ట్రంప్ భార్య మెలానియా విగ్రహం మాయం: సొంత ఊర్లో ఘోర అవమానం
విగ్రహం పాదాల వరకు నరికి మిగతా భాగాన్ని ఎత్తుకెళ్లిందెవరు? అగ్రరాజ్య పౌరురాలికి స్లోవేనియా దెబ్బ?;
By : Amaraiah Akula
Update: 2025-05-21 13:38 GMT
అగ్రరాజ్య అధిపతి డోనాల్డ్ ట్రంప్ భార్య, అమెరికా ప్రధమ పౌరురాలు మెలానియాకి సొంత ఊర్లో ఘోరమైన అవమానం జరిగింది. డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ కు స్లోవేనియాలో ఏర్పాటు చేసిన విగ్రహం అదృశ్యమైంది. ఆమె స్వస్థలమైన సెవ్నికా గ్రామ శివారులో ఈ విగ్రహాన్ని గౌరవ సూచకంగా ఏర్పాటు చేశారు. ఆమె మీది గౌరవం కొద్ది స్లోవేనియన్ కళాకారుడు ఆలెష్ జెరవెచ్ రూపొందించిన ఈ విగ్రహం పర్యాటకులను ఆకర్షించేది. అమెరికా నుంచి అక్కడకు వెళ్లిన పర్యాటకులు పనిగట్టుకుని అక్కడికి వెళ్లి ఆ విగ్రహాన్ని చూసివచ్చేవారు. ఇటీవల కొంతమంది అక్కడకు వెళ్లిన సమయంలో విగ్రహం కనిపించకపోవడంతో మాయమైందన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి.
2019లో మెలానియా గౌరవార్ధం చెక్కతో తయారైన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే అది మెలానియా హోదాకు తగ్గట్టుగా లేదని విమర్శలు వచ్చాయి. విగ్రహం ఆకృతి కూడా అతికినట్టు లేదని కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కొద్ది కాలానికే అది తగలబడడమో లేక గుర్తు తెలియని వ్యక్తులు తీసివేయడమో జరిగింది. దానిపై విచారణ జరుగుతుండగానే ఆ ప్లేస్ లో సరికొత్త విగ్రహం ఏర్పాటు చేశారు. ఈసారి చేసింది కాంస్య విగ్రహం.
కాంస్య విగ్రహాన్నీ ఎత్తుకెళ్లారా?
చెక్క విగ్రహం స్థానంలో కాంస్య విగ్రహాన్ని తయారు చేసి అదే చోట పెట్టారు. అది పాతదానికంటే మెరుగ్గా ఉండేది. అచ్చుగుద్దినట్టు మెలానియా లాగా లేకపోయినా దాదాపు దగ్గరి పోలికలు వచ్చాయి. చెట్లు, పొలాల మధ్య నిలబెట్టారు. కానీ తాజాగా ఆ విగ్రహం కూడా అదృశ్యమైంది. అక్కడ కేవలం రెండు లోహపు కాళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. పై భాగం కనిపించడం లేదు. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
స్థానికులు ఏమన్నారంటే...
గ్రామస్తుల అభిప్రాయం విభిన్నంగా ఉంది. “మెలానియా ఇక్కడ పుట్టిన నిజమే కానీ, అమెరికా వెళ్లిన తర్వాత ఎప్పుడూ తిరిగి ఊరిని చూడలేదు. అందుకే మేము ఆమె గురించి పెద్దగా మాట్లాడుకోవడం లేదు,” అని సెవ్నికా గ్రామస్తుడొకరు చెప్పారు. మరో వ్యక్తి మాట్లాడుతూ, “ఈ విగ్రహాల వల్ల ఊరికి ప్రచారం వచ్చిన మాట నిజమే కానీ ఆ విగ్రహాలు అంత అందంగా ఏమీ ఉండేవి కావు. ఇంకో మాటలో చెప్పాలంటే కాస్త భయపెట్టేలా కూడా ఉండవి. వాటిని ఎవరు తీసుకెళ్లారో మాకు అర్థం కావడం లేదు,” అని వ్యాఖ్యానించాడు.
ప్రధమ పౌరురాలికి పట్టించుకోలేని ఊరు?
మెలానియా స్లోవేనియాకు చెందినవారు. 2019లో అమెరికాలోని కొన్ని సామాజిక వర్గాలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా, ఆమె సొంత ఊరైన సెవ్నికా వద్ద నీలి రంగులో చెక్కితో తయారైన విగ్రహంను ఒక కళాకారుడు ఏర్పాటు చేశాడు.
