేయవచ్చు.
తాత్కాలికంగా ఇండిగో కోసం రాత్రి సమయం ఉదయం 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ తీసుకుంటారు. ఈ రెండు మినహాయింపులు కార్యకలాపాలకు ఎక్కువ మంది పైలెట్లు అందుబాటులో ఉండేలా చూసుకోవడానికి సహాయపడతాయి.



Tags:    

Similar News