ప్రయాణీకుల జేబుకు చిల్లు పెట్టిన కేంద్రం
రద్దీ సమయాల్లో క్యాబ్, టాక్సీల ధరలు పెంచుకోవచ్చన్న రవాణా మంత్రిత్వశాఖ;
By : Praveen Chepyala
Update: 2025-07-02 12:04 GMT
ఓలా, ఉబర్ వంటి క్యాబ్ సర్వీసులు వాడే వారికి కేంద్రం షాక్ ఇచ్చింది. రద్దీ సమయాల్లో చార్జీలు రెండింతలు పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఈ ఆర్డర్ ప్రకారం.. ప్రైమ్ సమయాల్లో 1.5 రెట్లు, మిగిలిన సమయాలలో 50 శాతం కంటే తక్కువ కాకుండా వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవచ్చు. కొత్తగా తీసుకొచ్చిన మోటార్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు(ఎంవీఏజీ) 2025 లో భాగంగా వీటిని ప్రవేశపెట్టారు.
ఆటోలు, బైక్ టాక్సీలు, సహ వివిధ వాహానాలకు రాష్ట్ర ప్రభుత్వాలు బేస్ రేట్ ను తెలియజేస్తాయని మార్గదర్శకాల్లో కేంద్రం పేర్కొంది.
రైడ్ రద్దు చేస్తే..
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం ఇక ముందు ఏకపక్షంగా బుక్ చేసుకున్న ఆర్డర్ ను రద్దు చేసుకోవడం కుదరదు. ఇలా చేస్తే 100 మించని చార్జీలలో 10 శాతం డ్రైవర్ పై విధిస్తారు. ఇలాంటి జరిమానా కూడా డ్రైవర్, వినియోగదారుడి మధ్య విభజించబడతాయి.
ఈ నోటికేషన్ జారీ చేసిన మూడు నెలల్లోపు సవరించిన మార్గదర్శకాలను స్వీకరించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. సవరించిన నిబంధనలలో కూడా ఇప్పటికే పేర్కొన్న వాటికి అదనంగా ఈ నిబంధనలు చేర్చడానికి కూడా వారికి అనుమతి ఉంది.
చార్జీల సవరణ..
ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతున్న కారణంగా వినియోగదారులపై భారం పెరగకుండా చూసుకోవడానికి, అగ్రిగేటర్లు ఆఫర్ ల ద్వారా రేట్లు తగ్గించకుండా చూడటానికి చార్జీల సవరణ చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది.
మార్గదర్శకాలలోని నిబంధనల 17.1 ప్రకారం.. ‘‘సంబంధిత వర్గం లేదా తరగతి మోటార్ వాహనాలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించే చార్జీ అగ్రిగ్రేటర్ నుంచి సేవలను పొందే ప్రయాణీకులకు వసూలు చేయాల్సిన ప్రాథమిక చార్జీగా ఉంటుంది’’ అని రవాణా మంత్రిత్వశాఖ తెలిపింది.
‘‘అగ్రిగ్రేటర్ బేస్ ధర కంటే కనీసం 50 శాతం తక్కువ.. పైన తెలిపిన నిబంధనల ప్రకారం బేస్ ధర కంటే రెండు రెట్లు గరిష్ట డైనమిక్ ధరను వసూలు చేసుకోవచ్చు’’ అని ప్రభుత్వం వెల్లడించింది.
‘‘ప్రయాణీకుడు ప్రయాణించిన దూరం, ప్రయాణీకుడు ఉన్న స్థానం దగ్గరు వెళ్లడానికి అయిన ఇంధనం ఖర్చు వంటివి సహ కనీసం 3 కిలోమీటర్ల వరకూ బేస్ చార్జీ కింద వసూలు చేసుకోవచ్చు’’ అని వెల్లడించింది.
డ్రైవర్.. ప్రయాణీకుల భద్రత
కొత్త మార్గదర్శకాలు వినియోగదారుల భద్రత, డ్రైవర్ సంక్షేమం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని, తేలికపాటి నియంత్రణ వ్యవస్థలు అందించడానికి ఈ చర్య తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది.
ప్రయాణీకుల భద్రత కోసం అగ్రిగేటర్ వాహానాలు కు ట్రాకింగ్ పరికరాలు అనుసంధానించి, దాని నుంచి సమాచారం రాష్ట్ర ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ కమాండ్, కంట్రోల్ సెంటర్ కు అనుసంధానించబడిందని నిర్ధారించుకోవాలని కేంద్రం పేర్కొంది.
అలాగే అగ్రిగ్రేటర్లు వార్షిక శిక్షణ కూడా నిర్వహించాలంది. ఒప్పందం తరువాత కూడా డ్రైవర్లలో ఐదుశాతం కంటే తక్కువ రేటింగ్ ఉన్న డ్రైవర్లకు ప్రతి మూడు నెలలకు ఒకసారి రిఫ్రెషర్ శిక్షణా పొందాలని మార్గదర్శకాలు పేర్కొన్నాయి. నిబంధనలు పాటించకపోతే వారికి ఒప్పందంలో కొనసాగడానికి వీలులేదు. అగ్రిగ్రేటర్, ప్రయాణీకులకు కనీసం రూ. 5 లక్షల బీమాను అందించాలని కూడా ప్రభుత్వం తెలిపింది.
బైక్ టాక్సీలకు ఆమోదం..
కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా అగ్రిగ్రేటర్ల ద్వారా ప్రయాణీకుల ప్రయాణాలకు రవాణాయేతర మోటార్ సైకిళ్లను ఉపయోగించడానికి అనుమతించింది. అయితే వీటికి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం అవసరం.
మార్గదర్శకాల ప్రకారం.. రాష్ట్రప్రభుత్వం చట్టంలోని సెక్షన్ 67 లోని సబ్ సెక్షన్ 3 కింద తన అధికారాలను వినియోగించుకుని, ప్రయాణీకుల ప్రయాణం కోసం రవాణా కానీ మోటార్ వాహనాలను ఉపయోగించడానికి అనుమతించవచ్చు.
ఈ చర్య రాపిడో, ఉబర్ వంటి బైక్ టాక్సీ ఆపరేటర్లకు ఉపశమనం కలిగిస్తుంది. వారు చాలాకాలంగా చట్టబద్దమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కర్ణాటక వంటి రాష్ట్రాలలో ఇటీవల బైక్ టాక్సీలపై నిషేధం విధించడం విస్తృతమైన నిరసనలకు దారి తీసింది.