‘మెగా డ్యామ్’ నిర్మాణంలో చైనా హమీలు నమ్మొచ్చా?

రాగి ఖనిజాల తవ్వకం, డ్యామ్ నిర్మాణంతో హిమాలయాల్లో పర్యావరణ విధ్వంసం పతక స్థాయికి;

By :  313
Update: 2025-02-06 10:24 GMT

హిమాలయాల్లో కొత్తగా కల్లోలం సృష్టించడానికి చైనా కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. అక్కడ నెలకొని ఉన్న అపారమైన ప్రకృతి సంపదను కొల్లగొట్టడానికి ఎత్తులు వేస్తోంది. తాజాగా త్సాంగ్ పో నది పై ప్రపంచంలోనే అతి పెద్ద విద్యుత్ ప్రాజెక్ట్ ను నిర్మించడానికి, రాగి నిక్షేపాలను తవ్వి తీయడానికి ప్రణాళికలు వేస్తోంది. దీనిపై భారత్, బంగ్లాదేశ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఈ ఆనకట్ట నిర్మించే ప్రదేశం లో టెక్టానిక్ ప్లేట్ల కదలిక ఉంటుంది. అత్యంత సున్నితమైన ప్రదేశం. అక్కడ చాలా సార్లు భారీ భూకంపాలు సంభవించాయి. అలాంటి ప్రదేశంలో చైనా భారీ నిర్మాణానికి ప్రణాళిక వేయడం పై ఆందోళన వ్యక్తం అవుతోంది.
డ్యామ్ కు జరగరాని ప్రమాదం జరిగితే అది భారత్, బంగ్లాదేశ్ లో సునామికి దారి తీస్తుంది. అంతే కాకుండా భూగర్భ జలాలు కలుషితం అయ్యే ప్రమాదం ఉంది. ఇది టిబెట్ పై కూడా ఎక్కువ మోతాదులో పడే అవకాశం ఉంది.
డిసెంబర్ 25న యార్లుంగ్ త్సాంగ్పో( బ్రహ్మపుత్రా) నదిపై 60 వేల మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయగల ఆనకట్టను నిర్మించాలని చైనా ప్రకటించిన తరువాత భారత్ ‘‘ తీవ్ర స్థాయిలో నిరసన’’ తెలిపింది. అయితే దాని బుద్దిలో మార్పు రాలేదు.
చైనా హమీలు..
బంగ్లాదేశ్ విదేశాంగ సలహాదారు తౌహిద్ హుస్సేన్ ఇటీవల బీజింగ్ పర్యటన సందర్భంగా ప్రతిపాదిత ఆనకట్టపై తన ఆందోళన వ్యక్తం చేశారు. ఆనకట్ట నది ప్రవాహం ప్రాజెక్ట్ కాబట్టి, దాని వల్ల దిగువన నీటి ప్రవాహాలు ప్రభావితం కావని, పర్యావరణానికి కూడా ఎలాంటి హాని జరగదని చైనా హమీ ఇస్తోంది. కానీ చైనా మాటలను విశ్వసించవచ్చా?
బ్రహ్మపుత్రా నది పై నిర్మించే ఆనకట్ట వల్ల చైనాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది కేవలం భారత్, బంగ్లాదేశ్ కు కోలుకోలేని దెబ్బ తీస్తుంది.
ప్రధాన భూకంపాలు..
ఈ ప్రాంతంలో పెద్ద భూకంపాలు సంభవించాయి. 1897 లో అస్సాం- టిబెట్ ( రిక్టర్ స్కేలు పై 8.2), 1950 లో 8.7, 2015 లో 7.8 తో భూకంపాలు సంభవించాయి. ఇందులో 15 వేల మంది మరణించారు. ఇక్కడ భారీ ఆనకట్టల వల్ల ఒత్తిడి పెరిగి భారీ భూకంపాలు సంభవిస్తాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
టిబెట్ లో ఒక ప్రధాన టెక్టోనిక్ ఫాల్ట్ లైన్ పై ఉంది. ఇక్కడ భారత ప్లేట్ యూరేషియన్ ప్లేట్ తో ఢీ కొని తీవ్రమైన భూకంపాలు వస్తున్నాయి. కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకూ సరిహద్దులో ఉన్న రాష్ట్రాలు అధిక స్థాయిలో భూకంపాలను చవి చూస్తున్నాయి.
భూకంప కార్యకలాపాలు..
బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మించే ఆనకట్ట రిక్టర్ స్కేలుపై 7. 5 అంతకంటే ఎక్కువ స్థాయిలో భూకంపం వచ్చిన తట్టుకునే విధంగా ఉంటుందని చెబుతున్నప్పటికీ అది సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. చైనాకి నిర్మాణ రంగంలో చాలా అనుభవం ఉన్నప్పటికీ అది సాధ్యం కాదు.
నిజానికి గడచిన కొన్ని దశాబ్దాలలో భారత్ లోని రాష్ట్రాలతో పాటు, టిబెట్ లోనూ భూకంప కార్యకలాపాలు పెరిగాయి. చైనా భారీ ఆనకట్ట నిర్మాణం ప్రారంభించిన తరువాత జనవరి 7న టిబెట్ లో 7. 1 తో భూకంపం సంభవించింది. ఇది టిబెట్ లోని టింగ్రి కౌంటీ కేంద్రంగా ఉంది. ఇందులో 150 మంది టిబెటన్లు మరణించారు. వందలాది మందికి గాయాలయ్యాయి.
భారత్ లోనూ ప్రకంపనలు..
టిబెట్ కు సరిహద్దు రాష్ట్రమైన ఉత్తరాఖండ్ లోనూ భూకంప కార్యకలాపాలు చాలా ఎక్కువ సంఖ్యలో పెరిగాయి. ఇది దిగ్బ్రాంతిని కలిగించే విషయం. ఫిబ్రవరి 2న టిబెట్ 10 కిలోమీటర్ల లోతున 4. 2 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. అంతకుముందు జనవరి 30న 4.1 తీవ్రతతో, జనవరి 27న 4.5 తీవ్రవతతో, జనవరి 24న 4.4 తీవ్రతతో భూమి లో ప్రకంపనాలు నమోదయ్యాయి.
తక్కువ తీవ్రత భూకంపాలు..
జనవరి లో ఉత్తరఖండ్ లోని మరికొన్ని ప్రాంతాలలో రిక్టర్ స్కేలు పై 2.5 -4.0 మధ్య తొమ్మిది భూకంపాలు సంభవించాయి. వీటిలోని చివరిది యుమునోత్రిలోని సరుతల్ సరస్సుల సమీపంలోని ఫుచ్- కండి వద్ద నమోదు అయింది.
ఇలాంటి నిస్సారమైన భూకంపాలు త్వరిత గతిన భూమి ఉపరితలంలోకి వస్తే నష్టం తీవ్రత పెరుగుతుంది. ఇలాంటి చిన్న చిన్న ప్రకంపనాలు భవిష్యత్ లో వచ్చే పెద్ద భూకంపాలకు సూచనగా భావించాల్సి ఉంటుంది.
చైనా వాదన
బ్రహ్మపుత్రా నదిపై చైనా నిర్మించే ఆనకట్టను క్లీన్ ఎనర్జీకి మార్గంగా భావిస్తోంది. ఇది చైనా శిలాజ ఇంధనాలను వాడటాన్ని తగ్గించడాన్ని నిరోధిస్తుంది. 2060 నాటికి దాని కార్భన్ తటస్థత లక్ష్యాలను చేరుకోవడానికి ఉపయోగపడుతుందని అనుకుంటోంది.
టిబెట్ లోని మెడోగ్ కౌంటీలో ‘‘గ్రేట్ బెండ్’’ వద్ద ఈమెగా డ్యామ్ కు పునాది వేయాలనుకుంటున్నారు. ఇది దేశంలో అరుణాచల్ ప్రదేశ్ లోకి ఎంట్రీ పాయింట్. ఇక్కడ నది దాదాపు 2 వేల మీటర్ల కిందకి దిగడం వల్ల జల విద్యుత్ ఉత్పత్తికి అనువైంది.
నీటిని మళ్లించడం..
ఉత్తర చైనాలోని బీజింగ్, హేబీ, టియాంజిన్ వంటి నీటి ఎద్దడి ప్రాంతాలలో సాగు, త్రాగు నీరు అందించడానికి ఈ నీటిని మళ్లించాలని చైనా ప్రణాళిక. బ్రహ్మపుత్ర నదిపైనే భారత్, బంగ్లాదేశ్ వంటి దేశాలు ఆధారపడి వ్యవసాయం, త్రాగునీరు అందిస్తున్నారు.
ఇప్పుడు చైనా నీటిని మళ్లించడం వల్ల కింది స్థాయి దేశాలపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. నదీ ప్రవాహాన్ని తారుమారు చేయడం వల్ల ఈశాన్య భారతంలో గణనీయమైన పరిణామాలు ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ నీటిని జలఖడ్గం లా భారత్ పైకి చైనా ఉపయోగించే అవకాశం ఉంది. అవసరమైనప్పుడు అదే నీటిని విడుదల చేస్తుంది. నీరు అవసరమైనప్పుడు వాటిని అలాగే నిలుపుదల చేస్తుంది.
