అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఎలాన్ మస్క్ కటీఫ్
పెద్ద ఉద్యోగం ఇచ్చి మంచి అవకాశం ఇచ్చారు, థ్యాంక్స్!;
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి మిత్రుడు ఎలాన్ మస్క్ కటీఫ్ చెప్పేశాడు. ఇద్దరు ధనవంతుల స్నేహం ఎక్కువ కాలం నడవ లేకపోయింది. ఇక నీతో పనిచేయాలేనని మస్క్ ట్రంపు ప్రభుత్వం నుంచి వైదొలిగాడు. ఇద్దరి మధ్య కొన్నాళ్ల నుంచి చెడిందనే ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలోనే మస్క్ డోజ్ (Department of Government Efficiency:DOGE) పదవి నుంచి తప్పుకున్నాడు. ఇద్దరిని డబ్బు వ్యాపారం దగ్గిరకు చేర్చాయి. మస్క్ తెలివితేటలతో అమెరికాప్రభుత్వం లో పనితీరు మెరుగుపర్చాలని ప్రభుత్వ సామర్యం పేరుతో ఏకంగా ఒక ప్రభుత్వ శాఖను ఏర్పాటు చేసి, మస్క్ కు పెద్ద ఉద్యోగం ఇచ్చాడు ట్రంప్. ట్రంప్ తీసుకుంటున్న కొన్ని చర్యల వల్ల ఇక ప్రభుత్వం లోకొనసాగలేనని, డోజ్ నుంచి తప్పుకుంటున్నానని మస్క్ బుధవారం నాడు ఎక్స్ లో ప్రకటించాడు.
As my scheduled time as a Special Government Employee comes to an end, I would like to thank President @realDonaldTrump for the opportunity to reduce wasteful spending.
— Elon Musk (@elonmusk) May 29, 2025
The @DOGE mission will only strengthen over time as it becomes a way of life throughout the government.
అమెరికా ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా తన పని ముగిసిందని చెబుతూ ప్రభుత్వంలో వృథా ఖర్చును తగ్గించే అవకాశం కల్పించినందుకు ట్రంప్ కు కృతజ్ఞతలు తెలిపారు. డోజ్ మిషన్ కాలక్రమేణా మరింతగా బలోపేతం అవుతుందని, ఇది రాబోయే రోజుల్లో.. ప్రభుత్వానికి ఆక్సిజన్‌లా పనిచేస్తుందని, ఒక జీవన విధానంలా మారుతుందని మస్క్ చెప్పారు.