ఆంధ్ర పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్..
x

ఆంధ్ర పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సహా పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 పార్లమెంటు స్థానాలకు సోమవారం (మే 13) ఎన్నికలు జరుగనున్నాయి


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సహా పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 పార్లమెంటు స్థానాలకు సోమవారం (మే 13) ఎన్నికలు జరుగనున్నాయి. సార్వత్రిక ఎన్నికల నాలుగో విడతలో భాగంగా ఈ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ దశ పోలింగ్ తో మొత్తం 379 లోక్ సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగినట్టవుతుంది. పార్లమెంటు నాలుగో దశలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, బీహార్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలకు, ఒడిశాలోని 147 అసెంబ్లీ స్థానాలకు కూడా సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఒకే విడతలో ఎన్నికలు జరుగుతుండగా ఒడిశా అసెంబ్లీకి తొలి విడత ఎన్నికలు పూర్తి కానున్నాయి.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి హోరాహోరిగా ప్రచారం చేశాయి. గతానికి భిన్నంగా ఈసారి ఎన్నికల ప్రచారంలో తిట్లు, దీవెనలు, రాజకీయ నాయకుల కుటుంబాలలో చీలికలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. ప్రతిపక్షం అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూ జగన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే అధికార పక్షం సంక్షేమం పాట పాడింది. రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు నేడు ఒకేసారి పోలింగ్ జరుగుతోంది.

Live Updates

  • 13 May 2024 7:23 AM GMT

    కిషన్ రెడ్డి, కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలి: నారాయణ

    కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, కేటీఆర్‌పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని సీపీఐ నారాయణ కోరారు. బాధ్యతాయుత వ్యక్తులే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడం బాధాకరం అని అన్నారు.


  • 13 May 2024 7:17 AM GMT

    వైసీపీ, టీడీపీ మధ్య రాళ్ల దాడి


    అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసిపి, టిడిపి కార్యకర్తలు పరస్పరం రాళ్లదాడి చేసుకున్నారు. పట్టణంలోని ఓం శాంతి నగర్‌లో ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, టిడిపి అభ్యర్థి జెసి అస్మిత్ రెడ్డి లు పరస్పరం ఎదురుపడ్డారు. ఇరు వర్గాలు మధ్య మాటామాటా పెరగడంతో ఒక్కసారిగా ఉన్నట్లుండి రాళ్ళు రువ్వారు. రాళ్ల దాడిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి వాహనాలను ధ్వంసం చేశారు. ఎమ్మెల్యేకి సైతం దెబ్బలు తగినట్లు తెలుస్తోంది

  • 13 May 2024 7:13 AM GMT

    ఓటేసిన అచ్చెన్నాయుడు

    శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని నిమ్మడ గ్రామం జెడ్‌పీహెచ్ఎస్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో కుటుంబ సమేతంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఆయనతో పాటు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు.

  • 13 May 2024 7:05 AM GMT

    ఓటు హక్కు వినియోగించుకున్న పెద్దిరెడ్డి


    చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం ఎర్రాతి వారి పల్లెలో ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు రాజంపేట ఎంపీ పీవీ మిథున్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు


  • 13 May 2024 7:02 AM GMT

    మదనపల్లెలో వైసిపి, టీడీపీ నేతల ఘర్షణ


    మదనపల్లెలోని ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం ఆవరణలో వాతావరణం హీటెక్కింది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఇరు పార్టీలో పోలింగ్ సమయంలో కూడా జోరుగా ప్రచారం చేశాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రచారం చేయకూడదంటూ రెండు పార్టీల నేతలు ప్రత్యర్థి పార్టీ నేతలకు చెప్పడంతో మొదలైనా వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలకు సర్థిచెప్పారు.


  • 13 May 2024 6:55 AM GMT

    కడపజిల్లా పోలింగ్ శాతం 11:30 AM

    కడప. 21 %

    కమలాపురం 26 %

    మైదుకూరు 24 %

    ప్రొద్దుటూరు 25 %

    జమ్మలమడుగు 34 %

    పులివెందుల 31 %

    బద్వేలు. 30 %

  • 13 May 2024 6:50 AM GMT

    ఏపీలో ఉదయం 11 గంటల వరకు 24 శాతం పోలింగ్ నమోదు..

    అల్లూరి జిల్లా    18.61 శాతం

    అనకాపల్లి    19.75శాతం

    అనంతపురం    23.90శాతం

    అన్నమయ్య    22.28శాతం

    బాపట్ల    26.88శాతం

    చిత్తూరు    25.81శాతం

    అంబేద్కర్‌ కోనసీమ    26.74శాతం

    తూర్పు గోదావరి    21.75శాతం

    ఏలూరు    24.28శాతం

    గుంటూరు    20.84శాతం

    కాకినాడ    21.26శాతం

    కృష్ణా    25.84శాతం

    కర్నూలు    22.05శాతం

    నంద్యాల    27.19శాతం

    ఎన్టీఆర్ జిల్లా    21.39శాతం

    పల్నాడు    23.25శాతం

    పార్వతీపురం మన్యం    15.40శాతం

    ప్రకాశం    23.89శాతం

    నెల్లూరు    23.77శాతం

    శ్రీసత్యసాయి    20.61శాతం

    శ్రీకాకుళం    21.37శాతం

    తిరుపతి    22.66శాతం

    విశాఖ    20.47శాతం

    విజయనగరం    23.21శాతం

    ప.గో    23.26శాతం

    కడప     27.02శాతం

  • 13 May 2024 6:29 AM GMT

    రాష్ట్రవ్యాప్తం పోలింగ్ శాతం


    నేడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఉదయం 11.00 గంటలకు సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా సగటున పోలైన ఓటింగ్ శాతం 23.10%

  • 13 May 2024 6:28 AM GMT

    ఓటు వేసిన గల్లా జయదేవ్ కుటుంబం

    గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుంటూరులోని పట్టాభిపురం బేసిక్ హైస్కూలప్లో వారు ఓటు వేశారు. గల్లా సిద్దార్థ్ సినీ నటుడు అశోక్ గల్లా కూడా ఓటు వేశారు.

  • 13 May 2024 6:15 AM GMT

    పోలింగ్ శాతంపైనా బెట్టింగ్

    పోలింగ్ ఎక్కువ జరిగితే ఎవరికి లాభం అనే అంశంపైనా బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని 73 నియోజకవర్గాల్లో ఎంత శాతం పోలింగ్ నమోదవుతుంది అనే దానిపై లక్షల్లో పందాలు కాస్తున్నారు. ఈ 73 నియోజకవర్గాల్లో అత్యధిక భాగం రాయలసీమ జిల్లాల్లో ఉన్నాయి.

Read More
Next Story