ఆంధ్ర పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్..
x

ఆంధ్ర పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సహా పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 పార్లమెంటు స్థానాలకు సోమవారం (మే 13) ఎన్నికలు జరుగనున్నాయి


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సహా పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 పార్లమెంటు స్థానాలకు సోమవారం (మే 13) ఎన్నికలు జరుగనున్నాయి. సార్వత్రిక ఎన్నికల నాలుగో విడతలో భాగంగా ఈ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ దశ పోలింగ్ తో మొత్తం 379 లోక్ సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగినట్టవుతుంది. పార్లమెంటు నాలుగో దశలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, బీహార్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలకు, ఒడిశాలోని 147 అసెంబ్లీ స్థానాలకు కూడా సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఒకే విడతలో ఎన్నికలు జరుగుతుండగా ఒడిశా అసెంబ్లీకి తొలి విడత ఎన్నికలు పూర్తి కానున్నాయి.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి హోరాహోరిగా ప్రచారం చేశాయి. గతానికి భిన్నంగా ఈసారి ఎన్నికల ప్రచారంలో తిట్లు, దీవెనలు, రాజకీయ నాయకుల కుటుంబాలలో చీలికలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. ప్రతిపక్షం అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూ జగన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే అధికార పక్షం సంక్షేమం పాట పాడింది. రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు నేడు ఒకేసారి పోలింగ్ జరుగుతోంది.

Live Updates

  • 13 May 2024 8:22 AM GMT

    అన్నమయ్య జిల్లాలో మధ్యాహ్నం 1 గంట వరకు 39.77 శాతం నమోదైన పోలింగ్

    రాజంపేట - 40 శాతం

    కోడూరు (ఎస్.సి) - 41.31 శాతం

    రాయచోటి - 40.19 శాతం

    తంబళ్లపల్లి - 40.47 శాతం

    పీలేరు - 43.07 శాతం

    మదనపల్లి - 33.6 శాతం

  • 13 May 2024 8:18 AM GMT

    ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 1గంట వరకు నమోదైన ఓటింగ్ శాతం 40.26%

    అమలాపురం - 44.03%

    అనకాపల్లి - 36.33%

    అనంతపూర్ - 39.61%

    అరకు - 33.86%

    బాపట్ల - 44.65%

    చిత్తూరు - 44.65%

    ఏలూరు - 38.76%

    గుంటూరు - 40.12%

    హిందూపూర్- 38.65%

    కడప - 45.56%

    కాకినాడ - 38.25%

    కర్నూలు - 37.61%

    మచిలీపట్నం -44.50 %

    నంద్యాల - 43.45%

    నరసాపురం - 39.53%

    నరసరావుపేట - 40.53%

    నెల్లూరు -42.40 %

    ఒంగోలు- 42.37%

    రాజమండ్రి - 38.54%

    రాజంపేట- 40.22%

    శ్రీకాకుళం - 40.52%

    తిరుపతి - 38.51%

    విజయవాడ - 39.69%

    విశాఖపట్నం - 34.74%

    విజయనగరం -40.80 %

  • 13 May 2024 8:16 AM GMT

    తెలుగులో ట్వీట్ చేసిన మోదీ

    భారత ప్రధాని తెలుగులో ట్వీట్ చేశారు. 4 వ విడత పోలింగ్ జారుతున్న నేపథ్యంలో ఓటర్లకు ట్విట్టర్ వేదికగా సందేశమిచ్చారు.  

  • 13 May 2024 8:14 AM GMT

    ఉమ్మడి విజయనగరం జిల్లాలో మధ్యాహ్నం 1గంట వరకు నమోదైన పోలింత్ శాతం


    చీపురుపల్లి నియోజకవర్గం 46.11శాతం నమోదు

    బొబ్బిలి నియోజకవర్గం 43.12 శాతం నమోదు

    గజపతినగరం నియోజకవర్గం 44.91 శాతం నమోదు

    విజయనగరం నియోజకవర్గం 40.81 శాతం నమోదు

    నెల్లిమర్ల నియోజకవర్గం 38.44 శాతం నమోదు

    శృంగవరపుకోట నియోజకవర్గం 41.52 శాతం నమోదు

  • 13 May 2024 8:13 AM GMT

    పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో మధ్యాహ్నం 1గంట వరకు 45.12 శాతం పోలింగ్ నమోదు

