విదేశీ విద్యార్థుల మీద ట్రంప్ మరొక దెబ్బ

ట్రంప్ దెబ్బతో కష్టాల్లో పడ్డ 800 మంది హార్వర్డ్ భారతీయ విద్యార్థులు;

By :  Admin
Update: 2025-05-23 11:03 GMT

విదేశీ విద్యార్థులను చేర్చుకోకుండా హార్వర్డ్ విశ్వవిద్యాలయం అధికారాన్ని ట్రంపు రద్దు చేశాడు. ఈ నిర్ణయం దాదాపు 6,800 మంది అంతర్జాతీయ విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుంది, వీరిలో 788 మంది భారతదేశం నుండి వచ్చిన విద్యార్థులు కూడా ఉన్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం గురువారం (మే 22) హార్వర్డ్ విశ్వవిద్యాలయం మీద ఉక్కుపాదం మోపింది. అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకునే విశ్వవిద్యాలయ అధికారాన్ని రద్దు చేసింది.

హెంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిష్టి నోయెమ్ ఈ చర్య తీసుకున్నారు. 2025-26 విద్యా సంవత్సరం నుండి విదేశీ విద్యార్థులను చేర్చుకునే హార్వర్డ్ స్కూల్ అధికారాన్ని ఖతం చేసే చర్య ఇది. ఆ మధ్యా గాజా మీద ఇజ్రేల్ సాగిస్తున్నహత్యాకాండను నిరసిస్తూ విద్యార్థులు ప్రదర్శనలు చేసినప్పటి నుంచి ట్రంప్ యూనివర్శిటీ మీద ఆగ్రహం పెంచుకున్నాడు. ఇలాంటి కార్యక్రమాలను అనుమతించడం వల్ల క్యాంపస్ లో యూదు విద్యాార్థులు అభద్రత ఫీల్ అవుతున్నారని ట్రంపు చెబుతున్నాడు. ఆ తర్వాత విదేశీ విద్యార్థుల రాజకీయ విధేయత తెలుసుకునేందుకు విద్యార్థుల రికార్డులను సమర్పించాలని ట్రంప్ సర్కార్ యూనివర్శిటీని కోరింది. అయితే, హార్వర్డ్ దానిని నిరాకరించింది. దీనితో ఆగ్రహం వహిస్తూ విదేశీ విద్యార్థుల అడ్మిషన్లను ఆపేస్తూ ట్రంప్ ఈ చర్య తీసుకున్నారు.

ఈ నిర్ణయం హార్వర్డ్ లోని దాదాపు 6,800 మంది అంతర్జాతీయ విద్యార్థుల భవిష్యత్తును నేరుగా ప్రమాదంలో పడేస్తుంది. వీరిలో దాదాపు 800 మంది భారతదేశం నుండి వచ్చిన విద్యార్థులు ఉన్నారు. ఎందుకంటే ఈ విద్యార్థులను ఇప్పుడు ఇతర సర్టిఫైడ్ విద్యా సంస్థలకు బదిలీ చేయవలసి ఉంటుంది లేదా యునైటె డ్ స్టేట్స్ లో వారు వీసా హెూదాను కోల్పోయే ప్రమాదం ఉంది.

భారతీయ విద్యార్థులపై దాడి

ఒక విధంగా ఇది భారతీయ విద్యార్థుల మీద దాడిగా పరిగణించవచ్చు. హార్వర్డ్ రికార్డుల ప్రకారం ప్రతి సంవత్సరం 500 నుండి 800 మంది భారతీయ విద్యార్థులు, స్కాలర్లు యూనివర్శటీ స్కూల్క్ డిపార్టుమెంట్లోలో చేరుతున్నారు. ప్రస్తుతం, 788 మంది భారతీయ విద్యార్థులు ప్రస్తుతం హార్వర్డ్ చదువుతున్నారు. ఎక్కువగా గ్రాడ్యుయేట్-స్థాయి కార్యక్రమాలలోనే ఉన్నారు. ట్రంప్ పరిపాలన చర్యతో, ఈ విద్యార్థులు చట్టబద్ధంగా యునైటెడ్ స్టేట్స్ లోనే ఉండాలనుకుంటే మరొక SEVP-సర్టిఫైడ్ సంస్థకు బదిలీ కావాలి. అలా చేయడంలో విఫలమైతే వీసా రద్దుఅవుతుంది. ఆపైన బహిష్కరణకు దారితీయవచ్చు.

చాలా మంది భారతీయ విద్యార్థులు దీర్ఘకాలిక డాక్టోరల్ లేదా బహుళ-సంవత్సరాల గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ లలో చేరారు వారిని కోర్సు మధ్యలో మరొక సంస్థకు బదిలీ చేయడం వల్ల వల్ల విద్యాపరంగా అంతరాయం కలుగుతుంది. ట్రంప్ తాజా చర్యతో ప్రత్యామ్నాయాలను అన్వేషించడానికి విద్యార్థులకు తగినంత సమయం కూడా లేదు.

ఇది చట్టబద్దమైనదేనా?

అమెరికా ప్రభుత్వానికి దేశంలోకి ఎవరు రావాలనే దాన్ని నిర్ణయించే అధికారం ఉంది. అదే విధంగా SEVP కింద విశ్వవిద్యాలయాలను ధృవీకరించేందుకు లేదా రద్దు చేసేందుకు అధికారం హెూంల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి పవర్ ఉంది.

