స్పేస్ నుంచి ఇండియా, హిమాలయాలు బాగా కనిపిస్తాయి: సునీతా విలియమ్స్
త్వరలో భారత్ లో పర్యటిస్తానని తెలిపిన వ్యోమగామి;
By : Praveen Chepyala
Update: 2025-04-01 12:34 GMT
అంతరిక్షం నుంచి భారత్ అద్బుతంగా కనిపిస్తుందని, నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ అన్నారు. తన తండ్రి స్వదేశాన్ని పర్యటించి అక్కడి ప్రజలతో అంతరిక్ష పరిశోధన గురించి అనుభవాలను పంచుకుంటానని చెప్పారు.
విలేకరుల సమావేశంలో సునీత ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్నప్పుడూ భారత్ అంతరిక్షం నుంచి ఎలా ఉంది.. అలాగే ఇస్రోతో కలిసి పరిశోధన చేస్తారా అన్న ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు.
‘‘భారత్ అద్బుతమైనది. మేము హిమాలయల మీదుగా వెళ్లిన ప్రతిసారీ, హిమాయలయాల నుంచి అద్భుతమైన చిత్రాలను పొందాడు. చాలా అద్భుతంగా ఉంది’’ అని సునీత చెప్పారు.
తిరిగి వచ్చిన మొదటిసారి..
59 ఏళ్ల వ్యోమగామి, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ తొమ్మిది నెలలకు పైగా అంతరిక్షంలో చిక్కకుపోయిన తరువాత స్పేస్ ఎక్స్ క్రూ-9 మిషన్ లో భాగంగా భూమికి తిరిగి వచ్చిన తరువాత వారి మొదటిసారిగా విలేకరులతో మాట్లాడుతున్నారు.
‘‘నేను ఇంతకుముందు వివరించినట్లుగా, భారత్ దేశం గుండా ఐఎస్ఎస్ వెళ్లినప్పుడూ అలల మాదిరిగానే కనిపిస్తున్న దేశాన్ని మీరు చూడవచ్చు. ఇది చాలా అందంగా కనిపిస్తుంది’’ అని సునీతా విలియమ్స్ చెప్పారు.
‘‘మీరు తూర్పు నుంచి గుజరాత్, ముంబై గుండా ప్రయాణిస్తున్నప్పుడూ అక్కడ తీరం వెంబడి ప్రత్యేకంగా కనిపిస్తుంది. నా అభిప్రాయం ఏమిటంటే.. పెద్ద నగరాలు నుంచి చిన్న నగరాల గుండా వెళ్తుంటే ఈ లైట్ల నెట్వ ర్క్ మనకు కనిపిస్తుంది. రాత్రిపూట, పగటి పూటలా చూడటం నమ్మశక్యం కాదు. ఈ సమయంలో హిమాలయాలు బాగా కనిపిస్తున్నాయి’’ ఆమె చెప్పారు.
భారత్ కు మొదటిసారి వస్తాను..
నేను నా తండ్రి స్వదేశానికి తిరిగి వెళ్లి ప్రజలను సందర్శిస్తాను. కానీ ఆక్సియమ్ మిషన్ లో భారతీయ జాతీయుడు రావడం చాలా అద్భుతంగా ఉందన్నారు.
భారత్ దేశానికి చెందిన మిషన్ పైలెట్ శుభాన్షు శుక్లాతో కూడిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఆక్సియమ్ మిషన్(యాక్స్-4) వాణిజ్య వ్యోమగామి మిషన్ గురించి ప్రస్తావిస్తూ ఆమె వ్యాఖ్యలు చేశారు.
లక్నో లో జన్మించిన శుక్లా 1984 నుంచి భారత వైమానిక దళ మాజీ అధికారి రాకేశ్ శర్మ తరువాత అంతరిక్షంలోకి వెళ్లిన భారత్ కు చెందిన రెండవ వ్యొమగామి అవుతారు.
సునీత తండ్రి ఇండియాదే..
సునీత తండ్రి దీపక్ పాండ్యా గుజరాత్ కు చెందినవాడు. 1958 లో అమెరికాకు వెళ్లిపోయాడు. అక్కడ ఒహియోలోని క్లీవ్ ల్యాండ్ లో మెడిసిన్ ఇంటర్న్ షిప్ తీసుకున్నాడు.
అక్కడే ఒహియో దీపక్, ఉర్సులిన్ బోనీ పాండ్యా దంపతులకు జన్మించారు. విల్మోర్ ను తన సిబ్బందిని భారత్ దేశ పర్యటనకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా అని సునీతను అడిగినప్పుడూ ‘‘ మేము మీ అందరికీ కారంగా ఉండే ఆహారం అందిస్తాము. బాగుంటుంది’’ అని సమాధానం ఇచ్చింది.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సుదీర్ఘ ప్రయాణం తరువాత భూమికి తిరిగి వచ్చిన సునీత, ఆమె తోటి క్రూ-9 సభ్యులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. వారి అంచంలచమైన సంకల్పం లక్షలాది మందికి ఎప్పటికీ స్పూర్తినిస్తుందని అన్నారు.
మోదీ సందేశం..
నాసా వ్యోమగాములు సునీత, నిక్ హేగ్, విల్మోర్, రోస్కోస్మోస్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ మార్చి 18న స్పేస్ ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో భూమికి తిరిగి వచ్చారు. ఇది ఫ్లోరిడాలోని తల్లాహస్సీ తీరంలో సముద్రంలో పడిపోయింది.
బోయింగ్ కొత్త స్టార్ లైనర్ క్యాపూల్స్ కోసం టెస్ట్ పైలట్ పైన సునీత, విల్మోర్ కోసం ఎనిమిది రోజుల మిషన్ కోసం వెళ్లగా, తొమ్మిది నెలలకు పైగా కొనసాగింది. వారిని భూమి మీదకు తీసుకురావడానికి చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం అయ్యాయి. సెప్టెంబర్ లో వీరిని తీసుకురావడానికి వెళ్లిన అంతరిక్ష వీరు లేకుండానే తిరిగి వచ్చింది.
‘‘అంతరిక్ష పరిశోధన అంటే మానవ శక్తి సామర్థ్యాల పరిమితులను అధిగమించడం, కలలు కనే ధైర్యం, ఆ కలలను నిజం తెలుసుకునే ధైర్యం అని ఆయన అన్నారు. ఒక మార్గదర్శకురాలు, ఐకాన్ అయిన సునీతా విలియమ్స్ తన కెరీర్ అంతటా ఆ స్పూర్తిని ప్రదర్శించారు.’’ అని ప్రధాని అన్నారు.
వారు సురక్షితంగా తిరిగి రావడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన వారందరి పట్ల మేము చాలా గర్వపడుతున్నాము. కచ్చితత్వం, అభిరుచిని కలిస్తే, సాంకేతికత పట్టుదలను కలిస్తే ఏమి జరుగుతుందో వారు ప్రదర్శించారు’’ అని మోదీ అన్నారు.