జీఎస్టీ రేట్ల స్లాబ్ మార్పుతో రాష్ట్రాలకు ఆర్థిక చిక్కులు తప్పవా?
పాత బకాయిలను ఇప్పటిదాక పూడ్చలేదంటున్న రాష్ట్రాలు;
By : The Federal
Update: 2025-08-31 08:14 GMT
ప్రసన్న మొహంతి
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీని సంస్కరించాలని ప్రయత్నిస్తోంది. జీఎస్టీని కేవలం రెండు స్లాబుల విధానం కింద మార్చాలని వాంఛిస్తోంది. అయితే రాష్ట్రాలు దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.
తమకు వచ్చే ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతాయని వాదిస్తున్నాయి. ఇది కూడా నిజమే. ఈ సంస్కరణల విషయంలో రాష్ట్రాలు ఆదాయం కోల్పోతే భర్తీ చేసే విషయంలో కేంద్రం మౌనం వహించింది. జీఎస్టీ ఆదాయాన్ని సమానంగా పంచుకుందామని వాదిస్తోంది.
రెండు పార్శ్వాలు..
ఎస్బీఐ రీసెర్చ్ ప్రకారం.. మొత్తం ఆదాయంలో 2026 ఆర్థిక సంవత్సరంలో రూ. 45 వేల కోట్లుగా ఉంటుందని, తదుపరి ఆర్థిక సంవత్సరం నుంచి ఈ మొత్తం రూ. 85 వేల కోట్లుగా ఉండే అవకాశం ఉంటుందని అంచనా వేసింది. దీని ప్రకారం ఇరు ప్రభుత్వాలు రూ. 60 వేల కోట్ల నుంచి రూ. 1.1 లక్షల కోట్ల మేర నష్టపోతాయి.
వచ్చే నెల 3-4 తేదీలలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కాబోతుంది. ఇందులో చాలా వస్తువుల పన్నురేట్లను మార్చడానికి సిద్దమవుతున్నారు. 12 శాతం స్లాబ్ లోని చాలా వస్తువులను ఐదు శాతం స్లాబ్ లోకి, 28 శాతం పన్నురేట్లు ఉన్న వస్తువులను 18 శాతం స్లాబ్ లోకి, 28 శాతం స్లాబ్ లోని కొన్ని వస్తువులను 40 శాతం స్లాబ్ లోకి మార్చడానికి జీఓఎం ఆమోదించింది. కానీ ఈ బిల్లు రాష్ట్రాలకు చెల్లించే పరిహారం విషయంలో ఎలాంటి హమీ ఇవ్వలేదు.
రాష్ట్రాల ఆదాయ వాటా..
జీఎస్టీని 2017 లో ఆమోదించినప్పుడూ ఎస్జీఎస్టీ వసూళ్ల నుంచి రాష్ట్రాలు వాటి సంబంధిత జీఎస్డీపీ సంబంధించి కనీసం వారి ఆదాయా వాటాను మెరుగ్గా కాకపోయినా, కొనసాగించగలవని అంచనా వేశారు. అప్పట్లో రాష్ట్రాలు తొమ్మిది పరోక్ష పన్నులపై తమ హక్కులను వదులుకున్నాయి.
వీటిని ఎనిమిదిని జీఎస్టీలో కలిపారు. జీఎస్టీ అమలు వల్ల కోల్పోయిన ఆదాయం ఐదు సంవత్సరాల పాటు భరించడానికి కేంద్రం అంగీకరించింది. కానీ తరువాత ఈ ఆదాయం మాత్రం కేంద్రం భర్తీ చేయలేదు. అందుకే శుక్రవారం న్యూఢిల్లీలో సమావేశమైన ఎనిమిది ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు పరిహారం కోసం డిమాండ్ చేశాయి.
