జీవించాడు, జీవిస్తూ జారుకున్నాడు...
ఓ నాలుగు సినిమాలు చూస్తే, అతని నటన విశిష్టత అర్ధమైపోతుంది.
By : The Federal
Update: 2025-09-25 03:48 GMT
-రామ్.చింతకుంట
నాలుగు మెతుకులు చూసి , ఎట్లా అన్నం ఎంత ఉడికిందో తెలిసినట్టు, Robert రెటీఫోర్డ్ వి ఓ నాలుగు సినిమాలు చూస్తే, అతని నటన విశిష్టత అర్ధమైపోతుంది.
Indecent Proposal సినిమాలో, John Gage పాత్రలో, డబ్బు ఎంతో అవసరమై ఉన్న దంపతులు, Woody Harrelson భార్య Demi Mooreతో చేసే సన్నివేశం నేను చూసిన అత్యంత అనూహ్యమైన కథా మలుపుల్లో ఒకటి. Robert Redford ఏంతో ప్రశాంతంగా, స్థిరమైన స్వరంతో, “Suppose I were to offer you a million dollars for one night with your wife?” అని అడుగుతాడు. ఇది చాలా హేయమైన ఆలోచనే, కానీ ఈ సన్నివేశంలో ఆయన చూపు అచంచలంగా ఉండటంతోపాటు, ఆ క్షణం ఆశ్చర్యకరంగా, అదే సమయంలో ఒక విధమైన గౌరవాన్ని కలిగిస్తుంది.
ఈ పాత్రలో ప్రత్యేకత తర్వాతి మలుపులో ఉంది: సంపద, ప్రలోభాల ప్రతిరూపంగా కనిపించే John, చివరికి ఆమెను నిజంగా ప్రేమిస్తాడు. కానీ, చివరికి ఆమెను తన భర్త దగ్గరకు తిరిగి వెళ్లనిస్తాడు. అది కేవలం reconciliation కాదని, వారిద్దరినీ కలిపే core honesty మరియు bondingను గుర్తించడం అని అర్థమవుతుంది. తాను ఇష్టపడ్డ వ్యక్తిని విడిచిపెట్టే ఆ చర్య కథను ఒక సాధారణ bargain నుండి లోతైన vulnerability మరియు humanityతో కూడిన అనుభూతిగా మార్చుతుంది. నేటికీ ఆ తలా తిప్పకుండా చూసే చూపులో, Robert చిరస్థాయిగా ఉండిపోతాడు.
The Horse Whispererలో, Tom Bookerగా మాటల కంటే మౌనంతోనే ఎక్కువగా మాట్లాడతాడు. ఓ పరిచయ సన్నివేశంలో ,' తమ గుర్రం వల్ల ఉన్న సమస్యని తీర్చమని ఫోన్ వస్తే, తప్పుగా చెప్పారు, నేను మీ వల్ల గుర్రాలకున్న సమస్యలను తీర్చేవాడిని అంటూ చెప్పడంతో అతని ప్రత్యేకత తెలుస్తుంది. Montana horizon ముందు నిలబడి, గుర్రం మెడపై మృదువుగా చెయ్యి పెట్టి, అతను సహనంతోనే నయం చెయ్యడం చూసి అబ్బురపోతాం. అతని స్వరం మృదువుగా, almost a whisper లా ఉంటూ, ఇలా చెబుతాడు, “Knowing it’s in there, but just out of reach that’s what drives us. That’s what’s so hard to let go of.” Redford అది కేవలం గుర్రానికి మాత్రమే కాకుండా, బాధ విముక్తి కోసం తపించే ప్రతి గాయపడిన మనసుకు చెప్పినట్టుగా అనిపింపజేస్తాడు.
