1971 వార్తా క్లిప్పులను పంచుకున్న భారత సైన్యం
రష్యాతో యుద్దానికి భారత్ సాయం చేస్తున్న ట్రంప్ వ్యాఖ్యలతో, అమెరికాకు కౌంటర్ ఇచ్చిన ఆర్మీ;
By : Praveen Chepyala
Update: 2025-08-05 11:03 GMT
భారత్ పై అమెరికా అధ్యక్షుడు సుంకాలు ప్రకటించిన నేపథ్యంలో భారత సైన్యం కూడా ప్రతిస్పందించింది. 1971 లో భారత్ పైకి దాడికి దిగిన పాకిస్తాన్ కు అమెరికా, చైనాతో కలిసి ఎలా ఆయుధాలు సరఫరా చేసిందో వివరించే వార్తా పత్రికల క్లిప్పులను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
‘‘ఆ సంవత్సరం ఈ రోజు యుద్ధం పెరిగింది. ఆగష్టు 05, 1971 నో ఫ్యాక్ట్స్.. 54 నుంచి పాకిస్తాన్ కు యూఎస్ రెండు బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలు రవాణా చేయబడ్డాయి’’ అని భారత సైన్యం తూర్పు కమాండ్ ఎక్స్ లో పోస్ట్ చేసింది.
పాకిస్తాన్ కు అమెరికా ఆయుధాల సరఫరా..
బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ సైనిక చర్య తరువాత పాకిస్తాన్ కు ఆయుధాలు సరఫరాపై భారత్ నాటో దేశాలతో పాటు, పూర్వపు సోవియట్ యూనియన్ ను సంప్రదించిందని అప్పటి రక్షణ మంత్రి వీసీ శుక్లా రాజ్యసభకు తెలియజేసినట్లు ఆ వార్తా పత్రిక క్లిప్ లో ఉంది.
సోవియట్ యూనియన్, ఫ్రాన్స్ రెండు కూడా పాకిస్తాన్ కు ఆయుధాలు సరఫరా చేయడాన్ని తిరస్కరించినప్పటికీ అమెరికా, పాకిస్తాన్ కు సైనిక మద్దతును అందిస్తునే ఉందని శుక్లా చెప్పినట్లు అందులో స్పష్టంగా కనిపిస్తుంది.
పాకిస్తాన్ కు 2 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలు..
అమెరికా - చైనా రెండు కూడా పాకిస్తాన్ కు తక్కువ ధరకు ఆయుధాలను సరఫరా చేశాయని శుక్లా చెప్పారని నివేదిక పేర్కొంది. ‘‘చైనా, అమెరికా రెండు పాకిస్తాన్ కు రాయితీ ధరలకు ఆయుధాలను సరఫరా చేశాయని మిస్టర్ శుక్లా అన్నారు. ఫ్రెంచ్ వారు ఎటువంటి రాయితీలు లేకుండా వాటిని నగదుకు అమ్మేశారు’’ అని నివేదిక పేర్కొంది.
ప్రభుత్వ అంచనా ప్రకారం.. 1954 లో ఇస్లామాబాద్ తో ఆయుధ ఒప్పందం పై సంతకం చేసినప్పటి నుంచి పాకిస్తాన్ కు అమెరికా ఆయుధాల ఎగుమతుల విలువ 2 బిలియన్ డాలర్ల అని అది పేర్కొంది.
భారత్ పై ట్రంప్ సుంకాలు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ నుంచి వచ్చే అన్ని వస్తువులపై 25 శాతం సుంకాన్ని విధించిన తరువాత కొన్ని రోజుల తరువాత న్యూఢిల్లీ, రష్యా నుంచి చమురు, ఆయుధాలను కొనుగోలు చేసినందుకు పేర్కొనబడని జరిమానాను విధించిన విషయం తెలిసిందే. అయితే ట్రంప్ పాకిస్తాన్ పై సుంకాలు తగ్గించారు. ఇంతకుముందు 29 శాతం నుంచి 19 శాతానికి తగ్గించారు.
‘‘భారత్, రష్యన్ చమురును భారీ మొత్తంలో కొనుగోలు చేయడమే కాకుండా కొనుగోలు చేసిన ఎక్కువ భాగాన్ని ఓపెన్ మార్కెట్ లో విక్రయిస్తూ భారీ లాభాలను పోగు చేసుకుంటోంది.
రష్యా చేస్తున్న యుద్ధం వల్ల వేలాది మంది ఉక్రెయిన్ పౌరులు మరణిస్తున్నారు. అయినా వారికి పట్టింపులేదు. దీని కారణంగా భారత్ యూఎస్ఏకి చెల్లించే సుంకాన్ని నేను గణనీయంగా పెంచాను’’ అని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ లో పేర్కొన్నారు.
అయితే ట్రంప్ ఆరోపణలను భారత్ తిప్పికొట్టింది. రష్యాతో భారత్ కంటే ఈయూ, అమెరికా భారీ స్థాయిలో వాణిజ్యం నెరుపుతున్నాయని గణాంకాలను విడుదల చేసింది. ఈయూ రికార్డు స్థాయిలో గ్యాస్ ను రష్యా నుంచి దిగుమతి చేసుకుందని వెల్లడించింది.
ఈ రెండు ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నాయని తెలిపింది. తమ దేశ ఇంధన అవసరాలు, ప్రపంచ ఇంధన స్థిరత్వాన్ని తీసుకురావడానికి తాము రష్యా వైపు మళ్లింపు ప్రకటించింది.