బాలయ్య-బోయపాటి ‘అఖండ 2: తాండవం’ రివ్యూ

ఫలించని సీక్వల్

Update: 2025-12-12 08:46 GMT

మన దేశాన్ని దెబ్బ కొట్టాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్న చైనాకు ఓ కొత్త ఆలోచన వస్తుంది.. మన భారతీయులంతా దేముడ్ని నమ్మటం వల్లే ధైర్యంగా ఉంటున్నారని, వాళ్ల నమ్మకం సడిలితే దేముడే లేడని నిరూపిస్తే..వాళ్లు బలహీనులు అయ్యిపోతారని భగవగ్దీను పాతికేళ్లు చదివి,రీసెర్చ్ చేసి, చర్చలు జరిపి మరీ కనుక్కుంటారు. అందుకోసం కుంభ‌మేళాని ల‌క్ష్యంగా చేసుకుంటారు. దాన్ని అమలు పరుస్తారు. అక్కడ నీళ్లలో ఓ రకమైన వైరస్ కలిపితే అక్కడ ప‌విత్ర‌స్నానం చేసిన చాలామంది కొన్ని నిమిషాల వ్య‌వ‌ధిలోనే అప‌స్మార‌క స్థితికి చేరుకుంటుంటారు.

అయితే ఇది జరుగుతుందని ముందే ఊహించినట్లుగా ... డీఆర్‌డీవోలో శాస్త్ర‌వేత్త‌లు యాంటీ డాట్ వాక్సిన్‌ని క‌నిపెట్టి జనాలకు ఇవ్వాలని నిర్ణయించుకుంటారు. ఆ విషయం తెలుసుకున్న శ‌త్రువులు ఆ ల్యాబ్‌ని నాశనం చేసి , ఆ సెంటిస్ట్ లు అందరినీ చంపేస్తారు. ఆ టీమ్ లో ఉన్న యంగ్ సైంటిస్ట్ జ‌న‌ని (హ‌ర్షాలీ మ‌ల్హోత్రా) మాత్రం ఆ వ్యాక్సిన్‌తో బ‌య‌ట‌ప‌డుతుంది. ఆ విషయం తెలుసుకున్న శ‌త్ర‌వులు ఆమెని వెంటాడతారు. అప్పుడు ఆమె తన తన తండ్రి తమ్ముడు,గతంలో తన చిన్న తనంలో రక్షించి, అవసరమైనప్పుడు పిలిస్తే వస్తానని చెప్పిన రుద్ర సికింద‌ర్ అఘోరా (బాల‌కృష్ణ‌) ని పిలుస్తుంది.

అప్పుడు జననిని ర‌క్షించేందుకు రుద్ర సికింద‌ర్ అఘోరా (బాల‌కృష్ణ‌) రంగంలోకి దిగుతాడు. అప్పుడేం జరిగింది. జననిని రక్షించటంతో పాటు ఈ దేశ ప్రజలను అఘోరా ఎలా రక్షించారు. పనిలో పనిగా స‌నాత‌న హైంద‌వ ధ‌ర్మం గొప్ప‌తనాన్ని ఎలా చాటి చెప్పారు? చైనా వాళ్లకు ఎలా బుద్ది చెప్పారు వంటి విష‌యాల్ని తెర‌పై చూసి తెలుసుకోవ‌ల్సిందే.

