‘ ది ముకాబ్’ నిర్మాణాన్ని ప్రారంభించినట్లు ప్రకటించిన సౌదీ

తమ దేశాన్ని చమురు ఆధారిత ఆదాయం ద్వారానే కాకుండా ఇతర రంగాల నుంచి కూడా ఆదాయాన్ని ఆర్జించాలనే లక్ష్యంగా పెట్టుకున్న సౌదీ పాలకులు ఓ అరుదైన నిర్మాణానికి అంకురార్పణ..

By :  491
Update: 2024-10-26 13:42 GMT

ప్రపంచంలోనే అతి ఎత్తైన మరో భవన నిర్మాణానికి రంగం సిద్దమైంది. సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో ఇది రూపు దిద్దుకోనుంది. ఈ భవన నిర్మాణానికి దాదాపు 50 బిలియన్ డాలర్ల వరకూ ఖర్చు అవుతుందని, ఇదే ప్రపంచానికే ఓ ఐకానిక్ స్ట్రక్చర్ అవుతుందని సౌదీ పాలకులు ఆశిస్తున్నారు.

తమ దేశానికి టూరిజం పరంగా మంచి ఆదాయవనరుగా ఈ ఐకానిక్ స్ట్రక్చర్ నిలుస్తుందని భావిస్తున్నారు. దీనికి ‘ ది ముకాబ్’ అని పేరు పెట్టారు. అరబిక్ లో ముకాబ్ అంటే క్యూబ్ అని అర్థం. ‘ మేము ది ముకాబ్ నిర్మాణాన్ని ప్రారంభించాం’ అని సౌదీ ప్రకటించింది.

20 ఎంపైర్ భవనాల అంత స్థలంలో..
ది ముకాబ్ 1,300 అడుగుల పొడవు, 1,200 అడుగుల వెడల్పుతో, 2 మిలియన్ చదరపు మీటర్ల అంతస్తులో ఉండేలా ప్రణాళిక రూపొందించారు. ఇది 20 ఎంపైర్ స్టేట్ భవనాలకు సమానమైన స్థలం అని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన బుర్జ్ ఖలీఫా ఉన్న దుబాయ్ నుంచి ఇది వేయికిలోమీటర్ల దూరంలో ఉండబోతోంది.
ఇది క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ “సౌదీ విజన్ 2030” లో భాగం, ఇది దేశం చమురుయేతర GDPని $51 బిలియన్లకు పెంచడం, 3.34 లక్షల ఉద్యోగాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. సంక్షిప్తంగా, దేశ ఆర్థిక వ్యవస్థను చమురు మీదే కాకుండా ఇతర రంగాల నుంచి ఆదాయ వనరులను సేకరించడం లక్ష్యంగా పెట్టుకోవాలని సౌదీ యువరాజు ఆలోచన.
ది ముకాబ్..
ఈ భవనం ఫ్యూచరిస్టిక్ సిటీగా పనిచేసేలా రూపొందించబడింది. ఇందులో 1.04 లక్షల రెసిడెన్షియల్ యూనిట్లు, 9,000 హోటల్ గదులు, కార్యాలయాలు, అలాగే హై-ఎండ్ రిటైల్, డైనింగ్, లీజర్ సదుపాయాలు ఉంటాయి. భవనం ముఖభాగం చుట్టూ భారీ స్క్రీన్‌లతో సహా లీనమయ్యే, AI-ఆధారిత సాంకేతికతను సందర్శకుల అనుభవాలను మెరుగుపరచడానికి కూడా ఉపయోగించవచ్చు.
భవిష్యత్ కాలాన్ని దృష్టిలో పెట్టుకుని, ది ముకాబ్ డిజైన్ సౌదీ అరేబియా వారసత్వం, సంప్రదాయాల ప్రకారం నిర్మించబోతున్నారు. క్యూబ్ ఆకారం నజ్దీ నిర్మాణ శైలి నుంచి తీసుకోబడింది. స్థానిక ఎడారి అందాల శైలిలను కూడా ఇందులో పొందుపరచబోతున్నారు.
వివాదాలు..
అయితే, మక్కాలోని పవిత్ర కాబాను పోలి ఉండేలా ఉందని కొంతమంది విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ భవన నిర్మాణం వలన లక్షలాది మంది స్థానిక ప్రజలు స్థానభ్రంశం చెంది, ఇతర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉందని వాదిస్తున్నారు. అలాగే ఈ భవన నిర్మాణం వలన కూలీలను శ్రమ దోపిడీ గురవుతారని అంటున్నారు.



Tags:    

Similar News