ఆర్థిక మంత్రిత్వ శాఖ థింక్ ట్యాంక్ అయిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ(ఎన్ఐపీఎఫ్పీ) కొన్ని రోజుల క్రితం ప్రచురించిన ఒక అధ్యయనంలో వారి ఆందోళనలు ప్రతిధ్వనించింది. ఇది 2019-24 మధ్య రాష్ట్రాల ఆదాయంపై జీఎస్టీ ప్రభావాన్ని అంచనా వేశాయి. రాష్ట్రాలు ఆదాయ కొరత ఎదుర్కొంటున్నాయని పేర్కొంది.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం..
ఎన్ఐపీఎఫ్పీ అధ్యయనం ప్రకారం.. 2021-24 మధ్యకాలంలో కొన్ని రాష్ట్రాలు అవసరమైన ఆదాయ వాటాను సాధించలేకపోయాయి. కొన్ని జీఎస్టీ పరిహారం పొందలేకపోయాయి. అధిక ఆదాయా వాటా పరంగా జీఎస్టీ నుంచి రాష్ట్రాలు ఇంకా ప్రయోజనం పొందలేకపోయాయి.
‘‘నామమాత్రపు జీఎస్డీపీ శాతంగా ఎస్జీఎస్టీ సేకరణ అనేది 2016 తో పోలిస్తే 2017 లో వాటి ఆదాయం గణనీయంగా పడిపోయింది’’ అని నివేదించింది. దాదాపు 18 రాష్ట్రాలలో ఆరు రాష్ట్రాలు మాత్రమే బేస్ లైన్ ను దాటి తమ ఆదాయాన్ని మెరుగుపరుచుకోగలిగాయి.
వీటిలో ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్(ఎఫ్వై 19), మహారాష్ట్ర(ఎఫ్వై 21) హర్యానా(ఎఫ్ఫై 24) రాష్ట్రాలు ఉన్నాయి. జీఎస్టీ పనితీరు బాగా ఉన్నప్పటికీ చాలా రాష్ట్రాలు మాత్రం ఆదాయం కోల్పోయాయని వివరించింది.
ఆంధ్రప్రదేశ్, గోవా, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, పంజాబ్, బెంగాల్ కొన్ని ఏడాదులు వాటి ఆదాయాన్ని అందుకోలేకపోయాయి. బీహర్, తెలంగాణ రెండు సార్లు, గుజరాత్, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ మూడు సార్లు మిస్ అయ్యాయి. ఒడిశా ఏకంగా నాలుగు సార్లు అందుకోలేక చతికిల పడింది. హర్యానా, మహారాష్ట్ర మాత్రమే తమ పనితీరులో దూసుకుపోతున్నాయి.
అసమాన పెరుగుదల..
ఎస్జీఎస్టీలో వృద్ది రాష్ట్రాలకు అసమానంగా ఉంది. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి ఆర్ధిక వృద్ది, ద్రవ్యోల్భణం ప్రభావిత ఆదాయ సమీకరణపై జీఎస్టీ ప్రభావాన్ని తగ్గించడానికి అనేక సందర్భాలలో రేట్ల తగ్గింపులు, రెండోది పన్ను ఎగవేత రాష్ట్రాల ఆదాయా ప్రొఫైల్ దెబ్బతీసింది.
కర్ణాటక రెవెన్యూ మంత్రి కృష్ణ బైరే గౌడ శుక్రవారం జీఎస్టీ సమావేశంలో మాట్లాడుతూ.. జీఎస్టీలో 17 రౌండ్ల హేతుబద్దీకరణ జరిగిందని, ఇలా జరిగిన ప్రతిసారి రాష్ట్రాల ఆదాయాలు నష్టపోయామని వాదించారు. వ్యక్తిగతంగా రాష్ట్రాల ఆదాయ నష్టాలు రూ. 6 వేల నుంచి 9 వేల కోట్ల వరకూ ఉంటుందని చెప్పారు.
రాష్ట్రాల పన్ను ఆదాయం..
కర్ణాటక ఆర్థిక మంత్రి రాష్ట్రాలు తమ ఆదాయంలో 50 శాతం కేవలం జీఎస్టీపైనే ఆధారపడినట్లు చెప్పారు. ఇది తప్పు. అయితే 15 నుంచి 20 శాతం ఆదాయం నష్టపోయిందని చెప్పడం మాత్రం తప్పుకాకపోవచ్చు.
