సియాల్ కోట్, లాహోర్ లపై ప్రతిదాడికి దిగిన భారత్

By :  491
Update: 2025-05-08 16:32 GMT
Live Updates - Page 5
2025-05-08 18:24 GMT

ఒకవైపు యుద్ధం జరుగుతుంటే మరోవైపు ఫేక్ వార్తలు విజృంభిస్తున్నాయి. ఇందులో భాగంగానే లాహోర్ మీద దాడి.. తర్వాత తాజా దృశ్యాలు అంటూ మూడు నెలల క్రితం ప్లేన్ క్రాష్ ఫొటోలను కొందరు షేర్ చేస్తున్నారు.



 


2025-05-08 18:21 GMT

బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఆదేశాన్ని దృష్టిలో ఉంచుకుని.. భారతదేశం అంతటా.‌.. ప్రయాణీకులు సజావుగా చెక్-ఇన్, బోర్డింగ్ ఉండేలా.. షెడ్యూల్ చేసిన బయలుదేరే సమయానికి కనీసం 3 గంటల ముందు వారి సంబంధిత విమానాశ్రయాలకు చేరుకోవాలి: ఎయిర్ ఇండియా

2025-05-08 18:20 GMT

ఇస్లామాబాద్ లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నివాసానికి అత్యంత సమీపంలో పేలుడు సంభవించినట్లు సమాచారం. 20 కి.మీ పరిధిలోనే ఘటన జరగడంతో వెంటనే షరీఫ్ను వ్యక్తిగత సిబ్బంది సురక్షిత బంకర్లోకి తరలించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది. ఈ రాత్రి గడిచేసరికి పాకిస్థాన్ను కోలుకోలేని దెబ్బ కొట్టేందుకు భారత్ సిద్ధమవుతున్నట్లు రక్షణ వర్గాలు చెబుతున్నాయి

2025-05-08 18:19 GMT

పాకిస్తాన్ లోని పలు నగరాల్లో పేలుడు.. రహస్య ప్రాంతాలకు వెళ్లిపోయిన సైనిక అధికారులు

2025-05-08 18:18 GMT

భారత్‌కు చిక్కిన పాకిస్థాన్ పైలట్ ఫొటో




 


2025-05-08 18:17 GMT

స్పైస్ జెట్ ట్రాఫిక్ మార్గదర్శకాలు

"అన్ని విమానాశ్రయాలలో మెరుగైన భద్రతా చర్యల దృష్ట్యా, ప్రయాణీకులు చెక్-ఇన్ మరియు బోర్డింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా నిష్క్రమణకు కనీసం 3 గంటల ముందు విమానాశ్రయానికి చేరుకోవాలని సూచించారు" అని ఎయిర్‌లైన్ ట్వీట్ చేసింది.

2025-05-08 18:14 GMT

పాకిస్థాన్‌లో బ్లాక్‌ఔట్

పీఓకే, లాహోర్, కరాచీ, సియాల్‌కోట్, ఇస్లామాబాద్‌లో మొత్తం షట్‌డౌన్ చేయాలంటూ పాకిస్థాన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

2025-05-08 18:13 GMT

సరిహద్దు పరిస్థితిని సమీక్షించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సరిహద్దు రక్షణ దళాల డైరెక్టర్ జనరల్‌తో మాట్లాడారు. విమానాశ్రయ భద్రత గురించి ఆయన CISF DGతో కూడా మాట్లాడారు.

2025-05-08 18:08 GMT

ఇండియా, పాకిస్థాన్ యుద్ధ నేపథ్యంలో పెరిగిన సైబర్ సెక్యూరిటీ ప్రమాదం. కీలక సూచనలు చేస్తున్న అధికారులు. ఎటువంటి వీడియో, మెసేజ్ లింక్‌లను ఓపెన్ చేయొద్దంటూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు.

2025-05-08 18:06 GMT

రంగంలోకి దిగిన భారత నౌకాదళం. పాకిస్తాన్‌పై ఇండియన్ నేవీ దాడి.

Tags:    

Similar News