ఎనాలసిస్

అతడు సినిమాలో బ్రహ్మాజీ చెప్పిన ఓ డైలాగు ఉంటుంది..మహేష్ బాబుని ఏసేయటానికి తన స్కెచ్ ని తణికెళ్ల భరణికి చెప్తూంటాడు.. "వీరమ్మ చెరువు దగ్గర 4 సుమోలుంటాయి. గట్టు దాటుతూంటే వేసేస్తాం... దాటాడే అనుకో... చుక్కలకుంట దగ్గర 3 సుమోలుంటాయ్. ఒక వేళ అక్కడా మిస్సయ్యాడు అనుకో... సరివితోపు చివరలో ఈ సారి 5 సుమోలు పెడతా అంటాడు..ఎక్కడోచట ప్రేక్షకుడుని పట్టుకోవాలి...మిస్సవుకూడదనే సదుద్దేశ్యంతో...అలాగ ఇందులో దర్శకుడు బోయపాటి శ్రీను...ట్రిప్ కు ఒక్కో జానర్ చొప్పున అన్నట్లు వరసగా జానర్స్ పేర్చుకుంటూ , మార్చుకుంటూ వెళ్లిపోతాడు. అయితే వాటి మధ్యలో మనం నలిగిపోతాం.అలిసిపోతాం అనే విషయం మర్చిపోయాడు..లేకపోతే పౌరాణిక సినిమాలో లాగ... శివుడు కనపడటం ఏమిటి...ఈ సినిమా గురించి ఒకే లైన్‌లో చెప్పాలంటే— సనాతన ధర్మం + దేశభక్తి + అఘోరా మాస్ + జియోపాలిటికల్ బియోవార్ = ఒక హైపర్ మిక్స్‌డ్ కాక్‌టెయిల్. కానీ ఆ కాక్‌టెయిల్‌కి అసలు “కిక్” తగ్గింది.

వీక్ విలనీ

జనని పాత్రను DRDO సైంటిస్ట్‌గా తీసుకురావడం— ఇది సీక్వెల్‌కు సరైన “ఎమోషనల్ బ్రిడ్జ్”. మొదటి భాగంలోని చిన్నారి ఇప్పుడు దేశ రక్షణలో కీలక భాగంగా మారడం…

స్క్రీన్‌ప్లే పాయింట్‌ ఆఫ్ వ్యూలో సమంజసం. కానీ— ఒకే ఒక్క చైనా జనరల్... ఇండియాపై బయోవార్ చేయటం మొదలెడతాడు. ఇది స్క్రీన్‌ప్లేలోని విలన్ సెటప్‌ను బలహీనపరుస్తుంది. దేశం వెనుక లేదు, పాలసీ లేదు, మిలిటరీ కమాండ్ లేదు… అతను ఒక వైల్డ్‌కార్డ్ విలన్‌గా మారిపోయాడు. అలాగే ఆది పినిశెట్టిని ఓ క్షుద్రపోసకుడుగా ఓ విలన్ గా ఎందుకు తీసుకువచ్చారో..ఎందుకు హఠాత్తుగా ఆ పాత్రను ముగించారో అర్దం పర్దం లేదు. దాంతో విలనికి సరపడ స్ట్రెంత్ ఎక్కడా లేదు. విలన్ సరిగ్గా లేకపోతే కథలో అర్జెన్సీ ఉండదు. హీరో ను ఎంత లేపినా సోసోగానే ఉంటుంది.

సెటప్ కే సగం సినిమా సరిపాయే...

అలాగే సినిమా ఇంటర్వెల్ దాకా అఖండ పాత్ర రాదు..అసలు మనం సినిమాకు వెళ్లిందే ఆ పాత్ర కోసం. ఆ పాత్ర ఎప్పుడో ఇంటర్వెల్ లో యాక్షన్ కు వస్తే ...అప్పటిదాకా ఎంతబోర్. ఏవేవో పాత్రలు, ఏవేవో చెప్తూ విసిగిస్తూంటాయి. మన దృష్టి అఖండ మీద ఉన్న సంగతి దర్శకుడు మర్చిపోయినట్లున్నాడు.

అయితే ఇంటర్వల్ సీక్వెన్స్ మాత్రం ప్యూర్ బోయపాటి థండర్. అక్కడ అఖండ (ఎల్డర్ వెర్షన్ అఘోరా) ఎంట్రీ— పెర్ఫెక్ట్ పంచ్, పెర్ఫెక్ట్ build-up.

