అల్లు అర్జున్ 'పుష్ప 2: ది రూల్' రిలీజ్ ఎప్పుడంటే..

కలెక్షన్ల పంట పండించిన పుష్ప 1కు సీక్వెల్‌గా వస్తున్న పుష్ప 2 ఆలస్యంగా విడుదల కావడానికి మేకర్స్ చెబుతున్న కారణాలేంటి? ఇంతకు ఇప్పుడు రీలీజ్ చేస్తున్నారు?

Update: 2024-06-18 10:10 GMT

అల్లు అర్జున్ అభిమానులకు తీపి కబురు. ఆయన ఫ్యాన్స్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న చిత్రం "పుష్ప 2: ది రూల్" విడుదలకు సిద్ధమైంది. డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుందని మేకర్స్ ప్రకటించారు.

"పుష్ప 1: ది రైజ్" సీక్వెల్ "పుష్ప 2: ది రూల్". సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప 1 డిసెంబర్ 2021లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. పుష్ప 2కు కూడా ఆయనే దర్శకుడు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదల తేదీని సోమవారం సాయంత్రం ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు మేకర్స్. వాస్తవానికి ఆగస్టు 15న విడుదలకావాల్సి ఉంది.

సినిమా విడుదలను వాయిదా వేయడానికి కారణాన్ని వివరిస్తూ మేకర్స్ ఒక ప్రకటన విడుదల చేశారు.

"'పుష్ప 2: ది రూల్' భారతీయ చిత్రాలలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీస్‌లో ఒకటి. పుష్ప: ది రైజ్ ఘన విజయం సాధించింది. దాంతో సీక్వెల్ తీయాలనుకున్నాం. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ప్రతి ఫ్రేమ్‌లో పర్షెక్షన్ కోసం ప్రయత్నిస్తున్నాం. పోస్ట్-ప్రొడక్షన్ పనుల కారణంగా ఆగస్టు 15, 2024న చిత్రాన్ని విడుదల చేయడం సాధ్యం కాదు." అని మేకర్స్ పేర్కొన్నారు.

ఇప్పటివరకు పుష్ప 2 టీజర్‌తో పాటు రెండు పాటలు -- "పుష్ప పుష్ప", "సూసెకి" ని విడుదల చేశారు.వీటికి అనూహ్య స్పందన లభించిందని మేకర్స్ చెబుతున్నారు.

రష్మిక మందన్న కూడా నటించిన, "పుష్ప: ది రైజ్"లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శేషాచలం కొండలలో మాత్రమే దొరికే అరుదైన ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్‌ గురించి చిత్రీకరించారు.

Tags:    

Similar News