చెత్త కుప్పల్లో బతుకును వెతుక్కుంటున్న హస్తిన భావి పౌరులు
యుద్ధ వీరుల స్మారక చిహ్నం ఇండియా గేట్ !;
ఇండియా గేట్ కు ఇరు వైపు లా ఎంత అందంగా నిర్మించా రో! విశాలమైన భవనాల్లో విశ్రాంతి తీసుకుంటున్న నేతలు. రేయింబ వళ్ళు కంటికి రెప్పలా కాపలా కాస్తున్న జవానులు. వీరుల ప్రాణ త్యాగాలకు చిహ్నంగా కర్తవ్య పథం. హస్తిన చెత్త కుప్పల్లో ఏపూటకాపూట అదృష్టాన్ని వెతుక్కుంటున్న భావి భారత పౌరులు.
ఢిల్లీ లో ఎపుడూ కిటకిటలాడే సరోజనీ మార్కెట్
నగర వీధులను చూస్తూ సాగుతున్నాం. ఇదే సరోజినీ మార్కెట్ అన్నాడు కిషన్. కొన్ని పెద్ద పెద్ద షాపులు ఇంకా తెరవలేదు. పదకొండు గంటలకు కానీ తెరవరట! లోపలికి వెళ్ళాం. రెడీమేడ్ దుస్తులు, కర్టెన్లు, బెల్టులు, చెప్పులు, బూట్ల నుంచి అనేక రకాల వస్తువులు. ఇక్కడ దొరకని వస్తువంటూ లేదు. సామాన్య మధ్యతరగతి వారికోసం ఏర్పడిన ఎంత పెద్ద మార్కెట్టో! మార్కెట్ చూట్టానికే ఒక రోజు సరిపోయేట్టు ఉంది. మనం ఏదైనా వస్తువును చూస్తే, కొనేంతవరకు వెంటపడతారు. కేవలం చూట్టానికే వచ్చాం తప్ప కొనడానికి రాలేదు.
రాష్ట్రపతి భవనం ముందు వా కా ప్రసాద్, హరీష్, పరమేశ్వర రావు, రాఘవ
అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరాం. ‘‘ఇప్పుడెక్కడి కెళ్ళాలి?’’ కిషన్ ప్రశ్న. ‘‘పార్లమెంటు, రాష్ట్రపతి భవన్ చూద్దాం. అటు నుంచి ఇండియా గేట్ కు వెళదాం’’ అన్నాం. సుందరమైన నగర వీధుల గుండా మా కారు సాగుతోంది. వెడల్పైన రోడ్లు. వాటి పక్కన పచ్చని చెట్లు. ఆ విశాలమైన రోడ్డు ఎన్ని గుండ్రటి సర్కిళ్ళను తిరిగిందో!
ఇండియా గేట్ కు ఇరువైపులా ఎంత అందంగా నిర్మించారో!
‘‘అదిగో ఇండియా గేట్’’ చూపించారు దూరం నుంచే వాకా ప్రసాద్. ఇండియా గేట్ ముందర రోడ్డులో ఎడమ వైపున మా కారు ఆగింది. కుడి వైపున రోడ్డుకు ఆవల దూరంగా ఇండియా గేట్ కనిపిస్తోంది. నేరుగా వెళ్ళడానికి వీలులేదు. ఎడమ వైపున విశాలంగా ఉన్న ఉద్యానవనం లోని అండర్ పాస్ ద్వారా కుడి వైపున నచుడుకుంటూ వెళుతున్నాం. ఆరోజు రంజాన్ సెలవు దినం కావడంతో చాలా మంది ముస్లింలు వచ్చారు. ఈ నిర్మాణం దగ్గర గౌరవ భావాన్ని ప్రకటిస్తున్నారు.
ఇండియా గేట్ లోంచి చూస్తే దూరంగా బోసు విగ్రహం