ఆంధ్ర పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్..
x

ఆంధ్ర పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సహా పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 పార్లమెంటు స్థానాలకు సోమవారం (మే 13) ఎన్నికలు జరుగనున్నాయి


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సహా పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 పార్లమెంటు స్థానాలకు సోమవారం (మే 13) ఎన్నికలు జరుగనున్నాయి. సార్వత్రిక ఎన్నికల నాలుగో విడతలో భాగంగా ఈ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ దశ పోలింగ్ తో మొత్తం 379 లోక్ సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగినట్టవుతుంది. పార్లమెంటు నాలుగో దశలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, బీహార్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలకు, ఒడిశాలోని 147 అసెంబ్లీ స్థానాలకు కూడా సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఒకే విడతలో ఎన్నికలు జరుగుతుండగా ఒడిశా అసెంబ్లీకి తొలి విడత ఎన్నికలు పూర్తి కానున్నాయి.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి హోరాహోరిగా ప్రచారం చేశాయి. గతానికి భిన్నంగా ఈసారి ఎన్నికల ప్రచారంలో తిట్లు, దీవెనలు, రాజకీయ నాయకుల కుటుంబాలలో చీలికలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. ప్రతిపక్షం అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూ జగన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే అధికార పక్షం సంక్షేమం పాట పాడింది. రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు నేడు ఒకేసారి పోలింగ్ జరుగుతోంది.

Live Updates

  • 13 May 2024 3:38 PM IST

    బలవంతంగా వైసీపీకి ఓటు వేయించిన అధికారి

    భీమవరంలోని పోలింగ్ కేంద్రంలో అమానుష చర్య బయటపడింది. ఓటు వేయడానికి వెళ్లిన ఓటరు చేత సదరు అధికారి బలవంతంగా వైసీపీకి ఓటు వేయించారు. అదేంటని ప్రశ్నిస్తే అక్కడే ఉన్న వైసీపీ కార్యకర్తలను తనను కొట్టారని సదరు ఓటరు వాపోతున్నారు. దీనిపై జనసేన పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వానికి కొమ్ముకాసే ఇటువంటి అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఈసీని కోరుతోంది.

  • 13 May 2024 3:33 PM IST

    టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య కొట్లాట

    బాపట్ల జిల్లా చీరాల మండలం గవినివారి పాలెంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తీవ్ర కొట్లాట జరిగింది. చీరాల నియోజకవర్గానికి కూటమి తరపున పోటీ చేస్తున్న ఎం కొండయ్య.. గవినివారిపాలెంట్ పోలింగ్ కేంద్రాలను సందర్శించానికి వెళ్లారు. ఆ సమయంలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షన జరిగింది. కర్రలతో కొట్టుకున్నారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.

  • 13 May 2024 3:24 PM IST

    పోలింగ్ కేంద్రాలను సందర్శించిన దానం నాగేందర్

    సికింద్రాబాద్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్.. బోరబండలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజలు కూడా ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన ప్రజలను కోరారు.

  • 13 May 2024 2:27 PM IST

    చిత్తూరు జిల్లా పరిధిలో మధ్యాహ్నం 1 గంట వరకు 44.50 శాతం పోలింగ్ నమోదు

    చిత్తూరు అసెంబ్లీ 48.26

    కుప్పం 43.29

    పూతలపట్టు 35.92

    పలమనేరు 46.21

    గంగాధర నెల్లూరు 51.17

    నగరి 43.12

    పుంగనూరు 43.90

    చిత్తూరు పార్లమెంటు పరిధిలో 44.65 శాతం పోలింగ్ నమోదయింది

    చంద్రగిరి 44.83

  • 13 May 2024 2:26 PM IST

    సూళ్లూరుపేటలో లాటిఛార్జ్

    నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట అసెంబ్లీ స్థానం పరిధిలోని నాయుడుపేట మండలం అన్నమేడు గ్రామంలో టిడిపి, వైఎస్ఆర్సిపి మద్దతుసారులు పరస్పరం దాడులు చేసుకున్నారు. పరిస్థితి అదుపు తప్పుతోందని గ్రహించిన ఎస్సై గోపీనాథ్ వారిపై లాఠీ ఛార్జ్ చేశారు. ఇదే సమయంలో వృద్ధ మహిళ అని కూడా చూడకుండా ఇంటి బయట కూర్చుని వున్న జులేఖాభి (70) పై కూడా లాఠీ తో కొట్టడంతో, ఆమె తలకు బలమైన గాయమైంది. వృద్ధురాలిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వృద్ధురాలనే కనికరం లేకుండా ఎస్సై ప్రవర్తించిన తీరుతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • 13 May 2024 2:25 PM IST

    ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు

    ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే గోర్త కిరణ్‌కు చేదు అనుభవం ఎదురైంది. పోలింగ్ కేంద్రాల పరిశీలనకు వెళ్లిన ఆయనను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఏ ముఖం పెట్టుకుని గ్రామానికి వస్తావని మహిళలు నిలదీశారు. దీంతో అక్కడి నుంచి ఆయన వెనుదిరిగి వెళ్లిపోయారు.

  • 13 May 2024 2:22 PM IST

    పోలీసులకే కరువైన రక్షణ

    ఆంధ్రలో పోలింగ్ సమయంలో పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయింది. ఏకంగా ఎస్‌పీ వాహనంపైనే గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల వర్షం కురిపించారు. పోలీసుల సిబ్బందిపై కూడా రాళ్లు విసిరిన ఘటన తాడిపత్రిలో చోటు చేసుకుంది.

  • 13 May 2024 1:58 PM IST

    తిరుపతి జిల్లాలో మధ్యాహ్నం 1గంట వరకు నమోదైన పోలింత్ శాతం

    తిరుపతి(ఎస్‌సీ) 38.51%

    గూడూరు(ఎస్‌సీ) 35.66%

    సుళ్లూరుపేట(ఎస్‌సీ) 41.12%

    వెంకటగిరి 41.14%

    చంద్రగిరి 44.83%

    తిరుపతి 30.34%

    శ్రీకాళహస్తి 46.85%

    సత్యవేడు(ఎస్‌సీ) 33.75%

    వీటితో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 39.14శాతం పోలింగ్ నమోదయింది.

  • 13 May 2024 1:55 PM IST

    విశాఖలో మధ్యాహ్నం 1 గంట వరకు నమోదైన పోలింగ్ శాతం

    ఎస్.కోట    37.42%

    భీమిలి    32.61%

    విశాఖ తూర్పు    37.51%

    విశాఖ దక్షిణ    31.11%

    విశాఖ ఉత్తర    30.00%

    విశాఖ పశ్చిమ    36.40%

    గాజువాక    38.02%

  • 13 May 2024 1:53 PM IST

    కర్నూలు జిల్లాలో మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ శాతం

    కర్నూలు పార్లమెంట్ (పాణ్యం నియోజకవర్గం మినహాయించి) 37.61 శాతం

    8 అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపి 38 శాతం

    కర్నూలు : 36.09 శాతం

    పాణ్యం : 40.05 శాతం

    పత్తికొండ : 36.41 శాతం

    కోడుమూరు : 34.92 శాతం

    ఎమ్మిగనూరు : 33.05 శాతం

    మంత్రాలయం : 42.63 శాతం

    ఆదోని : 36.04 శాతం

    ఆలూరు : 44.73 శాతం

Read More
Next Story