‘‘సాధించలేరు అనుకున్నది సాధించి చూపారు’’

ఆర్యభట్టు ఉపగ్రహ ప్రయోగం జరిగి నేటికీ యాభై సంవత్సరాలు పూర్తి;

Translated by :  Praveen Chepyala
Update: 2025-04-19 11:07 GMT

(మూలం.. నిఖిల్ నారాయణ్)

భారత్ తన మొట్టమొదటి ఉపగ్రహం అయిన ఆర్యభట్టును ఇదే రోజు అంటే ఏప్రిల్ 19, 1975న సోవియట్ యూనియన్ సాయంతో అంతరిక్షంలోకి పంపింది. ఐదవ శతాబ్ధపు భారతీయ గణిత, ఖగోళ శాస్త్రవేత్త అయిన ఆర్యభట్ట పేరు మీద 360 కిలోలు ఉన్న ఉపగ్రహాన్ని కపుస్టిన్ యార్ లోని ప్రయోగ స్థలం నుంచి కాస్మోస్ అనే రాకెట్ ద్వారా ప్రయోగించారు.

స్వాతంత్య్రం వచ్చిన తరువాత మనకు అంతరిక్ష పరిజ్ఞానం మూడు దశాబ్ధాల వరకూ అందని ద్రాక్షలాగే మారింది. అయితే ఈ ప్రయోగానికి ఒక దశాబ్ధం క్రితమే బీజం పడింది. ఈ మిషన్ ను ఎక్కువగా భౌతిక శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ రూపొందించారు.

ఆయన అంతరిక్షాన్ని ఒక వ్యర్థ ప్రాజెక్ట్ గా కాకుండా కొత్తగా ఏర్పడిన స్వతంత్య్ర దేశానికి అభివృద్ది చెందే సాధనంగానే చూశారు. గ్రామీణ తరగతి గదులకు పాఠాలు ప్రసారం చేయడం, వాతావరణాన్ని మ్యాపింగ్ చేయడం, కమ్యూనికేషన్ లను సాధ్యం చేయడం ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.

1968 లో అప్పటి అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్, అహ్మాదాబాద్ ఫిజికల్ రీసెర్చీ లాబోరేటరీ డైరెక్టర్ అయిన సారాభాయ్ ఉన్న ఆయన తన సహచర ప్రొఫెసర్ యూఆర్ రావును ప్రయోగాత్మక ఉపగ్రహాన్ని అభివృద్ది చేయమని కోరారు.
ఆయన ఇందులో విశేష ప్రతిభ కనపరచడంతో ఈ ప్రాజెక్ట్ కు నాయకత్వం వహించమని కోరాడు. అయితే సంకోచం కారణంగా ఒక సంవత్సరం పాటు కాలయాపన చేశాడు. కానీ చివరికి సారాభాయ్ కోరికను యూఆర్ రావు మన్నించారు.
ఆయనకు తనకు కావాల్సిన ఇంజనీర్లను త్రివేండ్రంలోని స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్(ఎస్ఎస్టీసీ) నుంచి(తరువాత ఇది విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ గా మారింది) నియమించుకున్నారు.
కొత్తగా స్థాపించబడిన శాటిలైట్ సిస్టమ్స్ డివిజన్ (ఎస్ఎస్డీ) ను ఏర్పాటు చేశారు. స్ట్రక్చర్ గ్రూప్ నుంచి ముగ్గురు, పీఆర్ఎల్ నుంచి 25 మంది ఇక్కడకు చేరుకున్నారు.
వీరంతా భారత్ మొట్టమొదటి ఉపగ్రహాన్ని నిర్మించాలనే ప్రతిష్టాత్మక మిషన్ కు రాత్రి పగలు కృషి చేశారు. తక్కువ ఖర్చుతో కూడిన అమెరికన్ స్కౌట్ రాకెట్ ను ప్రయోగ వాహానంగా ఎంచుకున్నారు. స్కౌట్ రాకెట్ పేలోడ్ సామర్థ్యంతో అనుసంధానించబడిన వంద కిలోల ఉపగ్రహాన్ని తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
అనేక మలుపులు..
1971 ఏప్రిల్ లో సోవియట్ నాయకులు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి ఒక ప్రతిపాదన చేశారు. మాస్కో లో భారత రాయబారి డీపీ ధర్ ద్వారా ఇది జరిగింది. ఆయన ద్వారా వచ్చిన లేఖను ప్రధాని, సారాభాయ్ కు అందజేసింది. అతను రావును ఈ లూప్ లోకి తీసుకొచ్చాడు.


