ఎనిమిదో వేతన సంఘంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత లాభం?

30 నుంచి 40 శాతం వరకూ జీతాలు పెరిగే అవకాశం, కోటి మంది ఉద్యోగులకు లాభం;

Update: 2025-07-20 10:09 GMT

ఎనిమిదవ వేతన సంఘం అమలును కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆసక్తికరంగా పరిశీలిస్తున్నారు. ఈ సవరణ తో తమ జీతాలు, పెన్షన్ గణనీయంగా పెరుగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అంబిట్ క్యాపిటల్ నివేదిక ప్రకారం ఎనిమిదో వేతన సంఘం కింద వేతనం దాదాపుగా 30 శాతం నుంచి 40 శాతం వరకూ పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ పెంపుదల ఒక కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లను ప్రభావితం చేస్తుందని ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ నివేదించింది.

ఈ నివేదిక వచ్చినప్పటికి దాని అమలు మాత్రం 2026 లేదా 2027 ఆర్థిక సంవత్సరం నుంచి అమలయ్యే అవకాశం ఉంది. మీడియా నివేదికల ప్రకారం వేతన సవరణ ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు రూ. 1.8 లక్షల కోట్ల అదనపు భారం పడుతుంది.

పది సంవత్సరాలకు ఒకసారి..
ప్రస్తుతం అమలులో ఉన్న ఏడో వేతన సవరణ సంఘం జూలై 2016 లో అమల్లోకి వచ్చింది. జీవన వ్యయం, ద్రవ్యోల్భణం, ఆర్థిక దృశ్యంలో మార్పులకు అనుగుణంగా వేతన నిర్మాణాన్ని సవరించడానికి, సర్దుబాటు చేయడానికి సాధారణంగా ప్రతి సంవత్సరాలకు ఒక వేతన సంఘం ఏర్పాటు చేస్తారు. ఎనిమిదో వేతన సంఘం కూడా ఇదే బాటలో కొనసాగుతుందని, రక్షణ సిబ్బంది, పెన్షనర్లు సహ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను సవరిస్తారని భావిస్తున్నారు.
ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏమిటీ?
వేతన సవరణ కీలకమైన అంశాలలో ఒకటి ఫిట్ మెంట్ అంశం, ఇది సవరించిన ప్రాథమిక జీతాన్ని నిర్ణయించడాన్ని ఉపయోగించే గుణకం. ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ లోని ఒక నివేదిక ప్రకారం ఆంబిట్ క్యాపిటల్ అంచనాను సూచిస్తుంది.
దీనిప్రకారం ఎనిమిదో వేతన సంఘం కోసం ఫిట్ మెంట్ కారకం 1.83 నుంచి 2.46 పరిధిలో ఉండవచ్చు. ప్రస్తుత కనీస జీతం రూ. 18 వేల నుంచి రూ. 32,940 (1.83) లేదా 44,280(2.46) వరకు పెరగవచ్చని నివేదిక పేర్కొంది.
‘‘ఉదాహారణకు, ప్రస్తుత మూల వేతనం రూ. 50 వేలు ఉంటే ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ప్రకారం అది రూ. 91,500 కి ఉన్నత స్థాయిలో ఉన్నవారికి రూ.1.23 లక్షల వరకు పెరగవచ్చు’’ అని నివేదిక పేర్కొంది.
కరువు భత్యం.. ద్రవ్యొల్భణం..
ఎనిమిదో వేతన సంఘం ప్రకారం.. వేతన నిర్మాణం ద్రవ్యల్భోణంతో కరువు భత్యాన్ని మరింత కచ్చితంగా నిర్ణయిస్తుందని భావిస్తున్నారు. మీడియా నివేదికల ప్రకారం 8 వ వేతన సంఘం కింద పెరిగిన వేతనం ఆర్ధిక వృద్దిని పెంచుతుంది. ఎందుకంటే పెరిగిన టెక్ హోమ్ జీతం అధిక వినియోగానికి దారితీస్తుంది. అలాగే మెరుగైన ఆరోగ్య సంరక్షణ యాక్సెస్, మెరుగైన గృహ నిర్మాణం, విశ్రాంతి కోసం అధిక ఖర్చుకు దారితీస్తుంది.


Tags:    

Similar News