మోదీ వ్యాఖ్యలపై ఈసీ చర్య తీసుకోవాలి
ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగాన్ని కేరళ సీఎం పినరయి విజయన్ తప్పుబట్టారు. తక్షణం ఈసీ ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎలక్షన్ కమిషన్ (ఈసీ) పార్టీలకు అతీతంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు కేరళ సీఎం పినరయి విజయన్. రాజస్థాన్‌లోని బన్స్వారాలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోదీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ ప్రజల సంపదను ముస్లింలకు పంచుతారని చెప్పడం..మత విద్వేషాలను సృష్టించడమేనన్నారు. మోదీ వ్యాఖ్యలపై ఈసీ చర్య తీసుకోకుండా మౌనంగా ఉండడం దురదృష్టకరంమన్నారు. EC పార్టీలకతీతంగా వ్యవహరించాలని సూచించారు.
బన్స్వారాలో మోదీ మాట్లాడుతూ.. ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బు, విలువైన వస్తువులను చొరబాటుదారులకు, ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి ఇవ్వాలని కాంగ్రెస్ యోచిస్తోందని మోదీ ఆరోపించారు. మోదీ వ్యాఖ్యలు మత ప్రచారాన్ని తలపిస్తున్నాయని, మతలవారీగా జనాన్ని విడగొట్టాలని చూస్తున్నారని విజయన్ పేర్కొన్నారు.