ఈ సంక్రాంతి హీరోలది కాదు… హీరోయిన్ల ‘సర్వైవల్ గేమ్’!

నయనతార నుంచి శ్రీలీల వరకూ… సంక్రాతి టెన్షన్ ?

Update: 2025-12-14 02:30 GMT

సంక్రాంతి సీజన్ సాధారణంగా స్టార్ హీరోల బాక్సాఫీస్ పవర్‌ని పరీక్షిస్తుంది. కానీ ఈసారి మాత్రం సీన్ రివర్స్ అయింది. థియేటర్లలో అసలైన ఫైట్ హీరోయిన్ల మధ్యే జరుగుతోంది. వరుస ఫ్లాపులు, తగ్గుతున్న అవకాశాలు, మారుతున్న ట్రెండ్స్…అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన సమయం ఇదే. ఒక్క హిట్‌తో మళ్లీ టాప్‌లోకి రావాలనే ఆశతో నయనతార నుంచి శ్రీలీల వరకూ అందరూ బరిలోకి దిగుతున్నారు.

ఈ సంక్రాంతి ఎందుకు స్పెషల్?

ఈ సంక్రాంతి హీరోయిన్స్ కు గేమ్ ఛేంజర్ గా మారనుంది. వరుస ఫ్లాపులు, తగ్గుతున్న ఆఫర్లు, గుర్తింపు లేకపోవడం… ఇవన్నీ పక్కన పెట్టి ఒక్క హిట్‌తో మళ్లీ గేమ్ లోకి రావాలనే లక్ష్యంతో టాప్ హీరోయిన్లు రంగంలోకి దిగటం ఇక్కడ విశేషం. ఈసారి థియేటర్లలో జరుగబోయేది కేవలం బాక్సాఫీస్ పోరే కాదు… కెరీర్ సర్వైవల్ ఫైట్!

నయనతార నుంచి పూజా హెగ్డే వరకూ – ఎవరికి ఈ హిట్?

నయనతార: ‘జవాన్’ తర్వాత నయనతార కెరీర్ ఊపందుకుంటుందని అనుకున్నారు. కానీ అలా కాలేదు. థియేటర్లలోనే కాదు, OTTలో వచ్చిన మహిళా ప్రాధాన్య చిత్రాలు కూడా ఫెయిలయ్యాయి. ఇప్పుడు ఆమె ఆశలన్నీ చిరంజీవితో చేస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మీదే. సాధారణంగా ప్రమోషన్లకు దూరంగా ఉండే నయనతార… ఈసారి మాత్రం అసాధారణంగా యాక్టివ్ గా ఉంటోంది. ఇది ఒక్కటే చెబుతోంది – ఈ హిట్ ఆమెకు ఎంత అవసరమో!

మీనాక్షి చౌదరి: ఈ యంగ్ హీరోయిన్ పరిస్థితి కొంచెం వేరేలా ఉంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ హిట్ అయినా, గుర్తింపు మాత్రం ఆమెకు దక్కలేదు. ఆ క్రెడిట్ ఎక్కువగా ఐశ్వర్య రాజేష్‌కే వెళ్లింది. అందుకే ఈసారి నవీన్ పోలిశెట్టితో ‘అనగనగా ఒక రాజు’ ద్వారా సోలో కమర్షియల్ హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉంది.

నిధి అగర్వాల్: వరుస ఫ్లాపులతో పూర్తిగా వెనుకబడిపోయింది ఈ హీరోయిన్. ‘హరి హర వీరమల్లు’ మీద పెట్టుకున్న ఆశలు భారీ డిజాస్టర్‌తో కూలిపోయాయి. ఇప్పుడు ఆమె చూపంతా ‘ది రాజా సాబ్’ మీదే.

మాళవిక మోహన్ : ‘ది రాజా సాబ్’ సినిమాతోనే మాళవిక మోహనన్ కూడా తెలుగులో అడుగుపెడుతోంది. తమిళంలో కూడా బలమైన ఫేజ్‌లో లేని ఆమెకు, ఈ సినిమా టాలీవుడ్‌లో నిలదొక్కుకునే అవకాశమా… లేక తొలిప్రయత్నంలోనే ఎదురుదెబ్బా అన్నది ఆసక్తికరంగా మారింది.

డింపుల్ హయతి : ఈమె విషయానికి వస్తే .., ‘రామబాణం’ తర్వాత ఆమె దాదాపు కనిపించలేదు. ఇప్పుడు రవితేజతో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఆమె కెరీర్‌కు లైఫ్‌లైన్‌గా మారుతుందనే ఆశలో ఉంది. ఈ సినిమా హిట్ అయితే, మళ్లీ అవకాశాలు క్యూ కట్టే ఛాన్స్ ఉంది.

పూజా హెగ్డే, శ్రీలీల – కమ్‌బ్యాక్ లేదా కెరీర్ మలుపు?

పూజా హెగ్డే : ఈమె పరిస్థితి మరింత డెలికేట్. పాండమిక్ తర్వాత వచ్చిన ఆమె సినిమాలన్నీ డిజాస్టర్లే. స్టార్ హీరోయిన్ ఇమేజ్ ఒక్కసారిగా కరిగిపోయింది. ఇప్పుడు విజయ్ నటించిన ‘జననాయకన్’ తో థియేటర్లకు రిటర్న్ అవుతోంది. ఈ సినిమా హిట్ అయితేనే ఆమె మళ్లీ రేసులోకి వస్తుంది. లేదంటే ఆమె స్థానం మరింత బలహీనపడే ప్రమాదం ఉంది.

శ్రీలీల : ఈమె కూడా పూజా బాటలో ఉంది. ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా దూసుకెళ్లిన ఆమె, ‘మాస్ జాతర’, ‘రాబిన్‌హుడ్’, ‘స్కంద’ లాంటి ఫ్లాపులతో గట్టి దెబ్బ తిన్నది. శివకార్తికేయన్‌తో ‘పరాశక్తి’ ఆమెకు ఇప్పుడు చాలా కీలకం. ఈ హిట్ లేకపోతే ఆమె క్రేజ్ ఎంతవరకు నిలుస్తుందన్న ప్రశ్నలు బలపడతాయి.

ఈ సంక్రాంతి = హీరోయిన్లకు ‘డూ ఆర్ డై’

ఈ నేపధ్యంలో ఈ సంక్రాంతి ఎవరి సినిమా ఎంత కలెక్ట్ చేసిందన్నదానికంటే, ఎవరి కెరీర్ నిలబడుతుంది అన్నదే అసలు హెడ్లైన్. ఒక్క హిట్… మళ్లీ స్టార్‌డమ్ ఇస్తుంది. ఒక్క ఫ్లాప్… సైలెంట్‌గా సైడ్‌లైన్‌కు నెట్టేస్తుంది. ఈ సంక్రాంతి… హీరోయిన్ల భవితవ్యాన్ని నిర్ణయించే పండుగ!

Tags:    

Similar News