టీ20 ప్రపంచకప్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
వచ్చే నెల నుంచి అమెరికా- వెస్టీండీస్ వేదికగా జరగబోయే టీ20 ప్రపంచకప్ లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వాడుతున్నట్లు వెల్లడించింది.
By : Praveen Chepyala
Update: 2024-05-24 12:08 GMT
టీ20 ప్రపంచకప్ (2024) లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వాడుతున్నామని ఐసీసీ ప్రకటించింది. క్రికెట్ ప్రపంచంలో ఏఐని వాడటం ఇదే మొదటిసారని క్రికెట్ కౌన్సిల్ వెల్లడించింది. ఇది మెరుగైన ప్రసారాలను ప్రేక్షకులకు అందిస్తుందని సంస్థ భావిస్తోంది.
రాబోయే ఐసీసీ టీ20 పురుషుల ప్రపంచకప్ లో క్రికెట్ ప్రసారాల కోసం ఐసీసీ టీవీ సాటిలేని వీక్షణ అనుభవాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. ప్రతి మ్యాచ్ ప్రత్యక్ష ప్రసార కవరేజీతో పాటు, లైసెన్సుల కోసం ప్రపంచ ఫీడ్ సేవలు అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం ఏఐ మద్ధతు గల సాంకేతికతను ఉపయోగిస్తున్నాం. ఇది క్రికెట్ ప్రపంచంలో తొలిసారిగా ప్రారంభించబడుతుందని ఐసీసీ ఒక మీడియా ప్రకటనలో తెలిపింది.
భారత్ సహ 20 జట్లు పాల్గొనే టీ20 ప్రపంచకప్ జూన్ 2 నుంచి 29 వరకూ అమెరికా- వెస్టీండీస్ వేదికగా జరగనుంది. 28 రోజుల పాటు జరిగే ఈ క్రికెట్ పండగలో 55 మ్యాచ్ లు జరగనున్నాయి. గత ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్ తరువాత ఐసీసీ వినూత్న కార్యక్రమాలు చేపట్టింది.
ముఖ్యంగా ఏఐ ద్వారా 9:16 వర్టికల్ కవరేజీ ప్రపంచంలో అడుగుపెట్టిందని అన్నారు. ఈ ఈవెంట్ కోసం డిస్నీ స్టార్, క్విడిచ్ ఇన్నోవేషన్ ల్యాబ్, ఎన్ఈపీ సహకారంతో ఉత్పత్తి చేసిన మొబైల్ పరికరాలను ఇందులో ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. సాధారణ ప్రేక్షకులకు అద్భుత వీక్షణ అనుభవాన్ని ఇస్తుందని ఐసీసీ భావిస్తోంది.