ఇరాన్ అతిపెద్ద తప్పు చేసింది: బెంజమిన్ నెతన్యాహు

తనపై క్షిపణులు ప్రయోగించి ఇరాన్ అతిపెద్ద తప్పు చేసిందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు. ప్రతిదాడి తప్పదని గట్టి వార్నింగ్ ఇచ్చారు.

By :  491
Update: 2024-10-02 09:06 GMT

ఇరాన్ తన జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేసిందని, టెహరాన్ ప్రయోగించిన క్షిపణుల దాడి విఫలమైందని దీనికి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రకటించారు. "ఈ రాత్రి ఇరాన్ పెద్ద తప్పు చేసింది, దానికి అది తగిన ప్రతిఫలం చెల్లిస్తుంది" అని రాజకీయ-భద్రతా సమావేశం ప్రారంభంలో నెతన్యాహూ చెప్పాడు.

ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి మాట్లాడుతూ.. మా దేశం దేశం ఎంచుకున్న సమయంలో, ఎంచుకున్న ప్రదేశంలో ఇరాన్ పై దాడులు చేస్తుంది. “ఈ దాడికి కీలక పరిణామాలు ఉంటాయి. మాకు ప్రణాళికలు ఉన్నాయి, మేము నిర్ణయించిన స్థలం, సమయంలో వాటిని అమలు చేస్తాము ” అని అతను చెప్పాడు.
ఇరాన్ బెదిరింపులను..
గత శుక్రవారం బీరుట్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హెజ్ బొల్లా చీఫ్ సయ్యద్ హసన్ నస్రల్లా మరణించిన తరువాత ఐడీఎఫ్ దక్షిణ లెబనాన్ పై భూతల దాడులు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ భారీ స్థాయిలో క్షిపణులను రాజధాని టెల్ అవీవ్, జెరూసలేం పైకి ప్రయోగించింది.
ఈ సంఖ్య దాదాపు 180 వరకూ ఉంటుందని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ప్రస్తుతం ఇరాన్ నుంచి తదుపరి దాడులు ఉండవని, అయితే దాడులకు ప్రతిదాడులు తప్పవని, ఇరాన్ ను పూర్తిగా అణచివేస్తామని ఐడీఎఫ్ హెచ్చరించింది. ఈ దాడులపై టెహ్రన్ కూడా స్పందించింది. నస్రల్లా, హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియోనే చంపినందుకు ప్రతీకారంగా ఈ దాడులకు పాల్పడినట్లు ఇరాన్ కు చెందిన ఐఆర్జీసీ పేర్కొంది.
US నుంచి సాయం
ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడి విఫలమైందని, ఇదో మతిలేని చర్య అని యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఇజ్రాయెల్ కు మరింత సాయం చేయాలని, ఇరాన్ ప్రయోగించిన అన్ని క్షిపణులను మధ్యలోనే కూల్చివేయాలని ఆయన అమెరికా మిలిటరీతో పాటు తన మిత్రదేశాలకు ఆదేశాలు జారీ చేశారు.
పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ మేజర్ జనరల్ ప్యాట్రిక్ ఎస్ రైడర్ మాట్లాడుతూ, చాలా వరకు క్షిపణులు తమ లక్ష్యాన్ని చేరుకోకముందే ధ్వంసం చేశాయని, కొన్ని ప్రభావం చూపి తక్కువ నష్టాన్ని కలిగించాయని చెప్పారు. తూర్పు మధ్యధరా ప్రాంతంలో మోహరించిన రెండు అర్లీ బర్క్-క్లాస్ డిస్ట్రాయర్లు - యుఎస్ఎస్ కోల్, యుఎస్ఎస్ బుల్కెలీ - ఇజ్రాయెల్ రక్షణలో భాగంగా ఇన్కమింగ్ ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులపై డజను ఇంటర్‌సెప్టర్లను ప్రయోగించినట్లు వెల్లడించాయి.
గాయపడినట్లు సమాచారం లేదు
ఇరాన్ దాడిలో ఇజ్రాయెల్ పౌరులు ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. "ప్రస్తుతం, టెల్ అవీవ్ ప్రాంతంలో ష్రాప్నెల్ లో కొంతమందికి చిన్న చిన్న గాయాలయ్యాయి. దాడుల వల్ల అగ్ని ప్రమాదాలు మాత్ర సంభవించాయి. వెస్ట్ బ్యాంక్ లో ఓ క్షిపణి పడటంతో పాలస్తీనా పౌరుడు మరణించినట్లు స్థానిక గవర్నర్ వెల్లడించాడు.
ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయంలో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆ దేశం తన గగనతలాన్ని మూసివేసి విమానాలను దారి మళ్లించింది. జోర్డాన్, ఇరాక్ కూడా విమాన ట్రాఫిక్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించగా, ఇరాన్ టెహ్రాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాలను నిలిపివేసింది.
టెల్ అవీవ్‌లో సాయుధ దుండగుడి కాల్పులు..
ఇజ్రాయెల్ వాణిజ్య రాజధాని టెల్ అవీవ్‌లో అనుమానాస్పద వ్యక్తి కాల్పులు జరిపినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. ఇందులో ఆరుగురు ఇజ్రాయెల్ సాధారణ పౌరులు మరణించారు. ఇరాన్ దాడి తర్వాత, UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ "మధ్యప్రాచ్యంలో విస్తరిస్తున్న సంఘర్షణ"ను ఖండించారు. “ఇది ఆగిపోవాలి. మాకు ఖచ్చితంగా కాల్పుల విరమణ అవసరం ” అని గుటెర్రెస్ అన్నారు.
ఇండియన్ ఎంబసీ హెచ్చరిక
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం భారతీయులందరూ అప్రమత్తంగా ఉండాలని, స్థానిక అధికారుల సలహా మేరకు భద్రతా ప్రోటోకాల్‌ను అనుసరించాలని హెచ్చరించింది. "ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా, ఇజ్రాయెల్‌లోని భారతీయ పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని స్థానిక అధికారులు సూచించిన విధంగా భద్రతా ప్రోటోకాల్‌లకు కట్టుబడి ఉండాలని" అని టెల్ అవీవ్‌లోని భారత రాయబార కార్యాలయం తన ప్రకటనలో పేర్కొంది.
"దయచేసి జాగ్రత్తగా ఉండండి, దేశంలో అనవసర ప్రయాణాలను చేయవద్దు " అని అది జోడించింది. భారతీయ పౌరులు అత్యవసర పరిస్థితుల్లో కాల్ చేయగల హెల్ప్‌లైన్ నంబర్‌లను కూడా ఎంబసీ షేర్ చేసింది. "ఎంబసీ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. మా జాతీయులందరి భద్రతను నిర్ధారించడానికి ఇజ్రాయెల్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది" అని ఇది పేర్కొంది. "ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో, దయచేసి ఎంబసీ యొక్క 24x7 హెల్ప్‌లైన్‌ను సంప్రదించండని పేర్కొంది. భారతీయ పౌరులు చేరుకోవడానికి రాయబార కార్యాలయం ఈ-మెయిల్ ఐడిని కూడా షేర్ చేసింది — cons1.telaviv@mea.gov.in — “ఇంకా రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోని” వారు వెంటనే పేరు నమోదు చేసుకోవాలని కోరింది. ఇది సందేశంతో పాటు ఫారమ్‌ను కూడా విడుదల చేసింది.



Tags:    

Similar News