ఆ దేశం తీవ్ర మందగమనాన్ని ఎదుర్కొంటుంది: అమెరికా

చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని అమెరికా వ్యాఖ్యానించింది. ఇప్పుడు బీజింగ్ ముందు రెండు దారులు ఉన్నాయని, ఏ దారి నడవాలో ఆ దేశం నిర్ణయించుకోవాలని..

Update: 2024-07-11 09:40 GMT

బీజింగ్ ఆర్థిక వ్యవస్థ చాలా సంవత్సరాలుగా మందగమనంలో ఉందని భారతీయ- అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. భారత పర్యటనకు విచ్చేసిన ఆయన జాతీయా మీడియాతో మాట్లాడారు. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి చైనా కు రెండు మార్గాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఇందులో ఒకటి తన పొరుగు దేశాల మీద ఇలాగే దూకుడుగా వెళ్తూ ఆర్థిక వ్యవస్థ మీద ప్రపంచం దృష్టి పెట్టకుండా చేయడం, రెండోది దూకుడు తగ్గించి తన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టడం అని వివరించారు.

తీవ్రమైన ఆర్థిక సమస్యలు..
"ముఖ్యంగా, చైనా ఆర్థిక వ్యవస్థలో కొన్ని రంగాలలో ప్రతి ద్రవ్యోల్బణం ఉంది. ఆర్థిక వ్యవస్థలో తీవ్ర మందగమనాన్ని ఎదుర్కొంటుంది. వినియోగదారులు చైనాను నమ్మడం మానేశారు. యువత నిరుద్యోగం 25 శాతం కంటే ఎక్కువగా ఉంది. దశాబ్దాలుగా ఒకే బిడ్డ ఉన్న విధానం వల్ల అనేక దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి’’ ఇవి నిజంగా చాలా చెడ్డ గణాంకాలు అని ఆయన పేర్కొన్నారు.
చైనా విపరీతంగా అప్పులు చేసింది. ముఖ్యంగా స్థానిక ప్రభుత్వాలు, ప్రావిన్సులు అప్పులు చేసి రియల్ ఎస్టేట్ రంగాన్ని పెట్టుబడి పెట్టాయి. ఇవి కొన్ని సంవత్సరాలుగా ఎదుగుబొదగు లేకుండా ఉండిపోయాయి. ప్రజల నికర విలువ కూడా భారీ గా పడిపోయింది. వీరంతా రియల్ ఎస్టేట్ రంగంపైనే పెట్టుబడి పెట్టడంతో దేశం మొత్తం స్తబ్ధుగా మారిపోయింది.
ఇది అంతిమంగా దేశ పాలనపై పడింది. చైనా అధ్యక్షుడు ఈ సమస్యను ఎలా ఎదుర్కొంటాడో చూడాలని రాజా కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. ఆయన యునైటెడ్ స్టేట్స్ -చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీల మధ్య వ్యూహాత్మక పోటీపై హౌస్ సెలెక్ట్ కమిటీలో ర్యాంకింగ్ సభ్యుడిగా ఉన్నారు.
చైనా తన ఆర్థిక వ్యవస్థపై దృష్టి పెడితే పక్క దేశాల విషయంలో తన దూకుడు విధానాలను స్వస్తి చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీని వల్ల అమెరికా వంటి దేశాల నుంచి ఆర్థికంగా మద్ధతు లభించే అవకాశం ఉందని చెప్పారు. లేదు ఇదే దూకుడు విధానాలు కొనసాగిస్తే మాత్రం తీవ్ర ఇబ్బందుల్లో పడుతుందని అన్నారు.
చైనా కమిటీ రెండు విషయాలపై దృష్టి సారించిందని చెప్పారు. "ఒకటి, ఆర్థిక, సాంకేతిక, సైనిక దురాక్రమణ స్వభావం, ఆ ప్రమాదాల ద్వారా ఎదురయ్యే సవాళ్లు, వాటి గురించి చైనా ఎలా స్పందిస్తుంది. యుఎస్- చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీల మధ్య వ్యూహాత్మక పోటీని మీరు చివరికి ఎలా గెలుస్తారు," ఆయన ప్రశ్నించాడు. మా కమిటిటో చైనా ఎలా వ్యవహరిస్తుందో దాని అధినేత షి జిన్ పింగ్ నిర్ణయం పై ఆధారపడి ఉంటుందని అన్నారు. మాతో సన్నిహితంగా ఉండటానికి అంగీకరిస్తే అది ఇరు దేశాలకు ప్రయోజనకారిగా ఉంటుందని అన్నారు.
సైనిక దురాక్రమణ మార్గం
చైనా సైనిక మార్గాన్నే ఎంచుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇది తప్పనిసరిగా యథాతథ స్థితితో కొనసాగుతుంది. చైనా జాతీయ భద్రత, సాంకేతిక, ఆర్థిక విధానాన్ని సూచించే దూకుడుతో కొనసాగుతోంది.
"మీరు సైనిక దురాక్రమణను చూడండి, దక్షిణ చైనా సముద్రాన్ని చూడండి, CCP తన స్వంత ఆస్థిగా పేర్కొంది. అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును ఖాతరు చేయట్లేదు. ఇప్పటికి సౌత్ ప్రాంతం మొత్తం తనదే అని వాదిస్తోంది. అసంబద్దమైన వాదనలు కొనసాగించాల్సిన రావడం వల్ల అంతర్జాతీయంగా దాని ఖ్యాతి దిగజారింది. మరో వైపు తైవాన్ తో ఇదే రకపు వాదనలకు దిగుతున్నారు. చైనా సైనికులు కత్తులు, కర్రలతో పక్క దేశాల సైనికులపై దాడి చేస్తున్నారు. ఇవి అనవసరమైన దురాక్రమణ రకం.ఇది నిజంగా చాలా తీవ్రమైనదానికి దారి తీస్తుంది" అని కృష్ణమూర్తి అన్నారు.
"భారత సరిహద్దులో ఏమి జరిగిందో నేను మీకు చెప్పనవసరం లేదు. అయినప్పటికీ వారు ఆ డొమైన్‌లోనే కొనసాగుతున్నారు. మీరు బలవంతంగా కాకుండా శాంతియుతంగా మీ విభేదాలను పరిష్కరించుకుంటారని అర్థం చేసుకోవడం లేదు. పర్యవసానంగా, తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొంటున్నారు.”అని కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు.
ఒక ప్రశ్నకు సమాధానంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ, తమ హక్కులను సాధించుకోవడానికి బహుళ-పార్శ్వ సంస్థలు లేదా దేశాల సమూహాలు కలిసి వచ్చినప్పుడు చైనీయులు అల్లాడిపోతారని అన్నారు.
"ఇది మరింత ఎక్కువగా జరగాలని నేను భావిస్తున్నాను. రష్యా, ఉక్రెయిన్‌ పై దాడి చేసినట్లు మీరు ఇతర దేశాలపై దాడి చేయడం ద్వారా బలవంతంగా సరిహద్దులను మార్చలేరు’’ అని చెప్పారు.


Tags:    

Similar News