ఓటీటీలో ఈ ఆస్కార్ విన్నింగ్ సినిమాని చూశారా?
2000 సంవత్సరం అక్టోబర్ 27న థియేట్రికల్ రిలీజ్ అయిన హాలీవుడ్ మూవీ మలేనా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.;
కొన్ని క్షణాలు జీవితాంతం మిగిలిపోతాయి…
కొన్ని సినిమాల్లో దృశ్యాలు మన హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోతాయి.
ఒక చిన్న పట్టణం…
ఒక అందమైన స్త్రీ…
ఆమె జ్ఞాపకాల్లో పెరిగే ఒక పిల్లాడు…
ఆమె ఒక సుందర స్వప్నం, అందరికీ తెలుసు – అందరికీ అందనిది. ఆమె నడక వెనుక మౌనంగా అనుసరించే కళ్ళు…
ఆమె నెమ్మదిగా తిరగబోయే తల వెనుక వేల ఆశల కథలు…
ఆమె పేరు మలేనా.
ఓ బాలుడి కళ్ళలో మొదలైన కథ…
ఓ సమాజపు చూపుల మధ్య తడిసిన సత్యం…
25 ఏళ్ల క్రితం థియేటర్లను కదిలించిన ఈ బోల్డ్ క్లాసిక్ ఇప్పుడు ఓటీటీ తెరపై మళ్లీ కనిపిస్తూ… సినీ ప్రేమికులను ఆశ్చర్యపరుస్తోంది. పేరు చెప్పగానే పాత జ్ఞాపకాల వాన కురిపించే సినిమా అదే — మలేనా.
2000 సంవత్సరం అక్టోబర్ 27న థియేట్రికల్ రిలీజ్ అయిన హాలీవుడ్ మూవీ మలేనా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ 2001 కాబోర్గ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గ్రాండ్ ప్రిక్స్ గెలుచుకుంది. 73వ అకాడమీ అవార్డ్స్‌లో, ఈ మూవీ ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ ఒరిజినల్ స్కోర్‌కి ఎంపికైంది.
హాలీవుడ్‌లో బాగా పాపులర్ అయిన ఇటాలియన్ నటి మోనికా బెల్లూచి మలేనా సినిమాలో టైటిల్ రోల్ పోషించింది. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ గా మారింది. ఎందుకంటే మలేనాలో మోనికా బెల్లూచి న్యూడ్ సీన్స్, శృంగార సన్నివేశాలలో నటించింది. దీంతో ఆమె పేరు మారుమోగిపోయింది.
ఎరోటిక్ రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన మలేనా సినిమాకు లూసియానా విన్సెంజోని కథ అందించారు. గియుసేప్ టొర్నాటోర్ స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించారు.
స్టోరీ లైన్
మెలీనా ఒక చిన్న సిటీ లో నివాసం ఉంటుంది. ఆమె ఆ ఊరిలో అందరికన్నా అందంగా ఉంటుంది. దాంతో , అందరి కళ్ళు ఆమె పైనే ఉంటాయి. ఆమె భర్త ఆర్మీలో పనిచేస్తుంటాడు. ఆమె తండ్రి ఒక స్కూల్ టీచర్ గా పని చేస్తుంటాడు. అక్కడే ఉండే రెనాటో అనే 14 ఏళ్ల కుర్రాడు ఆమెను అమితంగా ఇష్టపడుతుంటారు. ఎప్పుడూ ఆమెను చూస్తూ సమయం గడుపుతుంటాడు.
ఇంతలో ఒక్కసారిగా హీరోయిన్ జీవితం మారిపోతుంది. భర్త ఆర్మీలో చనిపోయాడు అనే విషయం తెలుస్తుంది. మరోవైపు తండ్రి కూడా ఒక బాంబు ప్రమాదంలో చనిపోతాడు. అప్పటి నుంచి ఆమెకు కష్టాలు మొదలవుతాయి. ఆమెకు తినడానికి కూడా కష్టమవుతుంది. ఆమెకు బ్రెడ్ ముక్కలు ఇచ్చి మరీ బలవంతం చేస్తారు అక్కడ ఉన్న ఊరి జనం. అలా ఇలా ఆ ఊరిలో ఆమె వేశ్యగా ముద్ర పడిపోతుంది.
చివరికి ఈమెపై కోర్టులో కేసు కూడా నమోదు అవుతుంది. లాయర్ కు డబ్బులు ఇవ్వడానికి కూడా తన దగ్గర ఉండవు. అయితే లాయర్ మాత్రం డబ్బులు కాకుండా ఆమెను లొంగ తీసుకుంటాడు. ఆ తర్వాత వ్యభిచారి అనే సాకుతో ఊరి నుంచి ఆమెను తరిమేస్తారు. ఇదంతా చూసి రొనాటో చాలా బాధపడతాడు.
చిన్న పిల్లాడు కావడంతో ఏమీ చేయలేక అలాగే ఉండిపోతాడు. ఇంతలో చనిపోయాడు అనుకున్న తన భర్త తిరిగి వస్తాడు. ఆమె ఎక్కడుందో తనకు తెలుసని రొనాటో అతనికి చెప్తాడు. ఆమెను తీసుకొని మళ్ళీ అదే సిటీ కి వస్తాడు ఆమె భర్త. చివరికి ఏమైంది ఏమిటనేది మిగతా కథ.
అప్పట్లో బాక్సాఫీస్ వద్ద మలేనా భారీ వసూళ్లను రాబట్టింది. దాదాపుగా రూ. 150 కోట్ల వరకు కలెక్షన్స్ కొల్లగొట్టింది ఈ మూవీ. అంతేకాకుండా 73వ అకాడమీ అవార్డ్స్‌లో ఈ రెండు ఆస్కార్ అవార్డ్స్ కూడా సాధించింది.
2001లో బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ సినిమాటోగ్రఫీ విభాగంలో మలేనా ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుంది.
ఎన్నో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్న మలేనా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో మలేనా ఓటీటీ రిలీజ్ అయింది. మీరు ఓ లుక్కేయండి.
ఈ సినిమా చూడడం అంటే… ఒక గంధర్వ సంగీతాన్ని వినడం కాదు–
ఓ మౌన గాథను వినడం… ప్రేమకు, వేదనకు అక్షరాలు పెట్టిన కథను గుర్తు చేసుకోవడం.
ఎక్కడ చూడచ్చు?
ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా 8 భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే నెట్ ప్లిక్స్, Apple TV లలో లభిస్తుంది. ఈ సినిమాకు ఐఎండీబీ లో 7.4 రేటింగ్ ఉంది.