పహల్గామ్ దాడి జరిగిన గంటల వ్యవధిలోనే దాడికి సిద్దం అయ్యాం: నేవీ

ఉత్తర అరేబియా సముద్రంలో నౌకలను నిలిపి ఉంచినట్లు వెల్లడించిన డీజీఎన్ఓ;

Update: 2025-05-12 05:35 GMT
విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్

ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ ఆర్థిక రాజధాని అయిన కరాచీపై దాడులు చేయడానికి తాము ఫార్వార్డ్ పొజిషన్ లోకి వెళ్లామని, జలాంతర్గాములు, నౌకలు సిద్దం చేసినట్లు వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ చెప్పారు.

కాల్పుల విరమణ తరువాత త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు.

న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్ లో జరిగిన సమావేశంలో డీజీఎంఓ లెప్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, ఎయిర్ మార్షల్ ఏకే భారతి, వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేవీ ఉన్నతాధికారి మాట్లాడారు.

పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత భారత నావిక దళానికి చెందిన క్యారియర్ యుద్ద నౌకలు, జలాంతర్గాములు, విమానయాన క్యారియర్ గ్రూప్ పూర్తి పోరాట సంసిద్దతతో సముద్రంలో వెంటనే మోహరించినట్లు నేవీ ఉన్నతాధికారి తెలిపారు.
పూర్తి స్థాయిలో సన్నద్ధత..
ఉత్తర అరేబియా సముద్రంలోని నావికా దళాలు పూర్తి స్థాయిలో పోరాట సన్నద్దతతో మోహరించబడ్డాయి. మేము ఎంచుకున్న సమయంలో కరాచీతో సహ భూమిపై ఉన్న కొన్ని కీలక లక్ష్యాలను ఛేదించడానికి పూర్తి సన్నద్దతను ప్రదర్శించామని నేవీ కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ అన్నారు.
నావిక దళ విన్యాసాలు..
ఉగ్రవాద దాడి జరిగిన 96 గంటల్లోనే అరేబియా సముద్రంలో బహుళ ఆయుధ వ్యవస్థలు, సముద్ర వ్యూహాలు, విధానాలను నేవీ పరీక్షించినట్లు, సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ నావల్ ఆపరేషన్స్(డీజీఎన్ఓ) తెలిపారు.
‘‘ఎంచుకున్న లక్ష్యాలపై వివిధ ఆయుధాలను కచ్చితంగా ఛేదించడానికి మా సిబ్బంది, ఆయుధాలు, పరికరాలు, ప్లాట్ ఫాం సంసిద్దం అయ్యాయి’’ అని ఆయన అన్నారు.
ఏప్రిల్ 22న 26 మంది పౌరులను బలిగొన్న ఉగ్రవాద దాడి తరువాత అరేబియా సముద్రంలో క్యారియర్ యుద్ధ బృందాన్ని మోహరించినట్లు డీజీఎన్ఓ తెలిపింది.
అరేబియా సముద్రం, పాక్ ప్రాదేశిక జలాలకు సమీపంలో మన యుద్ధ నౌకలను మోహరించడంతో పాకిస్తాన్ నావికాదళం, వైమానిక దళాలు రక్షణాత్మక స్థితిలో ఉంచాల్సి ఆగత్యం వాటికి ఏర్పాటు అయిందన్నారు.
‘‘భారత నావికాదళం ఈ కాలమంతా సజావుగా సముద్ర డొమైన్ అవగాహనను కొనసాగించింది. పాకిస్తాన్ యూనిట్ల స్థానం, కదలికల గురించి పూర్తిగా తెలుసు’’ అని ఆయన అన్నారు.
భారత దేశ లక్ష్యాలను సాధించడానికి సముద్రంలో ఉంటూ సముద్రంలోని లక్ష్యాలను ఛేదించడానికి సిద్ధం అయ్యామని భారత నావికా దళం పూర్తి స్థాయిలో సన్నద్ధం అయ్యామని, ముఖ్యమైన ఎంపికలను గుర్తించామని డీజీఎన్ఓ తెలిపారు.
సమకాలీనంగా పనిచేస్తున్న సైన్యం, నౌకాదళం, వైమానిక దళం..
దేశ సార్వభౌమత్వం కాపాడటంలో భాగంగా నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ పూర్తి సమన్వయంతో దాడుల విషయాలను పంచుకున్నామని తెలిపారు. భారత సైన్యం, ఎయిర్ ఫోర్స్ బలమైన ప్రతిస్పందనతో పాకిస్తాన్ అత్యవసంగా కాల్పుల విరమణ ప్రతిపాదించిందని చెప్పారు.
దేశంలో పాకిస్తాన్, లేదా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఏదైనా దుస్సంఘటన చేస్తే తగు ప్రతిచర్యలు తీసుకునేందుకు నేవీ సిద్దంగా ఉంటుందని అన్నారు. కాల్పుల విరమణ మరోసారి ఉల్లంఘిస్తే ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయో ఆదేశానికి తెలుసని హెచ్చరించారు.
ఆపరేషన్ సింధూర్..
మే 7న పాకిస్తాన్ ఉగ్రవాద కేంద్రాలపై భారత్ బాంబుల వర్షం కురిపించింది. ఆ తరువాత మే 8,9,10 తేదీల్లో పాకిస్తాన్, భారత సైనిక స్థావరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. ఆ దారుణమైన దాడులకు భారత దళాలు తీవ్రంగా స్పందించింది.
పాకిస్తాన్ లోని కీలక సైనిక స్థావరాలకు భారీగా నష్టం కలిగించింది. వారి వైమానిక రక్షణ వ్యవస్థలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, రాడార్ సైట్ లను ధ్వంసం చేసింది. అంతేకాకుండా దెబ్బతిన్న సైనిక కేంద్రాల శాటిలైట్ చిత్రాలను సైతం విలేకరుల సమావేశంలో ఆర్మీ వివరించింది. అందుకే పాకిస్తాన్ అత్యవసరంగా తోకముడిచింది. తనే స్వయంగా కాల్పుల విరమణ ఉల్లంఘించింది.
Tags:    

Similar News