'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' మూవీ ఓటిటి రివ్యూ!

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.;

Update: 2025-03-23 13:01 GMT

ఎవరు అవును అన్నా కాదన్నా, మలయాళంలో డిఫరెంట్ సినిమాలు వస్తున్నాయి. వాటిలో కొన్ని థియేటర్ లో సక్సెస్ అయ్యి, ఓటిటిలోనూ విజయవంతమవుతున్నాయి. తాజాగా జీతూ అష్రాఫ్ దర్శకత్వం వహించిన ఆఫీసర్ ఆన్ డ్యూటీ మాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. 12 కోట్లతో నిర్మించిన ఈ సినిమా అక్కడ 50 కోట్లకి పైగా వసూలు చేసింది. తెలుగులోను ఈ సినిమాను ఈ నెల 14న రిలీజ్ చేశారు. అయితే ప్రమోషన్స్ సరిగ్గా లేకపోవడం వలన పెద్దగా ఎవరికీ తెలియకుండానే థియేటర్ల నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

హరిశంకర్ (కుంచకో బోబన్) తన రూడ్ బిహేవియర్, ముక్కుసూటి తనం కారణంగా డిప్యూటీ ఎస్పీ నుంచి సీఐగా డీమోట్ అవుతాడు. సీఐగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఓ నకిలీ గోల్డ్ చైన్ కేసు తన వద్దకు వస్తుంది. బస్సు కండక్టర్ గా పనిచేసే చంద్రమోహన్ కూతురుకు సంబంధించిన గోల్డ్ చైన్ అది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ ను మొదలుపెట్టిన హరిశంకర్ కి , చంద్రమోహన్ కూతురుపై అనుమానం వచ్చి విచారిస్తే ఆ గొలుసు పోయిందని, దాంతో తండ్రి తిడతాడనే భయంతో తనే నకిలి చైన్ చేయించానంటుంది.

అయితే చైన్ వెనక చాలా పెద్ద విషయమైన ఉందని డీప్ గా ఇన్విస్టిగేషన్ మొదలెడతాడు హరి. ఈ క్రమంలో చైన్ ఆఫ్ ఈవెంట్స్ లాగ ఊహించని విధంగా ఓ పోలీస్ ఆఫీసర్ ఆత్మహత్య కేసు, తన పెద్ద కూతురు సూసైడ్ కేసు కనెక్ట్ అవుతాయి. అసలు ఆ బంగారు చైన్‌కి ఈ రెండు కేసులకి కనెక్షన్ ఏంటి? ఈ ఆత్మహత్యల వెనక ఉన్నది ఎవరు? ఈ బంగారు గొలుసును లాగితే కదలిన డొంక ఎలాంటిది? అనేది తెలియాలంటే ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ (Officer On Duty) చూడాల్సిందే.

విశ్లేషణ :

చెప్పగలిగే దమ్ము ఉంటే రోమియో జూలియో లాంటి లవ్ స్టోరీని కూడా సస్పెన్స్ తో చెప్పచ్చు. క్రైమ్ థ్రిల్లర్స్ సక్సెస్ అంతా ఏ స్దాయిలో కథలో సస్పెన్స్ ని పెంచుకుంటూ వెళ్లారనేదానిపైనే ఆధారపడి ఉంటుంది. ఆ విషయంలో ఈ సినిమా వందకు వంద శాతం సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. Tension, Relief! అనే టెక్నిక్ తో ఈ స్క్రీన్ ప్లే డిజైన్ చేసారు. కథా ప్రారంభమే ఓ పోలీస్ అధికారి హత్యను చూపెట్టి ఇంట్రస్ట్ కలగచేస్తారు.

ఓ గొప్ప థ్రిల్లర్ కు కావాల్సిన సెటప్, పే ఆఫ్ లు ఈ సినిమాలో కనపడతాయి. ముఖ్యంగాCause & Effect ని ఫెరఫెక్ట్ ఉపయోగిస్తూ కాంప్లిక్స్ ని రైజ్ చేసుకుంటూ పీక్స్ కి తీసుకెళ్లటం కలిసొచ్చింది. తీగ లాగితే డొంకంత కదిలినట్లు, ఓ చిన్న చైన్ విషయంతో మొదలైన కథ ఎక్కడెక్కడో వెళ్తుంది. అంతేకాదు ఆ డొంకలో తన జీవితం కూడా ఉందని చెప్పే సీన్స్ నిజంగా ఆశ్చర్యపరుస్తాయి.

టెక్నికల్ గా

టెక్నికల్ గా చిన్న సినిమా అయినా పెద్ద సినిమా స్దాయిలో సాంకేతిక విలువలు ఉన్నాయి. రెండు మూడు చోట్ల వచ్చే యాక్షన్ సీన్స్ కూడా ఫెరఫెక్ట్ గా డిజైన్ చేసారు. ఇక బీజీఎమ్ అయితే సినిమాని నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది. తెలుగులో డబ్ చేసిన పాటలు బాగోలేవు. సినిమాటోగ్రఫీ ఫెరఫెక్ట్. పోలీస్ ఆఫీసర్‌గా కుంచకోన్ బోబన్ మామూలుగా చేయలేదు. మొదటి నుంచి చివరిదాకా ఓ ఎమోషన్ తో సాగిపోయింది. అంకుశం నాటి రాజశేఖర్ గుర్తుకువస్తారు. విలన్స్ గా చేసిన వాళ్లు అయితే నిజంగా భయపెట్టారు. మంచి టాలెంట్ ఉన్న వాళ్లు.

చూడచ్చా

మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే మూవీ ఇది. మిస్ కావద్దు

ఎక్కడ చూడచ్చు

నెట్ ప్లిక్స్ లో తెలుగులో ఉంది

Tags:    

Similar News