
కొయ్యలగూడెం టైగర్
కొయ్యలగూడెంలో గాండ్రించిన పెద్దపులి
పశువులపై దాడి.. భయాందోళనలో గ్రామస్థులు
అడవుల నుంచి బయటికొచ్చిన వన్యమృగాలు జనాన్ని హడలెత్తిస్తున్నాయి. తాజాగా ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం పెద్దపులి బెంబేలెత్తించింది. కొన్ని రోజులుగా పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గ్రామాల వైపు మళ్లిన పులి, పశువుల మందలపై వరుస దాడులకు తెగబడటంతో రైతులు, కూలీలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
వరుస దాడులు
దిప్పకాయలపాడు రెవెన్యూ గ్రామ పరిధిలోని కన్నాపురం పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. ఈ క్రమంలో పులి చేసిన దాడుల వివరాలు ఇలా ఉన్నాయి.
బిల్లిమిల్లి: ఇక్కడ కాకర్ల వివేకానందకు చెందిన గేదెపై పులి దాడి చేసి చంపేసింది.
దిప్పకాయలపాడు: రైతు కామినేని ఆనందబాబుకు చెందిన ఆయిల్ పామ్ తోటలో కట్టివేసి ఉన్న రెండు ఆవులపై పులి విరుచుకుపడింది. ఈ దాడుల్లో పశువులు మృత్యువాత పడటంతో రైతులకు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లింది.
అప్రమత్తమైన అటవీశాఖ
పశువుల మరణ వార్తలతో అటవీశాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. ఘటనా స్థలాలను పరిశీలించి, అక్కడ లభ్యమైన పాదముద్రలను బట్టి అది పెద్దపులేనని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం అటవీశాఖ సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కన్నాపురం, దిప్పకాయలపాడు, బిల్లిమిల్లి పరిసర అటవీ ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ప్రజలకు హెచ్చరికలు
పులి సంచారం నేపథ్యంలో అధికారులు ప్రజలకు పలు సూచనలు జారీ చేశారు:
రాత్రి సమయాల్లో పొలాలకు, తోటలకు ఒంటరిగా వెళ్లకూడదు.
Also Read: ’ముసలితనం‘లోకి ఆంధ్రప్రదేశ్..2031 నాటికి ఏపీ ’వృద్ధాప్య‘ రాష్ట్రం
శువుల పాకల వద్ద వెలుతురు (లైట్లు) ఉండేలా చూసుకోవాలి.
పులి జాడ కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలి.
ప్రస్తుతం ఆయిల్ పామ్ తోటల్లో పని చేసే కూలీలు పనికి వెళ్లాలంటేనే వణికిపోతున్నా
Next Story