వరుసుగా వచ్చిన ఆర్థిక సర్వేలు అందించిన డేటాను బట్టి చూస్తే రాష్ట్రాల పన్ను ఆదాయంలో ఎక్కువ భాగం వారి సొంత పన్ను ద్వారానే వస్తుంది. వారి పన్నుల వనరులు ఎస్జీఎస్టీ, రాష్ట్ర ఎక్సైజ్, వాహానాలపై పన్నులు, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు, భూమి ఆదాయం.
జీఎస్టీకి ముందు ఆర్థిక సంవత్సరం 2012-2017 కాలంలో వారి సొంత పన్ను జీడీపీలో సగటున 66.6 శాతంగా ఉంది. 2018 ఆర్థిక సంవత్సరం మొదటి జీఎస్టీ ఆర్థిక సంవత్సరంల్లో ఇది 64.7 శాతానికి తగ్గింది. 2019-26(బీఈ) జీఎస్టీ తరువాత ఆర్ధిక సంవత్సరాల్లో ఇది 64.6 శాతానికి మరింత తగ్గింది.
రాష్ట్రాల సొంతపన్ను 2016-17 ఆర్థిక సంవత్సరాలలో ఎందుకు తగ్గింది. 2015 ఆర్థిక సంవత్సరంలో 9.4 శాతం నుంచి 2016 ఆర్థిక సంవత్సరంలో 8.7 శాతం, 2017 లో 8.5 శాతానికి పడిపోయింది. దీనికి మరో కారణం 2016 లో జరిగిన పెద్ద నోట్ల రద్దు.
అసంఘటిత రంగానికి జీఎస్టీ షాక్..
జీఎస్టీ ప్రవేశపెట్టడం వలన అనధికార రంగానికి దాని ఇన్ కం టాక్స్ క్రెడిట్ నిబంధన కారణంగా పెద్ద షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా వేలాది ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయి. 2020 లో వృద్ది 3. 9 శాతానికి పడిపోయింది.
వూహాన్ వైరస్ 2021 లో ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసింది. దీని ప్రభావం 2022 లోనూ కనిపించింది. దీనివల్ల అసంఘటిత రంగం మరింత కిందకి దిగజారింది. రికవరీ మరింత ‘కే’ ఆకారంలోకి మారింది.
ఈ కారణాల వల్ల సొంత పన్ను వృద్ది చాలా అసమానంగా ఉంది. 2021 ఆర్థిక సంవత్సరంలో -5.8 శాతం నుంచి 2022లో 9.7 శాతం, 2023 లో 7.6 శాతం, 2024 లో 9.2 శాతం, 2025 లో 6.5 శాతం స్వంత వృద్దిపై ప్రభావం చూపాయి.
రాష్ట్రాలు తమ సొంతపన్ను కాకుండా కేంద్ర స్థూల పన్నులో వాటాను పొందుతాయి. ఆర్థిక సంఘం అవార్డుల ద్వారా నిర్ణయించబడుతుంది. దీని ద్వారా వారి మొత్తం పన్ను ఆదాయం పెరుగుతుంది.
రాష్ట్రాల సొంత పన్ను, కేంద్ర పన్ను బదిలీలను జీడీపీలో శాతంగా పోల్చి చూసే చిత్రం కింద ఉంది. బదిలీలో పెరుగుదలను అధిక ఫైనాన్స్ కమిషన్ అవార్డుల కారణంగా కారణంగా ఉంది. 13 వ ఆర్థిక సంఘం 32 శాతం 42 శాతానికి, పెంచగా తరువాత వచ్చిన ఆర్థిక సంఘం 41 శాతానికి పెంచింది. 16 ఆర్థిక సంఘం అక్టోబర్ చివరి నాటికి తన అవార్డులు ప్రకటించే అవకాశం ఉంది.