సెంట్రల్ గవర్నమెంట్ OTT ‘వేవ్స్’ బ్లాక్‌బస్టర్ ఎంట్రీ!

ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌ OTTలకు గట్టి షాక్;

Update: 2025-05-11 05:27 GMT

ఓటీటీ అంటే... నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్, ఆహా, జీ5 అనే పేర్లు వెంటనే గుర్తుకు వస్తాయి. ఇవన్నీ ప్రైవేట్ కంపెనీలే. కానీ చాలా మందికి తెలియని నిజం ఏంటంటే — ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా ఓ ఓటీటీని అధికారికంగా ప్రారంభించింది. దాని పేరు... "వేవ్స్"!

ఇది దూరదర్శన్ (ప్రసార భారతి) ఆధ్వర్యంలో, సమాజానికి ఉపయోగపడే ఫ్యామిలీ ఫ్రెండ్లీ కంటెంట్ అందించేందుకు రూపొందించబడింది. 2024 నవంబర్లో అధికారికంగా లాంచ్ అయిన ఈ ఓటీటీ ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి వచ్చింది.

ఎందుకంటే... పహల్గామ్ ఉగ్రదాడి, భారత సైన్యం బలమైన ప్రతిచర్య, పాక్ కళాకారులపై నిషేధం వంటి పరిణామాల మధ్య, భారతీయతకు బాసటగా నిలిచే ఓటీటీగా "వేవ్స్"ను ప్రభుత్వం తిరిగి ప్రముఖంగా ప్రమోట్ చేయడం మొదలెట్టింది.

'వేవ్స్' లో ఎన్నో భాషలు... అందరికీ వినోదం!

ఇది కేవలం హిందీలో మాత్రమే కాదు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బంగ్లా, ఒడియా, అస్సామీ, పంజాబీ సహా 12 భారతీయ భాషల్లో ‘వేవ్స్’ అందుబాటులో ఉంది. అంతేకాదు — ఇంగ్లిష్ భాషలోనూ కంటెంట్ అందిస్తోంది.

ఏం ఉంది 'వేవ్స్' లో?

సినిమాలు (పాత & కొత్త)

టీవీ షోలు (డీడీ క్లాసిక్స్ సహా)

రేడియో ప్రోగ్రామ్స్

గేమ్స్ & యూజర్ ఇంటరాక్టివ్ ఫీచర్లు

'వేవ్స్' ప్లాన్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

ఇంతవరకు మనం ఓటీటీ అంటే నెలకు 199, 299 అని చెల్లించిన అలవాటు. కానీ గవర్నమెంట్ ఓటీటీ అయిన 'వేవ్స్' మాత్రం మామూలు జనంకి నచ్చే ధరలో అందుబాటులోకి వచ్చింది.

ప్లాన్స్ ఎలా ఉన్నాయంటే...

నెలవారీ ప్లాన్ – కేవలం ₹30 మాత్రమే

→ 2 డివైజ్‌లలో స్ట్రీమింగ్ మాత్రమే. డౌన్‌లోడ్ లేదు.

క్వార్టర్లీ ప్లాన్ (3 నెలల ప్లాన్) – ₹85

→ ఇదీ 2 డివైజ్‌లకే పరిమితం.

వార్షిక డైమండ్ ప్లాన్ – ₹350/ఏడాది

→ ఇప్పటికీ 2 డివైజ్‌లలో మాత్రమే యాక్సెస్.

వార్షిక ప్లాటినమ్ ప్లాన్ – ₹999/ఏడాది

→ ఇది మాత్రం భారీ బోనస్! ఏకంగా 4 డివైజ్‌లలో యాక్సెస్.

ఫ్రీ కంటెంట్ ఉందా? ఉంది కానీ...

'వేవ్స్' ఓటీటీలో కాస్త కంటెంట్ ఫ్రీగా కూడా అందుబాటులో ఉంది.

కానీ ఒక చిన్న తేడా –

👉 ఫ్రీ యూజర్లకు డౌన్‌లోడ్ ఆప్షన్ ఉండదు

👉 స్ట్రీమింగ్ మాత్రమే లభిస్తుంది

తక్కువ ఖర్చుతో ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్?

ఓటీటీ ఖర్చులు భరించలేని మధ్య తరగతి కుటుంబాలకు ఇది ఒక గొప్ప ప్రత్యామ్నాయంగా నిలవబోతోంది. ప్రభుత్వ సాంస్కృతిక దృష్టిని నిలబెట్టేలా, అన్ని భాషలలో, అన్ని వయసులకీ తగిన కంటెంట్‌తో 'వేవ్స్' కొత్త విప్లవానికి నాంది పలికే సూచనలు కనిపిస్తున్నాయి!

ఫోన్ నంబర్ లేదా ఈ మెయిల్ అడ్రస్ ద్వారా 'వేవ్స్' ఓటీటీని సబ్‌స్క్రైబ్ కావచ్చ. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన షోస్, సినిమాలు ఈ ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి.



ఇదంతా ఫ్యామిలీకి తగిన, నైతిక విలువలతో కూడిన కంటెంట్ అని ప్రసార భారతి ప్రతినిధులు చెబుతున్నారు.

ఇప్పటి వరకూ ప్రైవేట్ కంపెనీలు మాత్రమే ఈ రంగంలో ఉన్నా... ఇప్పుడు భారత ప్రభుత్వమే ఓటీటీ రంగంలోకి దిగడం ఇది తొలిసారి. అది కూడా ‘దేశభక్తి’, ‘సాంస్కృతిక విలువలు’, ‘భారతీయ సంప్రదాయాన్ని’ ప్రతిబింబించే విధంగా!

Tags:    

Similar News