పర్యావరణ భయాలు..
భూకంపం సంభవించే ప్రాంతంలో ఈవిధంగా ఆనకట్ట నిర్మిస్తే మౌలిక సదుపాయాల్లోని ప్రమాదం ఉంది. ఇది అంతరించిపోతున్న జీవులకు మరింత ముప్పును తీసుకు వస్తున్నాయని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. అలాగే పెళుసైన హిమాలయా పర్యావరణ వ్యవస్థను నాశనం చేస్తుందని భయపడుతున్నారు.
ఇది పెద్ద ఎత్తున అటవీ నిర్మూలన, నేల కోతకు దారి తీస్తుంది. ఈ ప్రాంతం జీవ వైవిధ్యాన్ని తిరిగి పొందలేని విధంగా మారుస్తుంది.
రాగి నిక్షేపాలు..
టిబెట్ లో ఇటీవల రాగి నిక్షేపం బయటపడింది. చైనా ఖనిజ పరిశ్రమ ముఖ చిత్రాన్ని ఇది మార్చే అవకాశం కనిపిస్తోంది. ఇది ప్రపంచ మార్కెట్లు, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి, భౌగోళిక రాజకీయాలపై చాలా విస్తృతమైన ప్రభావాలను చూపే అవకాశం ఉంది.
టిబెట్ పీఠభూమిలోని 20 మిలియన్ టన్నులకు పైగా కొత్తగా రాగి నిక్షేపాలను గుర్తించారు. ఇది చైనాను లో ఉత్పత్తి రంగంలో అగ్రగామిగా నిలబెడుతుందని భావిస్తున్నారు.
రాగి.. చైనా..
ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తి వాహనాలు, పునరుత్పాదక ఇంధన సాంకేతికత, మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ ల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా రాగి డిమాండ్ పెరుగుతోంది. విద్యుత్ గ్రిడ్ లు, బ్యాటరీ ఉత్పత్తి, ఆధునాతన పారిశ్రామిక అవసరాలకు రాగి చాలా అవసరం.
ఇది కీలకమైన గ్రీన్ ఎనర్జీకి అవసరం. రాగి సరఫరాలు నిరంతరంగా ఉండటానికి చైనాకు ఇవి ఈ ఖనిజ నిక్షేపాలు అవసరం. ఇది ప్రపంచ మార్కెట్లపై దానికి ఆధిపత్యాన్ని ఇస్తుంది.
రాగి తవ్వకాలు..
పర్యావరణానికి సున్నితమైన ప్రాంతంలో పెద్ద ఎత్తున రాగి తవ్వకాలు చేపడితే పర్యావరణం పై ప్రభావం చూపుతుందని, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడానికి కారణమవుతాయి.
టిబెట్ పీఠభూమి ప్రపంచంలోనే అతి సున్నితమైన ప్రాంతాలలో ఒకటి. ఇక్కడ ప్రత్యేకమైన జీవ వైవిధ్యం, పెళుసైన పర్యావరణ వ్యవస్థలకు ఆలవాలం. ఇక్కడ పెద్ద ఎత్తున మైనింగ్ జరిగితే అది తిరిగి కోలేకోలేదు.
ఎత్తైన ప్రదేశాల నుంచి మారుమూల ప్రాంతాల నుంచి రాగిని తీయడానికి రోడ్లు, ప్రాసెసింగ్ ప్లాంట్లు, నీటి శుద్ది కేంద్రాలు వంటి భారీ మౌలిక సదుపాయాలు అవసరం అవుతాయి. ఇవన్నీ సహజ ఆవాసాలకు విఘాతం కలిగిస్తాయి.
చైనా మాత్రం..
హిమానీ నదాలు, ఎత్తైన ప్రదేశాలలో ఉంటాయి. ఇక్కడ రాగి నిక్షేపాల కోసం తవ్వకాలు చేపడితే సున్నితమైన నీటి వ్యవస్థలు దుర్భలంగా మారతాయి. ఈ నదులు భూగర్భ జలాలను కలుషితం చేస్తుంది. అక్కడ వన్య ప్రాణులు ఈ నీటిపై ఆధారపడిన మానవ సమాజాలను ప్రభావితం చేస్తుంది. కానీ చైనా మెగా డ్యామ్ భారీ రాగి తవ్వకాల విషయంలో వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఇది దిగువ దేశాలపై భారత్, బంగ్లాదేశ్ లకు ఆందోళన కలిగిస్తోంది.


Tags:    

Similar News