 


సోవియట్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అంతరిక్ష సహకారంపై ఆసక్తిని వ్యక్తం చేసింది. తరువాత రావును ఢిల్లీలోని సోవియట్ రాయబారీని కలవని కోరారు. భారత్ - యూఎస్ఏతో సన్నిహితంగా ఉండటంపై అప్పట్లో యూఎస్ఎస్ఆర్ ఆందోళన చెందిందని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ పరిణామాలన్నీ కూడా భారత్ ముందు మాస్కో ఓ చక్కటి ప్రతిపాదన చేయడానికి దారి తీసింది.
భారత్ లోని సోవియట్ రాయబారీ నికోలాయ్ పెగోవ్.. రావును ఇలా అడిగారు. ‘‘ చైనా ప్రయోగించిన మొదటి ఉపగ్రహం బరువు ఎంత? ’’ అని. ఆ సమయంలో భారత్ వంద కిలోల బరువుతో ఉన్న ఉపగ్రహం రూపొందించాలని అనుకుంటోంది.
కానీ ఏప్రిల్ 24న, 1970న చైనా 173 కిలోల ఉపగ్రహాన్ని డాంగ్ ఫాంగ్ హాంగ్ -1 ద్వారా నింగిలోకి పంపింది. భారత్ ముందున్న లక్ష్యం స్పష్టమైంది.
భారత్ తయారు చేయబోయే ఉపగ్రహం బరువు మూడు వందల కిలోలు దాటింది. ఆగష్టు 1971 లో రష్యన్లతో జరిగిన సమావేశం నాటికి రావు బృందం 360 కిలోల ఉపగ్రహం కోసం సిద్దమవుతున్నారు.
షెడ్లలో ఉపగ్రహ నిర్మాణం..
చైనాను అధిగమించడానికి ఆసక్తిగా ఉన్న భారత్ కు సోవియట్ లు దీనిని ప్రారంభించడానికి అంగీకరించారు. క్రెమ్లిన్ ప్రతిపాదన అధికారిక మార్గాల ద్వారా వచ్చింది. ఇందుకు కారణం భౌగోళిక రాజకీయాలే.
దురదృష్టవశాత్తూ డిసెంబర్ 1971 లో సారాభాయ్ అనూహ్యంగా మరణించారు. అయితే ఆయన మరణం నాయకత్వ శూన్యతను తీసుకురాలేదు. ప్రొఫెసర్ సతీష్ ధావన్ ఈ నాయకత్వ బాధ్యతలు తీసుకున్నారు.


 