'విదేశీ విద్యార్ధులను చేర్చుకోవడం విశ్వవిద్యాలయాలకు హక్కు కాదు, ఒక ప్రత్యేక హక్కు' అని నోయెమ్ నొక్కిచెప్పారు. ఈ కార్యక్రమం కళాశాలల్లో చేరిన విదేశీ విద్యార్థులకోసం డాక్యుమెంటేషన్ జారీ చేసే సామర్థ్యాన్ని ఇస్తుంది. తరువాత, విద్యార్థులు యునైటెడ్ స్టేట్స్ లో చదువుకోవడానికి వీసాలు పొందడానికి దరఖాస్తు చేసుకుంటారు. కొత్త విధానం 2025-2026 విద్యా సంవత్సరం నుండి అమలులోకి వస్తుందని నోయెమ్ లేఖలో పేర్కొన్నారు. అయితే, ఇంకా డిగ్రీ పూర్తి చేయని అంతర్జాతీయ విద్యార్థులు వేరే విశ్వవిద్యాలయానికి బదిలీ కావాలి. లేకుంటే వారు అమెరికాలో ఉండటానికి చట్టపరమైన అనుమతిని కోల్పోతారు. అలాగే, 2025 శరదృతువులో( ఫాల్) హార్వర్డ్ లో ఉండబోతున్న విద్యార్థులు అనుమతి కోల్పోతారు.

ఎందుకు ఈచర్య తీసుకున్నారు.

విదేశీ విద్యార్థుల రికార్డులను సమర్పించాలన్న అభ్యర్థనను నిరాకరించినందున ట్రంప్ పరిపాలన హార్వర్డ్ విశ్వవిద్యాలయం స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ (SVEP) ను రద్దు చేయాలని నిర్ణయించిందని హెూంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిష్టి నోయెమ్ ఒక లేఖలో తెలిపారు.

'యూదు విద్యార్థులకు క్యాంపస్ లో అభద్రతకలిగేలా యూనివర్శిటీ విధానాలున్నాయి. విశ్వవిద్యాలయం హమాస్ అనుకూల సానుభూతిని ప్రోత్సహిస్తున్నది. జాత్యహంకార వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నది"అని X పోస్టులో నోయెమ్ ఆరోపించాడు. అంతేకాదు, యూనివర్శిటీ చైనా కమ్యూనిస్టు పార్టీ అనుకూల వైఖరిని కూడా ప్రదర్శిస్తున్నదని కూడా నోయెమ్ ఆరోపించాడు.

పాలస్తీనా అనుకూల నిరసనలను కట్టడి చేయాలన్న డిమాండ్ తో పాటు క్యాంపస్ లోని వైవిధ్యభరితమయిన వాతావారణాన్నిధ్వంసం చేసేందుకు చేసిన ట్రంప్ డిమాండ్లను పాటించడానికి హార్వర్డ్ విశ్వవిద్యాలయం నిరాకరించింది. దీనితో ట్రంప్ పరిపాలన ఈ వి ద్యాసంస్థ మీద యుద్ధం ప్రకటించాడు. మొదట డిపార్ట్ మెంట్ ఆఫ్ హెూమ్ల్యండ్ సెక్యూరిటీ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ వంటి ఫెడరల్ ఏజెన్సీలు విశ్వవిద్యాలయ గ్రాంట్లను నిలిపివేసాయి.

హార్వర్డ్ నిషేధాన్ని వెనక్కి తీసుకోగలదా?

ట్రంప్ పరిపాలన చర్య చట్టవిరుద్ధమని, దాని విద్యా లక్ష్యానికి హానికరమని హార్వర్డ్ ఖండించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేయడానికి విశ్వవిద్యాలయం చట్టపరమైన మార్గాలను కూడా అన్వేషిస్తోందని, ఈ చర్య వల్ల నష్టపోయే విద్యార్థులకు మార్గదర్శకత్వం అందించడానికి కృషి చేస్తోందని యూనివర్శిటీ అధికారులు హామీ ఇస్తున్నారు.

హార్వర్డు అభ్యర్థించిన పత్రాలను సమర్పించడానికి , SEVP హెూదాను పునరుద్ధరించాలని ట్రంప్ ప్రభుత్వం అంగీకరిస్తే తాను ప్రభుత్వ డిమాండ్లను డెబ్బయి రెండు గంటల్లో అమలు చేసేందుకు యూనివర్శిటీ అంగీకరించింది. సర్కారు డిమాండ్లలో 'అంతర్జాతీయ విద్యార్థుల కాండక్టు రికార్డులు, నిరసన కార్యకలాపాల ఆడియో వీడియో రికార్డింగు లు ఉన్నాయి.

ప్రభుత్వ నిర్ణయాన్ని సమీక్షించడానికి లేదా నిరోధించడానికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇంతలో, బాధిత విద్యార్థులు తమ తదుపరి చర్యలపై చట్టపరమైన మరియు విద్యాపరమైన సలహాలను కూడా తీసుకోవచ్చు.

విద్యార్థులు అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు

విద్యార్థులలో విస్తృతంగా అనిశ్చితి మరియు భయం ఉంది. ఒక విద్యార్థి AFP కి మాట్లాడుతూ. "అందరూ కొంచెం భయాందోళన చెందుతున్నారు" అని అన్నారు. మరొక విద్యార్థి. "ఇది భయానకంగా మరియు విచారకరంగా ఉంది... పాఠశాలలో చేరడం నా జీవితంలో గొప్ప అదృష్టం" అని అన్నారు.

Tags:    

Similar News