ద్రవిడ్.. నీకు సరైన ప్రణాళిక అవసరం: లారా
ఐసీసీ 2022 లో ఉన్న జట్టులోని ఎనిమిది ఆటగాళ్లే తిరిగి ఈ టీ20 ప్రపంచకప్ లో చోటు దక్కించుకోవడంపై క్రికెట్ దిగ్గజం లారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By : Praveen Chepyala
Update: 2024-05-08 07:25 GMT
భారత మెన్స్ క్రికెట్ చీఫ్ కోచ్ పట్ల వెస్టీండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీ20 ప్రపంచకప్ లో భారత్ జట్టు తరఫున సరైన ప్రణాళికలు అవసరమని, పరోక్షంగా విరాట్, రోహిత్ శర్మలను జట్టులో ఎంపిక చేయడాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఐసిసి ఈవెంట్ 2022 ఎడిషన్ లో ఉన్న ఎనిమిది మంది ఆటగాళ్ళు తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నారు. ముఖ్యంగా సీనియర్ ప్లేయర్లు కోహ్లి, రోహిత్ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది.
"కొన్నిసార్లు మీకు అద్భుతమైన జట్టు దొరుకుతుంది. వారిలో అందరూ సూపర్ స్టార్లే. అయితే అలాంటి సమయంలో మనం మన ప్రణాళికలను మర్చిపోతుంటాం.. కొన్ని సార్లు కోచ్ లు బెదిరింపులకు గురువుతూ ఉంటారు. సీనియర్ ఆటగాళ్ల నుంచి మీరు ఏం ఆశిస్తున్నారో మీకు ఓ క్లారిటీ ఉందనే అనుకుంటా ”అని ఓ ఛానెల్ లో జరిగిన చర్చల్లో ఆయన వ్యాఖ్యానించారు.
భారత జట్టు కూర్పు గురించి అడిగినప్పుడు, 1987లో సర్ వివియన్ రిచర్డ్స్ నేతృత్వంలోని జట్టు సెమీఫైనల్‌కు చేరుకోలేక పోయినప్పుడు, అప్పుడు ఉన్న విషయాలను చెప్పుకొచ్చాడు. అందరూ అప్పుడు అనుభవజ్ఞులైన ఆటగాళ్లకే ఓటేశారు. కానీ పరిస్థితి మాత్రం మనకు అనుకూలంగా రాలేదని గుర్తు చేశారు.
ఇప్పుడు భారత జట్టు ఎదుర్కొన్న సందిగ్థతే చాలా దేశాలు ఎదుర్కొంటున్నాయని అన్నారు. భారత జట్టులో పేరు తెచ్చుకున్న పెద్ద పేర్లను చూస్తే, ప్లానింగ్ ఫ్రంట్‌లో ద్రవిడ్ పూర్తి చేయి సాధిస్తాడని లారా ఆశాభావం వ్యక్తం చేశాడు.
"మీకు చాలా ఉత్సాహం యువ ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. మీకు కూడా ఓ తికమక ఉంది. యువకులతో వెళ్లాలా.. లేదా అనుభవజ్ఞులతో వెళ్లాలా అని.. అయితే భారత్ అనుభవం ఉన్న జట్టుకే ఓటు వేసింది. నా సలహా, ఏంటంటే.. మీరు మంచి ప్రణాళికను ఎంచుకోండి.. ఇది విమర్శ కాదు " అని లారా పేర్కొన్నారు. రింకు సింగ్‌ను తప్పించడం చాలా కష్టమని అతను అంగీకరించినప్పటికీ, రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు ఈ ఎడిషన్‌లో గట్టి పోటీ ఇస్తుందని మాత్రం పేర్కొన్నారు.
"జట్టు ప్రపంచకప్‌ను గెలవగల సామర్థ్యం కలిగి ఉంది. అవును, పరిస్థితి కారణంగా ఒకరిద్దరు యువకులు తప్పిపోయిన జట్టు ఇది. కానీ వారు సరిగ్గా ప్రణాళిక వేసుకుంటే భారత్ ప్రపంచకప్ గెలవగలదని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను" అని లారా అన్నారు. వెస్టీండీస్- అమెరికా వేదికగా జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ జరగనుంది