కానీ అతను తన పనికోసం ఒక సంవత్సరం పాటు వేచి చూడాల్సి ఉంటుంది. ప్రొఫెసర్ ఎంజీకే మీనన్ తాత్కలిక అధ్యక్షతన ఇండో యూఎస్ఎస్ఆర్ ఒప్పందం కుదిరింది. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఈ ప్రాజెక్ట్ ప్రభుత్వ నిధులలో మూడు కోట్ల రూపాయలను పొందడంలో కీలకపాత్ర పోషించారు.
కొంతకాలం తరువాత ఇస్రోకు నాయకత్వం వహించిన ప్రొఫెసర్ రావు.. ఓ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పారు. ఇందిరాగాంధీ ప్రాజెక్ట్ బడ్జెట్ ను ఆమోదించారు.
సోవియట్ వాహనం నుంచి భారత్ మొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించే చారిత్రక ఒప్పందం పై 1972 మే 10న యూఎస్ఎస్ఆర్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అధ్యక్షుడు ఎం కెల్డిష్, ప్రొఫెసర్ ఎంజీకే మీనన్ సంతకం చేశారు.
రావును భారత్ ను ప్రాజెక్ట్ డైరెక్టర్ గా నియమించారు. సోవియట్ డాక్టర్ వీఎం కోవ్టునెంకో అదే పాత్రను పోషించారు. ఆ తరువాత అంతరిక్ష కార్యక్రమానికి నాయకత్వం వహించనున్న ప్రొఫెసర్ సతీష్ ధావన్ సెలవు నుంచి వచ్చి సారాభాయ్ స్థానంలో అడగుపెట్టారు.
కర్ణాటక పరిశ్రమల కార్యదర్శి సతీష్ చంద్రను ఒప్పించిన తరువాత రావు బెంగళూర్ పీన్యా పారిశ్రామిక ప్రాంతంలో నాలుగు ఆస్ బెస్టాస్ పై కప్పు గల షెడ్లను పొందారు. పీన్యా సౌకర్యం అధికారికంగా సెప్టెంబర్ 1972 లో ప్రారంభించబడింది. ఇక్కడ వివిధ నిపుణులు, సహాయక సిబ్బందితో సహ మొత్తం 150 మంది సిబ్బంది చేర్చడానికి విస్తరించింది.
అక్కడే ఉపగ్రహం రూపుదిద్దుకుంది. ఉపగ్రహాలను నిర్మించడంలో దాదాపుగా అనుభవం లేని ఇంజనీర్ల బృందం మొదటి నుంచి నిర్మించింది. రావు ఉపగ్రహం కోసం కొన్ని భాగాలను నాసా నుంచి తన పరిచయాల ద్వారా రుణం, భర్తీ ప్రాతిపదికన సేకరించాడు. ఒక భారతీయ ఉపగ్రహం, ఒక సోవియట్ రాకెట్.. మరికొన్ని ఇతర భాగాలు. ఇలా మొత్తం సేకరించాడు.
ఆర్యభట్టు పేరు ఎందుకు?
రావు అతని బృందం విద్యుత్ వ్యవస్థలు.. టెలిమెట్రీ వైఖరి నియంత్రణ, ఉష్ణ నియంత్రణ వంటి ప్రతిదాన్ని రూపొందించి నిర్మించాల్సి వచ్చింది. 1975 ప్రారంభంలో రావు, ఇతర ఉపగ్రహానికి మూడు పేర్లను ఇందిరాగాంధీకి సిఫార్సు చేశారు. అందులో మొదటిది ఆర్యభట్టు, తరువాత జవహార్, మైత్రి(ఇండో సోవియట్ స్నేహాం కోసం) ఉన్నాయి. అందులో ఆర్యభట్టు పేరును ప్రధాని ఎంచుకున్నారు.
అనుకున్నంత మేర ప్రయోగం సక్సెస్ అయింది. ఆర్యభట్టను 620 కిలోమీటర్ల అపోజీ, 562 కిలోమీటర్ల పెరిజీ 50. 7 డిగ్రీల వంపుతో కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ప్రయోగించిన దాదాపు 90 నిమిషాల తరువాత బేర్స్ లేక్, షార్, బెంగళూర్ లోని గ్రౌండ్ స్టేషన్లను ఉపగ్రహం నుంచి బలమైన టెలిమెట్రీ సంకేతాలను అందుకున్నాయి.


 


ఇది భారత్, సోవియట్ జట్ల ఉత్సాహం ఆకాశాన్ని తాకింది. ఆన్ బోర్డ్ విద్యుత్ వైఫల్యం కారణంగా ఆపివేయాల్సి మూడు శాస్త్రీయ పరికరాలను మినహాయించి, ఉపగ్రహం రూపొందించిన ఆరు సంవత్సరాల ఆపరేటింగ్ జీవితం వరకూ సాధారణ కార్యకలాపాలు కొనసాగాయి.
రెండు దేశాలు మిషన్ విజయవంతమైనదని ప్రకటించారు. మరీ ముఖ్యంగా అది ఒక ప్రకటన చేసింది. భారత్ అంతరిక్ష క్లబ్ లో చేరడం మాత్రమే కాదు. తన సొంత ఉపగ్రహాలను త్వరలో దాని స్వంత ప్రయోగ వాహనాలను కూడా నిర్మిస్తోంది. ఆర్యభట్ట కేవలం ఒక ఉపగ్రహం కాదు. ఒక దేశం అసాధ్యాన్ని ఊహించగలదని అది రుజువు చేసింది.
ఆపై షెడ్ ల సమూహాంలో ముక్కలుగా, ధ్వని ఆన్ బోర్డ్ వ్యవస్థలతో పనిచేసే ఉపగ్రహాన్ని రూపొందించడం, తయారు చేయడం పరీక్షించడం, నిర్మించడం కొనసాగించింది.
యాభై సంవత్సరాల తరువాత ఆర్యభట్ట, భారత్ ఉపగ్రహ, రాకెట్ మార్గదర్శకులు సృష్టించిన వారసత్వం ప్రతి విజయవంతమైన ప్రయోగంలో ప్రతి కొత్త ఉపగ్రహంలో సజీవంగా ఉంది. ఇస్రో రాకెట్ ఎగిరిన ప్రతిసారీ జ్వాల బాటలో పీన్యా షెడ్డు ఉంటుంది.


Tags:    

Similar News