ఓటిటిలలో ఆ నాలుగు హీరోలదే ఫుల్ డిమాండ్
వీళ్లకే అంత క్రేజ్ ఎందుకు?
గత రెండేళ్లుగా ఓటిటి మార్కెట్ పూర్తిగా మారిపోయింది. కేవలం క్రేజ్ ఉన్న స్టార్ హీరోల సినిమాలకే ఓటీటీ డీల్స్ క్లోజ్ అవుతున్నాయి… అయితే ఎవరి పేరుకి ఎంత రేట్ అనేది ఎప్పటికప్పుడు మారిపోతూంటుంది. వాళ్ల గత హిట్స్, ఇప్పటి మార్కెట్, రీసెంట్ ప్లాఫ్స్ అన్ని లెక్కలు కట్టి ఓటిటి సంస్దలు వాళ్ల సినిమాలకు ఇచ్చే రేట్ ని డిసైడ్ చేస్తాయి. అయితే సౌత్ లో నలుగురు సౌత్ హీరోల కు ఓటిటిలో ఉన్న మార్కట్ ని చూసి ఇండస్ట్రీనే షాక్ అవుతోంది!
సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడు థియేటర్ రిజల్ట్స్ కంటే OTT వ్యాల్యూ చాలా ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. గత సినిమాల స్ట్రీమింగ్ నిమిషాలు, కంటెంట్ ట్రాక్ రికార్డ్, పాన్ ఇండియా రీచ్… ఇవన్నీ కలిపి ఓటీటీ డిమాండ్‌ను నిర్ణయిస్తున్నాయి. చాలా మంది స్టార్లు కష్టపడుతున్నా, కొంతమంది నటులు మాత్రం షూట్ మొదలయ్యేలోపే కోట్ల డీల్స్ క్లోజ్ చేయించేస్తున్నారు!
మరి ఆ “OTT కింగ్స్” ఎవరు? ఎందుకు వాళ్ల పేరుకే అడ్వాన్స్‌లో డబ్బు పెట్టేస్తున్నారు Amazon, Netflix?
1. నాని – “ది ప్యారడైస్” షూట్‌కే ముందే డీల్ క్లోజ్ చేసిన హీరో!
పోస్ట్ పాండెమిక్‌లో కంటెంట్‌ను కచ్చితంగా డెలివర్ చేస్తున్న యంగ్ హీరో అంటే నాని. థియేటర్స్‌లో డీసెంట్ రికార్డ్. OTTలో మాత్రం రికార్డు వ్యూయర్‌షిప్. ఇవి నానిని డిజిటల్ మార్కెట్లో హాట్ ప్రాపర్టీగా మార్చేశాయి.
‘The Paradise’ డిజిటల్ రైట్స్ ఇప్పటికే అమ్ముడయ్యాయి. సుజీత్‌తో నెక్స్ట్ సినిమా ఇంకా షూట్ మొదలుకాలేదు, కానీ Netflix ముందే డీల్ క్లోజ్ చేసింది! Netflixకి నాని మీద నమ్మకం అంతగా ఉందంటే… అతని సినిమాలకు వారు ఫ్యాన్సీ రేట్స్ ఇవ్వడానికి రెడీ.
2 . సూర్య – థియేటర్ హిట్ లేకున్నా OTTలో టాప్ డిమాండ్!
బాక్సాఫీస్‌లో ఇటీవల పెద్ద హిట్స్ లేకపోయినా, OTTలో సూర్య పేరు ఒక బ్రాండ్. తన సినిమా విడుదలైతే టాప్ ట్రెండింగ్స్, భారీ స్ట్రీమింగ్ నిమిషాలు ఖచ్చితంగా వస్తున్నాయి. అందుకే Amazon, Netflix, Hotstar వంటి టాప్ ప్లేయర్స్… కాంబినేషన్ ఏమిటో పట్టించుకోకుండా — సూర్య సినిమా అంటే వెంటనే బిడ్డింగ్ మొదలుపెడుతున్నారు.
OTTలో అతని సర్వైవల్ కాదు… డామినేషన్ జరుగుతోంది.
3. దుల్కర్ సల్మాన్ – మూడు ఇండస్ట్రీల్లో క్రేజ్, ఒకే OTT మార్కెట్!
తెలుగు, తమిళం, మలయాళం—మూడు భాషల్లోనూ ఫ్యాన్ బేస్ ఉన్న అరుదైన నటుడు దుల్కర్. అతని సినిమాలు: క్లాస్ , కంటెంట్ మిక్స్. యూత్‌కు కనెక్ట్ అయ్యే స్టోరీలు వీటితో OTT వైపు భారీ డిమాండ్ తెచ్చేశాయి. దుల్కర్ సినిమాల నాన్-థియేట్రికల్ రైట్స్ అంటే మార్కెట్లో హడావుడి. ఏ ప్లాట్‌ఫారమ్ అయినా అతని సినిమాలను “సేఫ్ బెట్”గా భావిస్తోంది.
4. ధనుష్ – మూడు భాషల్లో వర్క్ చేస్తూ డిజిటల్ మార్కెట్ పెంచుకున్న స్టార్
నాని – సూర్య – దుల్కర్ తర్వాత డిజిటల్ స్పేస్‌లో బలమైన మార్కెట్ ఉన్న హీరో ధనుష్. అతను నటించినా, ప్రొడ్యూస్ చేసినా— ఏ సినిమా అయినా OTTలకు హై ఇంట్రెస్ట్.Netflix, Amazon వంటి ప్లాట్‌ఫార్మ్స్‌కి అతను “క్వాలిటీ కంటెంట్ గ్యారంటీ”లా మారిపోయాడు. తమిళం, తెలుగు, హిందీలో వరుసగా సినిమాలు చేస్తున్నందున పాన్ ఇండియా స్ట్రీమింగ్ విలువ అతనికి పెరుగుతూనే ఉంది.
ఇక వచ్చే ఐదు ఏళ్లలో ఎవరు OTT రూల్ చేస్తారు?
థియేటర్స్‌లో ఎన్ని మార్పులు వచ్చినా… OTT మార్కెట్‌లో ఈ నలుగురు స్టార్‌లు ప్రస్తుతం టాప్ సెగ్మెంట్‌లో నిలబడ్డారు. వారి ట్రాక్ రికార్డ్, కంటెంట్ పిక్స్, మల్టీ-లింగ్వల్ రీచ్—
ఇవన్నీ కలిపి ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ షూట్ మొదలయ్యేలోపే డబ్బు పెట్టడానికి కారణమయ్యాయి.
ఇక ప్రశ్న ఏమిటంటే…
తర్వాతి ఐదేళ్లలో ఈ లిస్ట్‌లో కొత్తగా ఎవరు చేరతారు?
లేదా ఇదే నలుగురు దాడి కొనసాగిస్తారా?
మీరు ఎవరిని OTT “Next Big Star”గా చూస్తున్నారు? అనేది కీలకాంశం.