ఆర్జేడీకి కుటుంబ వివాదాలు తలనొప్పిగా మారతున్నాయా?
ఇప్పటికి బలంగా ఉన్న ఓట్ బేస్, లాలూ జోక్యంతోనే వివాదాలు సద్దుమణిగే అవకాశం
By : The Federal
Update: 2025-11-18 11:37 GMT
నీలు వ్యాస్
బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఆర్జేడీ ఘోర పరాజయం పాలైన తరువాత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలోని లుకలుకలు బయటపడ్డాయి. ఇవి ప్రాంతీయ రాజకీయా కుటుంబాల భవిష్యత్ ను అర్థం చేసుకోవడానికి ‘ది ఫెడరల్’ తాజాగా నిర్వహించిన ‘ది క్యాపిటల్ బీట్’ ఎపిసోడ్ లో ప్రొఫెసర్ సంజయ్ కుమార్, అశోక్ మిశ్రా, టీకే రాజ్యలక్ష్మిలతో చర్చా కార్యక్రమం నిర్వహించారు.
ఆర్జేడీ ఓటమి.. కుటుంబంలో చీలిక..
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాజయం, లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో పొరపచ్చాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్ నలుగురు కుమార్తెలు రాజ్యలక్ష్మి, రాగిణి, హేమ, చంద తమ పిల్లలతో కలిసి పాట్నాలోని తమ నివాసాన్ని వదిలి ఢిల్లీకి వెళ్లిపోయారు. ఇది మొదటి కుటుంబంలో తీవ్ర విభేదాలను తెలియజేస్తోంది.
అదే సమయంలో మహాఘట్ బంధన్ ప్రచారంలో తేజస్వీ యాదవ్ కీలకంగా వ్యవహరించారు. అయితే పార్టీ ఓటమి కారణంగా తేజస్వీ యాదవ్ వ్యవహరించినందున ఆయన నాయకత్వం గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
లాలూ కుమార్తెల రాజకీయ పాత్ర పరిమితం..
లాలూ కుమార్తెలు ఆర్జేడీలో ముఖ్యమైన రాజకీయ పదవులను స్వీకరించలేదని ప్రొఫెసర్ సంజయ్ కుమార్ అన్నారు. మీసా భారతికి మాత్రమే రాజకీయ అనుభవం ఉందని, తేజ్ ప్రతాప్ యాదవ్ ఇప్పటికే పార్టీని వీడి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారని ఆయన విశ్లేషించారు.
‘‘ఈ కుటుంబ కలహాలు పార్టీకి హనీ చేస్తాయని నేను అనుకోను’’ అని ఆయన అన్నారు. ఎన్నికల తరువాత ఈ వివాదం జరిగినందున ఈ ఎపిసోడ్ విస్తృతంగా ప్రచారం పొందుతోందని అన్నారు.
లాలూ కుటుంబానికి చెందని వ్యక్తులు సంజయ్, మాజీ క్రికెటర్ రమేష్ తేజశ్విని చుట్టూ ప్రభావితం చేశారని, ఇదే కుటుంబంలో చిచ్చుకు కారణమైందని ప్రొఫెసర్ అభిప్రాయపడ్డారు.
రాజవంశ రాజకీయాలు..
లాలూ కుటుంబంలోని వివాదాలను పరిశీలించిన సీనియర్ జర్నలిస్ట్ అశోక్ మిశ్రా.. అనేక రాజవంశ రాజకీయ వివాదాలతో పోల్చారు. ఇక్కడ ఒకే నాయకుడి వారసులు పోటీ చేస్తారని అన్నారు.
రామ్ విలాస్ పాశ్వాన్, ములాయం సింగ్ యాదవ్ ఇతర కుటుంబాల వివాదాలను ఆయన పోల్చారు. లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయ వారసత్వం తల్లి రబ్రీ దేవి సమ్మతితో తేజస్వీ యాదవ్ కు సమర్థవంతంగా బదిలీ అయిందని, తేజస్వీని నయా ఆర్జేడీ బాస్ గా మార్చారని అన్నారు.
