నార్త్ ఇండియాలో ‘అఖండ 2’ కలెక్షన్స్ పరిస్దితి ఏమిటి?

సనాతన ధర్మం కనెక్షన్ కుదరిందా?

Update: 2025-12-15 12:34 GMT

‘అఖండ’ అనే టైటిల్‌తోనే థియేటర్‌లో సీటు ఊగిపోయే మాస్ ఎక్స్‌పెక్టేషన్.

దానికి తోడు బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబో అంటే ఫ్యాన్స్‌కి అది గ్యారంటీ ప్యాకేజ్.

అలాంటి అంచనాల మధ్య వారం ఆలస్యంగా రిలీజైన ‘అఖండ 2’, ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి ఒక స్పష్టమైన ప్రశ్నను ముందుకు తెచ్చింది –

ఇది హోల్డ్ అయ్యిందా? లేక స్టక్ అయిందా?

Opening vs Trend: డే–1 బలం, డే–2 నుంచే బలహీనత

ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే సినిమా ఓకే అనిపించింది. 30 కోట్ల నెట్ ఓపెనింగ్ అంటే బాలయ్య మార్కెట్ ఇంకా బలంగా ఉందని స్పష్టం చేసింది. కానీ అసలు సమస్య అక్కడే మొదలైంది. సాధారణంగా మాస్ సినిమాలు, ముఖ్యంగా బాలయ్య సినిమాలు, టాక్ ఓకే ఉంటే రెండో రోజు నుంచి పికప్ అవుతాయి.

‘అఖండ 2’లో మాత్రం అది జరగలేదు.

డే–2కి కలెక్షన్స్ దాదాపు సగానికి పడిపోవడం, డే–3కి కూడా అదే ట్రెండ్ కొనసాగడం సినిమా మీద ఉన్న మౌత్ టాక్ బలహీనంగా ఉందన్నదానికి క్లియర్ సిగ్నల్. అంటే ఫ్యాన్స్ ఓపెనింగ్ ఇచ్చారు, కానీ న్యూట్రల్ ఆడియన్స్ కనెక్ట్ కాలేదు.

ఒక రిలీఫ్, ఒక వార్నింగ్:

పతనం లేదు… కానీ గ్రోత్ కూడా లేదు. ఇదే

ఇక్కడ కీలక పాయింట్ . టాక్ నెగటివ్ అయినా, భారీ క్రాష్ మాత్రం రాలేదు.

ఇది బాలయ్య సినిమాలకు అరుదైన విషయం. సాధారణంగా మాస్ కంటెంట్ వర్క్ అవకపోతే వర్కింగ్ డేస్‌లో పూర్తిగా కూలిపోతుంది. కానీ ‘అఖండ 2’ ఏపీ, తెలంగాణలో నైట్ షోల దగ్గర కొంత హోల్డ్ చూపించింది.

అయితే ఇది పాజిటివ్ కంటే ఎక్కువగా ఒక వార్నింగ్ సైన్. ఎందుకంటే సినిమా నడుస్తోంది గానీ, ముందుకు వెళ్తోందని చెప్పలేం. ఇది లాంగ్ రన్ హిట్ లక్షణం కాదు, కేవలం ఓపెనింగ్ మార్కెట్ స్ట్రెంగ్త్ మాత్రమే.

సనాతన ధర్మం : థీమ్ గొప్పది… ట్రీట్మెంట్ తడబడింది

సినిమా బేసిక్‌గా సనాతన ధర్మం, ఆధ్యాత్మిక భావనల మీదే నిలబడింది.

ఇలాంటి థీమ్‌కి ఒక బలమైన న్యారేటివ్ అవసరం. కానీ ఇక్కడ అదే మిస్ అయ్యిందన్నదే పెద్ద విమర్శ. ఫస్ట్ పార్ట్‌లో ఎమోషన్, మిస్టిసిజం, మాస్ ఎలివేషన్స్ ఒక బ్యాలెన్స్‌లో వర్క్ అయితే, ఈసారి అవన్నీ ఫార్ములాగా అనిపించాయి.

ఫలితంగా ఫ్యాన్స్ తప్ప, మిగతా ఆడియన్స్‌కి ఇది కొత్త అనుభూతి ఇవ్వలేకపోయింది. అదే కారణంగా మౌత్ టాక్ బలహీనంగా మారింది.

Hindi Market Miscalculation: ఐడియా బాగుంది… టైమింగ్ తప్పింది

హిందీలో కి డబ్బింగ్ చేసి నేషన్ వైడ్ రిలీజ్ చేయడం ఒక రిస్క్‌తో కూడిన నిర్ణయం.

భక్తి – సనాతన ధర్మం అంశం నార్త్‌లో వర్క్ అవుతుందనే లాజిక్ ఉన్నా, అక్కడ బాలయ్య బ్రాండ్ ఇంకా స్ట్రాంగ్‌గా ఎస్టాబ్లిష్ కాలేదు. దానికి తోడు మిక్స్‌డ్ టాక్ రావడం, కంటెంట్ లోకల్ ఫ్లేవర్ ఎక్కువగా ఉండటం హిందీ వెర్షన్‌ను పూర్తిగా డౌన్ చేసింది.

మూడు రోజుల్లో 35 లక్షలు మాత్రమే రావడం ఈ ఎక్స్‌పెరిమెంట్ ఎంతగా ఫెయిల్ అయ్యిందో చెబుతోంది.

Overseas Trend: బ్రాండ్ పవర్ కి లిమిట్ ఎక్కడ?

నార్త్ అమెరికా కలెక్షన్స్ చూస్తే మరో విషయం అర్థమవుతుంది.

$790K వీకెండ్ గ్రాస్ అంటే బాలయ్యకి ఉన్న ఓవర్సీస్ మార్కెట్ ఒక స్థాయికి మించి వెళ్లడం లేదన్న సంకేతం. కంటెంట్ యూనివర్సల్‌గా కనెక్ట్ అయితే తప్ప, కేవలం బ్రాండ్ పవర్‌తో ఓవర్సీస్‌లో హోల్డ్ సాధ్యం కాదని ఈ సినిమా మరోసారి నిరూపించింది.

ఫైనల్ గా ..:

అఖండ 2 – ఫ్లాప్ కాదు… ఫ్రాంచైజ్ బ్రేక్ కూడా కాదు.

‘అఖండ 2’ని పూర్తిగా ఫ్లాప్ అని ముద్ర వేయడం తొందరపాటు.

అలాగే సక్సెస్ అని చెప్పడమూ కష్టమే.

ఇది ఒక టిపికల్ బాలయ్య ఓపెనింగ్ మూవీ, కానీ సస్టైన్ అయ్యే సినిమా కాదు.

ఫస్ట్ పార్ట్ లెవెల్ కల్ట్ స్టేటస్‌ను ఇది టచ్ చేయలేదు.

ఇప్పుడు అసలు పరీక్ష మొదలవుతుంది – వీక్‌డేస్‌లో ఈ హోల్డ్ కొనసాగుతుందా?

లేక ఇది కేవలం ఓపెనింగ్ ఫ్యాన్ షోకే పరిమితమైపోతుందా?

ఆ సమాధానం బాక్సాఫీస్ కన్నా బాలయ్య బ్రాండ్ భవిష్యత్తుకే కీలకం.

Tags:    

Similar News