భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
జీఎస్టీలో సంస్కరణలు తీసుకురావాలని ప్రభుత్వ నిర్ణయంతో మదుపరుల్లో పెరిగిన నమ్మకం;
జీఎస్టీలో సంస్కరణలు ప్రవేశపెట్టాలనే ప్రభుత్వ నిర్ణయంతో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం దూసుకుపోయాయి. ప్రారంభ ట్రేడింగ్ లో 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 888.96 పాయింట్లు పెరిగి 81,456.67 వద్ద ముగిసింది.
50 షేర్ల ఎన్ఎస్ఈ నిఫ్టీ 265.7 పాయింట్లు పెరిగి 24,980.75 వద్ద ముగిసింది. దేశంలో శక్తివంతమైన ఆర్థిక కౌన్సిల్ అయిన జీఎస్టీ కౌన్సిల్ మెజారిటీ రకాలైన వస్తువులపై పన్నులను తగ్గించింది.
రోటీ, పరాఠా నుంచి హెయిర్ ఆయిల్, ఐస్ క్రీం, టీవీల వరకూ సాధారణ వినియోగ వస్తువుల ధరలు తగ్గుతాయి. వ్యక్తిగత ఆరోగ్యం, జీవిత బీమాపై పన్నులు తొలగించారు. నవరాత్రి మొదటి రోజు అయిన సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వచ్చేలా 5 శాతం, 18 శాతానికి స్లాబులను పరిమితం చేస్తూ జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది.
సెన్సెక్స్ లో మహీంద్రా అండ్ మహీంద్రా అత్యధికంగా 7.50 శాతం మేర లాభపడింది. బజాజ్ ఫైనాన్స్, హిందూస్థాన్ యూనిలీవర్, బజాజ్ ఫిన్ సర్వే, ఐటీసీ, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్ కూడా లాభాలబాట పట్టాయి. ఎటర్నల్, టాటా స్టీల్, ఎన్ టీపీసీ, హెచ్ సీఎల్ టెక్ వెనకబడి ఉన్నాయి.