సెకండాఫ్ లో ...: డైలాగ్-ఓరియెంటెడ్ ధార్మికత & లాజిక్‌ను జయించిన బోయపాటి యూనివర్స్

పోస్ట్ ఇంటర్వల్— బోయపాటి పూర్తి స్థాయిలో సనాతన ధర్మం, శక్తి, శివతత్త్వం వైపు వెళ్తాడు. ఆది పినిశెట్టి పాత్ర, తాంత్రిక్ లేయర్— క్యారెక్టర్ ఉనికి ఇంట్రెస్టింగ్, కాని లాజిక్‌కు పూర్తిగా వ్యతిరేకం. ముఖ్యంగా— ఆది పినిశెట్టి కంటికి, నాలుకకు వచ్చిన మిరాక్యూలస్ రిపేర్— బోయపాటి యూనివర్స్‌లో మాత్రమే జరిగే అద్భుతం. ఇది ప్రేక్షకులు అంగీకరించాలంటే ప్రపంచం మరింత ఫాంటసీ రూపం తీసుకోవాలి… కానీ సినిమా రియల్-వరల్డ్ ఈవెంట్స్ (COVID, Galwan) ను కూడా టచ్ చేస్తోంది. ఈ మిక్స్—స్క్రీన్‌ప్లేకి అసలు సమస్య గా మారి, ఏది నమ్మాలో.ఏది నమ్మకూడదో తెలియని పరిస్దితి.

లాజిక్ లెస్..

ఈ సినిమాలో లాజిక్ ఎంత వీక్ గా ఉంటుందంటే....తను ఎమ్మల్యేగా ఉంటున్న ఏరియాలో గంజాయి విపరీతంగా స్మగ్లింగ్ జరుగుతోందని లోకల్ ఎమ్మయ్యే అయిన మన హీరోకు తెలియదు కానీ డిల్లీలో ప్రధా మంత్రి ఆఫీస్ లో డిస్కషన్ వచ్చి వాళ్లు ఫోన్ చేసి చెప్తే అప్పుడు ఆయన వెళ్లి ఫైట్ చేసి బుద్ది చెప్తాడు... హీరో క్యారక్టర్ ని ఎంతలా దెబ్బ తీస్తుందో ఈ సీన్ అనే ఐడియా ఎందుకు దర్శకుడుకి రాలేదో ఇప్పటికీ ఆశ్చర్యం.

సర్లే కమర్షియల్ సినిమాల్లో లాజిక్ లు వెతకకూడదంటే ఓకే...

ఎవరెలా చేసారు.

నటనా పరంగా, వయసైన అఖండగా నందమూరి బాలకృష్ణ బాగా చేసారు. ఆయన వంక పెట్టడానికి లేదు. లీనమై చేసారు. సంయుక్త మీనన్ పాత్ర పెద్దగా చెప్పుకోవటానికి ఏమీ లేదు. ఆది పినిశెట్టి విలన్‌గా లుక్ పరంగా బాగున్నా, పాత్రలో భయం లేదా తీవ్రత కనిపించలేదు. తెలుగు డెబ్యూట్ చేసిన హర్షాలి మల్హోత్రా మాత్రం తన పాత్రను బాగా చేసింది.

టెక్నికల్ గా ..

బోయపాటి–బాలకృష్ణ కాంబినేషన్ సాధారణంగా మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కానీ ఈసారి కథనంలో పట్టుదల తక్కువగా ఉంది. యాక్షన్ సీన్లు పరర్ ఫుల్ గా ఉన్నప్పటికీ, చాలా చోట్ల సమస్యలు త్రిశూలంతోనే పరిష్కారమవుతుండటం రిపిటేషన్‌గా అనిపిస్తుంది. సనాతన ధర్మంపై వచ్చిన కొన్ని డైలాగ్‌లు మాత్రం బాగున్నాయి.

థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్నిచోట్ల గట్టిగా వర్కవుట్ అయ్యినా, పాటలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. సినిమాటోగ్రఫీ అందంగా ఉంది. కానీ VFX మాత్రం తేలిపోయింది. కొన్ని సన్నివేశాల్లో చాలా బలహీనంగా కనిపించింది.

ఫైనల్ థాట్

మొత్తానికి, ఇది మొదటి “Akhanda” స్థాయిని చేరుకోలేని విఫల ప్రయత్నం. భక్తి అంశాలు ఉన్నా, భావోద్వేగం మాత్రం స్పష్టంగా కొరవడింది. ఎమోషన్ లేని ఏ సీన్ కు ప్రమోషన్ ఉండదు.

Tags:    

Similar News