శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు ఓటమి.. ధర్మానపై 50,593 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ విజయం
పెనుకొండలో టీడీపీ విజయం.. మంత్రి ఉష శ్రీ చరణ్ పై 34 వేల ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి సవితమ్మ గెలుపు
తెనాలిలో 50 వేల మెజారిటీతో జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ విజయం.
వైసీపీ నేతల వారసుల ఓటమి
ఏపీ ఎన్నికల్లో వైసీపీ నేతల వారసుల ఓటమి.. తిరుపతిలో భూమన కుమారుడు అభినయ్‌రెడ్డి, చంద్రగిరిలో చెవిరెడ్డి కుమారుడు మోహిత్‌రెడ్డి, బందర్‌లో పేర్నినాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి, జీడీ నెల్లూరులో నారాయణస్వామి కూతురు కృపాలక్ష్మి పరాజయం
హిందూపూర్ లో టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ 31,602 ఓట్ల మెజార్టీతో గెలుపు.
విజయంపై టిడిపి నేత సోమిరెడ్డి కామెంట్స్
ఆంధ్రలో కూటమి ఘన విజయం సాదించడంపై టీడీపీ నేత సోమిరెడ్డి స్పందించారు. ‘‘ఇది ప్రజల విజయం ప్రజలే టిడిపిని గెలిపించారు.. ప్రజలే ఎన్నికలు చేశారు. జగన్ పాలనలో జరిగిన అరాచకాలను ప్రజలు తట్టుకోలేకపోయారు. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అన్ని రంగాలను విస్మరించారు. టిడిపికి ఎప్పుడూ లేని విజయాన్ని ప్రజలు అందించారు. మాపై చాలా బాధ్యత ఉంది ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మంత్రి పదవి పై నేను ఆలోచించడం లేదు’’ అని వివరించారు.
20 ఏళ్లలో కొడాలి నాని తొలిసారి ఓటమి. వరుసగా నాలుగు సార్లు గెలిచి ఐదోసారి కొడాలి నాని ఓటమి.
వల్లభనేని వంశీపై టీడీపీ అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు విజయం. 36,524 ఓట్ల మెజార్టీతో గెలిచిన యార్లగడ్డ వెంకట్రావు.
ధర్మవరం బిజెపి అభ్యర్థి సత్య కుమార్ 3,800 మెజారిటీతో గెలుపు
12000 ఓట్ల భారీ మెజార్టీతో బండారు శ్రావణి శ్రీ ఘనవిజయం