Watergate స్కాండల్ పై వచ్చిన All the President’s Men లో నిజ జీవిత Bob Woodward పాత్రలో ఆయన ఆవశక్యత , పట్టుదలని ప్రతిబింబిస్తాడు. నోటుపుస్తకం పై pen తో తడుతూ, ఎగిరి గంతున ఫోన్ అందుకొంటూ మాట్లాడ్డం, newsroom అంతా ఆందోళనగా చూడటం, జుట్టులో చెయ్యి వేసుకోవడం, తాను పని చేస్తున్న వార్త కలిగించే ఆదుర్ధ, ఇలా ఇవన్నీ సత్యాన్వేషణ యొక్క భారాన్ని మోయడం చూపిస్తాయి. ఒక సమయంలో ఆయన అంగీకరిస్తాడు: “All we’ve got are pieces. We don’t know what the puzzle is supposed to look like.” ఆయన అశాంతి , ఆత్రుత journalism ను సాక్షాత్కారంగా ఒక జీవన పోరాటంలా సాక్షాత్కరింపజేస్తుంది.
నాకెంతో నచ్చిన సినిమాగా చెప్పుకొనే The Candidate లో Bill McKay గా పోషించిన పాత్ర సూపర్బ్. రాజకీయాల్లో మొదట ముభవంగా, సిగ్గరిగా, బలహీనుడిగా, నిజాయితీ పరుడిగా, అసౌకర్యంగా ఉంటాడు. అతని ప్రవర్తనలో ఎదో తెలియని రాజకీయాలకు లేని అసహజత, సగం నవ్వు వెనుక ఉన్న సంకోచాన్ని చూపిస్తుంది. కానీ ప్రచారం జోరుందుకున్నాక, కొనసాగుతున్న కొద్దీ, అతని handshake బలంగా మారుతుంది, చూపులు మరింత పదునుగా మారతాయి, మాటలు కోటలు దాటుతాయి. చివరి సన్నివేశంలో, విజయానంతరం, తాను ఎంత కోల్పోయింది, తాను వ్యతిరేకించిన వ్యక్తిత్వంగా తాను మారిపోవడం, ఓ దిశ, దిశ లేని విజయభారం మోస్తూ, చివరి మాటలుగా “What do we do now?” అనే ప్రశ్న నేటికీ నాలో మార్మోగుతూనే ఉంది. విజయపు విషాద ద్వంద్వ వైనాన్ని ఇంత గొప్పగా ఎవరు ఆవిష్కరించలేదు.
obert Redford కేవలం ఒక నటుడు మాత్రమే కాదు; ఆయన ఒక చలన కళాకారుడు. ఆయన నిశ్శబ్ద విరామ gestures , సున్నితమైన హావభావాలు తెర తర్వాత కూడా జీవించే పాత్రలను మనలో సృష్టిస్తాయి. ప్రలోభం ముందు నిలిచే శాంతమైన composure నుండి, ఓ వైద్యుడి నిశ్శబ్ద బలం వరకు, సత్యాన్వేషకుడి అశాంతి తపన నుండి, దారి తప్పిన విజేత కళ్లలోని వెతుకులాట వరకు, ఆయన మనకు నిలిచిపోయే పాత్రలను ఇస్తూనే వచ్చారు. ఆయన restraint, subtlety, సత్యంలలో ఒక master ఎప్పటికీ. అంతేకాక, ఆయన తన ప్రస్థానాన్ని ఆధారంగా తీసుకొని, స్థాపించిన Sundance Festival నేడు ప్రపంచానికి స్వతంత్ర సినిమా స్వరాన్ని వినిపించే గుర్తింపునిచ్చే వేదికగా నిలిచిందంటే....నేను మొన్న మరణించిన నటుడు, దర్శకుడు కన్నా, ఓ మనిషిని పరిచయం చేసానని తృప్తి కోసమే రాస్తున్న.
How softly and how gracefully he acted,
How tenderly he touched every role with truth.
As gently as he lived on screen, left the world the same way,
A true signature; he never acted, he was always living, in reel and in real.