    అసెంబ్లీ నియోజకవర్గల వారీగా పోలింగ్ శాతం


    చెన్నూరు నియోజకవర్గం: 45.45 శాతం

    బెల్లంపల్లి నియోజకవర్గం: 50.42 శాతం

    మంచిర్యాల నియోజకవర్గం: 41.40 శాతం

  • 13 May 2024 8:09 AM GMT

    తెనాలి ఎమ్మెల్యే తీరును ఖండిస్తున్నాం: పెమ్మసాని

    తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్.. ఓ ఓటరుపై చెయి చేసుకోవడం, ఆ ఓటరు తిరిగి ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించిన ఘటనపై టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ పెమ్మసాని స్పందించారు. ఎమ్మెల్యే చర్యను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ‘‘ఒక ఓటరు కేవలం క్యూలో రమ్మని కోరినందుకు తెనాలి ఎమ్మెల్యే దుర్మార్గంగా ఆ ఓటరుపై దాడి చేశారు. ఆయన చర్యలు అమానుషం, రాజ్యాంగ వ్యతిరేకం. సదరు ఎమ్మెల్యేపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలి’’అని పెమ్మసాని కోరారు.


  • 13 May 2024 8:05 AM GMT

    పరిటాల శ్రీరామ్‌ను అడ్డుకున్న గ్రామస్తులు

    సత్యాసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పెద్ద కొండాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోకి రాకుండా పరిటాల శ్రీరామ్‌ను గ్రామస్తులు అడ్డుకున్నారు. నీకు ఈ గ్రామంలో ఓటు హక్కు లేదు. అలాంటప్పుడు ఎందుకు పోలింగ్ కేంద్రంలోకి వస్తున్నావంటూ నిలదీశారు. గ్రామస్తులు గొడవకు దిగడంతో పరిటాల శ్రీరామ్ వెనుదిరిగాడు.

  • 13 May 2024 8:01 AM GMT

    ఐపీఎస్, మాజీ ఐపీఎస్‌లపై ఈసీకి ఫిర్యాదు


    ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, మాజీ ఐపీఎస్‌ ఆర్పీ ఠాకూర్‌పై వైసీపీ.. ఈసీకి ఫిర్యాదు చేసింది. వారు టీడీపీకి అనుకూలంగా పనిచేసేలా ఎన్నికల సిబ్బందిని ప్రభావితం చేస్తున్నారని, మంగళగిరి టీడీపీ ఆఫీస్‌ వేదికగా అధికారులను బెదిరిస్తున్నారని, టీడీపీ ఆఫీస్‌లో కూర్చొని జిల్లాల పోలీసు అధికారులకు ఫోన్లు చేస్తున్నారని, టీడీపీకి అనుకూలంగా వ్యవహరించాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని వైసీపీ తన ఫిర్యాదులో పేర్కొంది.

  • 13 May 2024 7:59 AM GMT

    ఆంధ్రలో పోలింగ్ శాతం


    ఏపీలో ఇప్పటి వరకు 36 శాతం పోలింగ్ నమోదు.. 36.84 శాతం మేర ఓటేసిన మహిళలు.. 35.03 శాతం మేర ఓటేసిన పురుషులు.. ఇప్పటి వరకు ఓటేసిన కోటిన్నర మంది ఓటర్లు.

  • 13 May 2024 7:38 AM GMT

    బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం

    నాచారం డివిజన్లోని భవాని నగర్‌లో బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. బీజేపీ ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్‌వి‌ఎస్‌ఎస్ ప్రభాకర్ పార్టీ కండువాతో పోలింగ్ బూత్ వద్ద బైఠాయించి తమ పార్టీ అభ్యర్థికే ఓటు వేయాలని ఓటర్లను కోరడం ప్రచారం కొనసాగిస్తున్నారు. అది గమనిచిన స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆయన చర్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయమై ఇరు పార్టీల నేతలపై వాగ్వాదం జరిగింది. పోలీసుల జోక్యంతో వాగ్వాదం పెద్దది కాకుండా సర్దుమణిగింది. అనంతరం మాజీ ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Read More
Next Story