తేజ్ ప్రతాప్ యాదవ్, రోహిణి ఆచార్య, మీసా భారతి వారికి సొంత రాజకీయ లక్ష్యాలు ఉన్నాయని అన్నారు. ప్రస్తుత విభేదాలు ఆ వారసత్వంలో వాటా డిమాండ్ల తో పాటు సంజయ్, రమేష్ ప్రభావం కారణంగా గొడవలు జరుగుతున్నాయని అన్నారు.
‘‘వారు ఆర్జేడీ రాజకీయ వారసత్వం, రాజకీయ అంశాల్లో జోక్యం చేసుకోకూడదు. అది కుటుంబ సభ్యులు లేదా ఆర్జేడీ ఇతర సీనియర్ నాయకులు ఉండాలి’’ అని ఆయన పేర్కొన్నారు.
దశాబ్ధాలుగా లాలూ ప్రసాద్ యాదవ్ తో కలిసి ఉంటున్న ఈ ఇద్దరు సలహదారుల ప్రభావం పెరగడం పార్టీలోని ఇతర వర్గాల వారికి కంటగింపుగా మారిందని మిశ్రా అన్నారు.
లాలూ జోక్యంతోనే సద్దుమణుగుతుంది..
ఓటమి తరువాత తేజస్వీ యాదవ్ ఇప్పటికే ఆర్జేడీ ఎమ్మెల్యేలు, అభ్యర్థులతో సమావేశం నిర్వహించారని, ఆయన చేతిలోనే సంస్థాగత నియంత్రణ ఉందని ఇది స్పష్టం చేస్తుందని అన్నారు.
ఆ కలహాలు పరిష్కారం కాకపోతే రాబోయే రోజుల్లో ఆర్జేడీ విశ్వసనీయను దెబ్బతీస్తుందని ఆయన వాదించారు. లాలూ తన కుటుంబాన్ని పునర్వ్యవస్థీకరించుకోవాలి, తేజస్వీ యాదవ్ మాత్రమే పార్టీకి నాయకత్వం వహిస్తారని స్పష్టంగా ప్రకటించాలి. లాలూ కుమార్తెలు ఇతర పార్టీలలో చేరే విధంగా పరిస్థితులు లేవన్నారు.
ఆర్జేడీ ఓటు బ్యాంకు, తేజస్వీ నాయకత్వం..
ఆర్జేడీపై వైరం కారణంగా ఏర్పడిన పరిస్థితులను టీకే రాజ్యలక్ష్మీ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఓట్ల వాటా పరంగా ఆర్జేడీ వాటా తగ్గలేదని, బీహార్ లో ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతోందని ఆమె పేర్కొన్నారు.
మహా కూటమి మొత్తం తేజస్వీ యాదవ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంచనా వేసిందని, రాష్ట్రంలో కూటమిని ముందుకు తీసుకెళ్లడానికి మిత్రపక్షాలు ఆయన నాయకత్వంపై విశ్వాసం ఉంచాయని ఆమె ఎత్తి చూపారు.
‘‘ఈ రకమైన కుటుంబ కలహాలు సాధారణమే’’ కొంతమంది కుటుంబ సభ్యులు తమ వ్యక్తిగత రాజకీయ ప్రాముఖ్యం కారణంగా వివాదాలు లేవనెత్తినంత మాత్రానా ఓటర్లు తమ నిర్ణయాన్ని మార్చుకోరని రాజ్యలక్ష్మీ అన్నారు.
లాలూ కుమార్తెలకు రాజకీయ బేస్ లేదు..
ప్రస్తుత వివాదం నెరవేరని ఆకాంక్షల నుంచి ఉద్భవించిందని అన్నారు. మహాఘట్ బంధన్ అధికారంలోకి వస్తే కొంతమంది కుటుంబ సభ్యులు పదవులు పొందుతామని ఆశపడ్డారని కానీ అది నెరవేరలేదని రాజ్యలక్ష్మీ అన్నారు.
ఆర్జేడీ గెలిచి ఉంటే కుటుంబం చాలా ఐక్యంగా ఉండేదని, ఓటమితో ఎదురుదెబ్బ తగిలిందని అన్నారు. వారికి సొంత అనుచరులు లేరని, అభిమానులు కూడా ఉండరని అన్నారు.
ఇతర ప్రాంతీయ కుటుంబాలు..
దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీల కుటుంబాలలో కూడా ఇలాంటి ఒత్తిళ్లు ఉన్నాయని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ కుమార్తె కవిత తండ్రితో విభేదించిందని గుర్తు చేశారు.
డీఎంకే లోనూ, బీఎస్పీ, టీఎంసీలోనూ విభేదాలు ఉన్నాయని చెప్పారు. ప్రొఫెసర్ సంజయ్ కుమార్ అటువంటి వివాదాలను విస్తృత నమూనాలో ఒక భాగంగా చూశారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలు ఏక వ్యక్తి చుట్టూ కేంద్రీకృతం అవుతాయని అన్నారు. కుటుంబంలోని ప్రతి సభ్యుడు వాటా కోరుతుంటారని అన్నారు. వారసత్వం కోసం యుద్ధాలు జరుగుతుంటాయని చెప్పారు.
ప్రజలు గుర్తు పెట్టుకోరు..
లోక్ జనశక్తి పార్టీ తో సహ బీహార్ లోని ఇతర పార్టీలలో కూడా వారసత్వ సమస్యలు వచ్చాయని ఆర్జేడీకి మాత్రమే ఇది జరగలేదని ప్రొఫెసర్ కుమార్ అన్నారు. ఇలాంటి వాటిలో విజయం సాధించిన వారిని ప్రజలు నాయకుడిగా గుర్తిస్తారని అన్నారు.
ఆర్జేడీ విషయానికొస్తే తేజస్వీ యాదవ్ తో పోలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో తేజ్ ప్రతాప్ యాదవ్ ఓటమి, రోహిణి ఆచార్య ఓటమి వారి రాజకీయ నాయకత్వాన్ని ప్రశ్నలు తలెత్తిందని అన్నారు. ప్రజలు ఇలాంటి వాటిని పట్టించుకోలేరని చెప్పారు.
ఆర్జేడీకి కీలక పునాది..
ఆర్జేడీ కుంగిపోయిందా అనే ప్రశ్నకు వారు సమాధానమిస్తూ.. అంతర్గత గందరగోళం, కొంతమంది సీనియర్ నాయకుల విమర్శలు చేస్తున్నారని వారు అంగీకరించారు. అయితే పార్టీ ఓటు బ్యాంకు చాలా వరకూ పటిష్టంగా ఉందని వారు విశ్లేషించారు.
‘‘ఆర్జేడీకి ఉన్న ప్రజాభిమానం ఇప్పటి వరకూ తగ్గలేదు’’ అని ఆయన అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల వాటా సీట్లుగా మారకపోయినా దానికి దగ్గరగా ఉందని అన్నారు. లాలూ, తేజస్వీ యాదవ్ కుటుంబ వివాదాలను ఎలా పరిష్కరిస్తారనే దానిపై తేజస్వీ నాయకత్వం ఆధారపడి ఉంటుందని మిశ్రా వివరించారు.
ప్రస్తుతం ఆర్జేడీని అదే స్థాయిలో నడిపించగల సామర్థ్యం ఉన్న నాయకుడు తేజస్వీ యాదవ్ మాత్రమే అని మిశ్రా అభిప్రాయపడ్డారు.
నాయకత్వ సంధి..
బీహార్ రాజకీయాల్లో ఆర్జేడీ ప్రాముఖ్యత కొనసాగుతుందని, దాని సంస్థాగత బలం, ఓటు బ్యాంకు ఉన్నంత కాలం ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతోందని రాజ్యలక్ష్మీ అభిప్రాయపడ్డారు.
నితీశ్ కుమార్ ఆరోగ్యం, వయస్సు పాలక శిబిరంలో కూడా నాయకత్వ మార్పుకు సిద్దంగా ఉందని అన్నారు. ప్రతి ప్రాంతీయ పార్టీ ఇలాంటి సవాల్ ఎదుర్కొంటుందని ప్రొఫెసర్ కుమార్ అన్నారు.
కుటుంబ కలహాలు విశ్వసనీయతను దెబ్బతీసి, స్వల్పకాలిక అస్థిరతను సృష్టించగలవు. అయితే ఆర్జేడీ నాయకత్వం ఈ సమస్యలు అధిగమించడంలో దాని భవిష్యత్ ఆధారపడి ఉంటుందని ప్యానెల్ ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది.