గుల్షన్ దేవయ్య 'బ్యాడ్ కాప్' వెబ్ సిరీస్ రివ్యూ!

జర్మన్ సక్సెస్ ఫుల్ వెబ్ సీరిస్ Bad Cop - kriminell gut రీమేక్ రైట్స్ తీసుకుని హిందీలో బ్యాడ్ కాప్ పేరుతో ఓ సీరిస్ తీసి వదిలారు.

Update: 2024-06-29 03:14 GMT

సినిమాలే కాదు వెబ్ సీరిస్ లు కూడా రీమేక్ అవుతున్నాయి. అవును మరి కంటెంట్ అప్పటికప్పుడు కావాలంటే ఎలా దొరుకుతుంది. వేరే చోట హిట్టైనదాన్ని మన నేటివిటికి మార్చుకుంటే సరిపోతుంది. అయితే నేటివిటికి మార్చే క్రమంలో మరీ అతి చేస్తే అసలుకే ఎసరు వస్తుంది. జర్మన్ సక్సెస్ ఫుల్ వెబ్ సీరిస్ Bad Cop - kriminell gut రీమేక్ రైట్స్ తీసుకుని హిందీలో బ్యాడ్ కాప్ పేరుతో ఓ సీరిస్ తీసి వదిలారు. ఆ సీరిస్ ఎలా ఉంది. వర్కవుట్ అయ్యిందా, చూడదగ్గదేనా?

కథేంటి

ముంబైలో జరిగే ఈ కథలో ఇద్దరు ట్విన్స్. ఒకే పోలికలతో ఉండే వీళ్లలో ఒకరు అర్జున్ (గుల్షన్ దేవయ్య), మరొకరు కరణ్(గుల్షన్ దేవయ్య). ఈ ఇద్దరూ అనాధ శరణాలయంలో పెరుగుతూంటారు. ఈ లోగా కరణ్ ని ఓ కుటుంబం దత్తత తీసుకుంటుంది. అతను చక్కగా చదువుకుని పెద్ద పోలీస్ అధికారి అవుతాడు. ఇక అర్జున్ ఓ దొంగగా మారతాడు. ఇక కరణ్ లైఫ్ అంతా సెటిల్మెంట్ బాగుంటుంది. దేవిక (హర్లీన్ సేథీ)తో పెళ్లై ఓ పాప ఉంటుంది. ఆమె కూడా ఓ పోలీస్ అధికారే.

ఇక తను పోలీస్ అయినా దొంగ అయిన తన సోదరుడు అర్జున్ కు టచ్ లో ఉంటూంటాడు కరణ్. అది కరణ్ భార్యకు నచ్చదు. ఎందుకంటే దొంగ అయిన తన భర్త సోదరుడు ఎప్పటికైనా తమని సమస్యల్లో పడేస్తాడని ఆమె భయం. అనుకున్నట్లుగానే అర్జున్ ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. అవతల చనిపోయింది ఆనంద్ మిశ్రా అనే మీడియా వ్యక్తి. దాంతో మీడియా ఈ మర్డర్ ని వదిలేలా ఉండదు.

ఇక చనిపోయిన ఆనంద్ మిశ్రా స్నేహితుడు అయిన సీనియర్ పోలీస్ అధికారి (సౌరభ్ సచ్ దేవ్) ఈ కేసుని డీల్ ని చేయటం మొదలెడతాడు. ఇది తెలిసిన అర్జున్ తను దొరికిపోతానని తెలిసి తన సోదరుడు కరణ్ ని కలుస్తాడు. అదే సమయంలో ఊహించని విధంగా కరణ్ పై ఎటాక్ జరుగుతుంది. అతను చనిపోతాడు. అక్కడ నుంచి కథ మలపు తిరుగుతుంది. తన పోలీకలతో ఉన్న తన సోదరుడు చనిపోవటంతో తను కరణ్ ప్లేస్ లోకి వెళ్తాడు అర్జున్. అక్కడ నుంచి ఏమైంది. చివరకు అసలు నిజం బయిటపడిందా వంటి విషయాలు తెలియాలంటి సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే...

ఇద్దరు ఒకే పోలికలతో ఉన్న కవలలు కథలు మనం రాముడు- భీముడు కాలం నుంచి చూస్తున్నదే. అందులో ఒకరు విలన్ అయితే అనే కాన్సెప్టు కూడా వచ్చేసింది. దాంతో ఈ సీరిస్ మనకు కొత్తగా ఏమి అనిపించదు. జర్మనీ వాళ్లకు కొత్తగా అనిపించిందేమో కానీ మనకు పరమ రొటీన్ గా అనిపిస్తుంది. దానికి తోడు బాలీవుడ్ లో వచ్చిన తొంబైల నాటి స్క్రీన్ ప్లేతో ఈ స్క్రిప్టుని తీర్చిదిద్దారు. దాంతో చాలా వీక్ గా నడిచే సీన్స్ తో విసిగిస్తుంది. దానికి తోడు ఎందుకనో చాలా హర్రీ బర్రీగా ఈ సీరిస్ ని తీసినట్లు అనిపిస్తుంది. ఎక్కడా థ్రిల్లర్ యాంగిల్ కనపడదు. చాలా ప్రెడిక్టబుల్ గా సాగిపోతుంది. అయితే కథలో కొన్ని మెలికలు మంచివే ఉన్నాయి. అవే ఈ సీరిస్ ని చివరి దాకా చూసేలా చేస్తాయి. ఏదైమైనా బలమైన ఎమోషన్, స్ట్రాంగ్ కంటెంట్ మిస్సైందనే చెప్పాలి.

టెక్నికల్ గా ... ఈ సీరిస్ మంచి టెక్నీషియన్స్ పనిచేసారు. దర్శకుడు గతంలో సినిమాలు చేసిన అతనే కావటంతో ఆ జాగ్రత్తలు తీసుకున్నాడు. అలాగే గుల్షన్ దేవయ్య, అనురాగ్ కశ్యప్ ఈ సీరిస్ ని నిలబెట్టే ప్రయత్నంలో చాలా వరకూ సక్సెస్ అయ్యారు.

చూడచ్చా?

ఓ క్రైమ్ డ్రామా, అదీ కవలల చుట్టూ తిరగటం అనే టైప్ కథలు చూసి చాలా కాలం అయ్యిందనుకుంటే ఈ సీరిస్ మంచి ఆప్షనే.

ఎక్కడ చూడచ్చు:

ఈసీరిస్ హాట్ స్టార్ లో తెలుగులో ఉంది.

Tags:    

Similar News