ఆ విగ్రహం అప్పట్లో ఆ ఆకారంపై విపరీతమైన విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, అది ఒక రాజకీయ వ్యాఖ్యానంగా నిలిచింది. అది నిరసనలో భాగమని, ట్రంప్ అంటే గిట్టని వారు ఆ పని చేశారని భావించారు. దాన్నో చిలిపి చర్యగా,రాజకీయ వెటకారానికి మచ్చుతునకగా అనుకున్నారు. ట్రంప్ కుటుంబం అమెరికాలో పునరాగమనానికి ప్రయత్నిస్తున్న తరుణంలో, మెలానియాకు విదేశాల్లో ఎదురవుతున్న నిరసనలు భావోద్వేగరహిత రాజకీయాలపై చైతన్యాన్ని సూచిస్తాయా? అనే వ్యాఖ్యానాలు వినవచ్చాయి.
విగ్రహాన్ని రూపకల్పన చేసిన కళాకారుడు ఆలెష్ జెరవెచ్ మాత్రం గతంలోనే ఈ విగ్రహాన్ని “పారాడీ-పార్టిసిపేటరీ ఆర్ట్” అని పేర్కొన్నాడు. ఇప్పుడు అది మాయమవడం మీద అతను స్పందిస్తూ, "ఇది ప్రజల స్పందనే కావచ్చు... కానీ అది కూడా ఒక కళారూపమే" అంటూ వ్యాఖ్యానించాడు.
ఈ ఘటన ఒక విగ్రహం కనపడకపోవడానికి సంబంధించింది కాదని, అది పార్లరు రాజకీయాల మీజ, ప్రజల నైతిక సంకేతాలకు ప్రతిరూపగా భావించవచ్చు. ట్రంప్ వివిధ వర్గాలపై లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నా మెలానియా మౌనంగా ఉండడానికి సంబంధించిన నిరసన కూడా కావొచ్చు. ట్రంప్ భావోద్వేగాలపై విరుచుకుపడుతున్న విమర్శలు, వివాదాలే ఆమె విగ్రహం మాయం కావడానికి కారణాలు కావొచ్చు.
ఏది ఏమైనా మెలానియాకు సెవ్నికా అనుబంధం తెగిపోతున్నట్టుంది. ఆమె మూలాలు మర్చిపోతున్నట్టు అనిపిస్తోంది. చెక్క విగ్రహం కాలిపోయింది. బ్రాంజ్ విగ్రహం మాయమైంది. ఇకపై ఆమె గుర్తింపు ఊరిలో ఓ జ్ఞాపకమా? లేక గతకాలపు చరిత్రా? అన్నది చూడాల్సిన విషయమే.
ఎవరీ మెలానియా ట్రంప్?
మెలానియా ట్రంప్ (Melania Trump) – అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ జే. ట్రంప్ భార్య. అమెరికా చరిత్రలో యూరోప్ లోని దక్షిణాది ప్రాంతం నుంచి వచ్చిన మొదటి ఫస్ట్ లేడీ (First Lady of the United States) కావడం విశేషం. మెలానియా కనావ్స్ (Melanija Knavs) పేరుతో 1970 ఏప్రిల్ 26న స్లోవేనియాలో (ఆ సమయంలో యుగోస్లావియా భాగం) జన్మించారు. సేవ్నికా అనే చిన్న పట్టణం ఆమె స్వస్థలం. తండ్రి ఓ కార్ డీలర్. తల్లి ఓ బట్టల డిజైనర్.
మెలానియా ఆర్కిటెక్చర్, డిజైన్ చదువుకుంది కానీ పూర్తిచేయలేదు. చదువుతో పాటు మోడలింగ్‌లో ఆసక్తి పెరిగింది. 16వ ఏట మోడలింగ్ ప్రారంభించింది. యూరోప్‌లో పేరుపొందిన తర్వాత 1996లో అమెరికాకు వలస వెళ్లింది.
ట్రంప్‌తో వివాహం
మెలానియా, ట్రంప్‌ల మధ్య పరిచయం 1998లో న్యూయార్క్‌లో ఓ పార్టీలో ప్రారంభమైంది. 2005లో డొనాల్డ్ ట్రంప్‌ను వివాహం చేసుకుంది. వారికి ఒక కుమారుడు – బ్యారన్ ట్రంప్ (Barron Trump).
2017 జనవరి 20న, డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవిలోకి రావడంతో ఆమె ఫస్ట్ లేడీగా బాధ్యతలు చేపట్టారు.
ఫస్ట్ లేడీగా “Be Best” అనే ప్రచార కార్యక్రమం ప్రారంభించింది – ఇది బాలల మానసిక ఆరోగ్యం, ఆన్‌లైన్ సురక్ష మొదలైన అంశాలపై దృష్టి సారించింది.
మెలానియా తరచూ సాంప్రదాయ ఫస్ట్ లేడీ పాత్ర నుంచి భిన్నంగా కనిపించేవారు. ఆమె వేషధారణ, శైలి, కళా ఆసక్తులు, అరుదుగా మాట్లాడే తత్వంతో అందరి దృష్టిని ఆకర్షించారు.
మెలానియా అమెరికా చరిత్రలో ఆదర్శమైన గ్లామర్, సాంప్రదాయ హద్దులను చెరిపేసిన పాత్ర ఆమెది. విమర్శలకు వెరవని తనం ఆమెది.