
నేడే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్..
తుఫాను వచ్చే ముందు ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్నికల ఫలితాల తుఫానును చవిచూడటానికి ముందులా అత్యంత నిశ్శబ్దంగా ఉంది.
తుఫాను వచ్చే ముందు ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్నికల ఫలితాల తుఫానును చవిచూడటానికి ముందులా అత్యంత నిశ్శబ్దంగా ఉంది. అధికార, ప్రతిపక్ష వర్గాలు సైతం సైలెంట్ అయిపోయాయి. అందరి చూపు ఎన్నికల ఫలితాలపైనే ఉన్నాయి. ఈ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టి మరీ పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ కూడా ఆంధ్ర ఎన్నికలపై ఒక అంచనాను వేయలేకపోయాయి. ఈ ఎగ్జిట్ పోల్స్‌లో కూడా వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లే ఉంది. దీంతో ఆంధ్ర ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారింది. కానీ ప్రజల తీర్పు మాత్రం ఈసారి ఆంధ్రప్రదేశ్‌ను తుఫానులా కాదు సునామీలా ఊపుఊపేయనుందని విశ్లేషకులు చెప్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. రాష్ట్రంలో వచ్చేది తమ ప్రభుత్వమే అని రెండు వర్గాలు పునరుద్ఘాటిస్తున్నాయి. తమ నేత జూన్ 9న ప్రమాణ స్వీకారం చేస్తారని, ఆ ప్రమాణస్వీకార వేడుకలో వడ్డించే ఆహార మెనూ ఇదేనంటూ ఇరు పక్షాలు ప్రకటనలు కూడా చేస్తున్న క్రమంలో అసలు ఆంధ్రలో గెలుపెవరిది అనేది సస్పెన్స్ థ్రిల్లర్‌గా మరింది. ఈ సస్పెన్స్‌కు ఈరోజు ఫలితాలు ప్రకటించి ఈసీ తెర దించనుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి పార్టీ వర్గాలు కూడా వళ్లు దగ్గర పెట్టుకుని మసలుకోవాలని, అటూఇటూ తేడాగా ఏమైనా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది.
Live Updates
- 4 Jun 2024 12:43 PM IST
ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో మూడవ రౌండ్ ముగిసిన సమయానికి వైఎస్ఆర్సిపి అభ్యర్థి దూరం నాగేశ్వరరావుకు 11,281 ఓట్లు రాగా బిజెపి అభ్యర్థి కామినేని శ్రీనివాస్ కు 17,314 ఓట్లు రాగా వైఎస్ఆర్సిపి అభ్యర్థి పై టీడీపీ అభ్యర్థి 6,033 ఓట్లు ముందంజలో ఉన్నారు.
- 4 Jun 2024 12:42 PM IST
జనసేన అభ్యర్ది మండలి బుద్దప్రసాద్ అవనిగడ్డ నియోజకవర్గం పూర్తైన 11రౌండ్స్ 24, 892 ఓట్లు మెజారిటీ. పామర్రు టిడిపి అభ్యర్థి వర్లకుమార్ రాజా ఆరు రౌండ్స్ కు 9,277 ఒట్లు మెజారిటీ.
- 4 Jun 2024 12:42 PM IST
గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గానికి ఆరు రౌండ్ లు పూర్తి అయ్యేసరికి టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము 19829 ఓట్ల మెజార్టీ
- 4 Jun 2024 12:42 PM IST
కృష్ణా-గన్నవరం
ఎనిమిదో రౌండు పూర్తయ్యేసరికి తెదేపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు 20,986 ఓట్ల ఆధిక్యం
- 4 Jun 2024 12:41 PM IST
సత్తెనపల్లి నియోజకవర్గం 8 రౌండ్లు పూర్తి అయ్యేసరికి కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ 16417 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు
- 4 Jun 2024 12:41 PM IST
మాచర్ల టిడిపి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి 11వ రౌండ్ 19242 ఓట్ల మెజారిటీతో అధిక్యం..
- 4 Jun 2024 12:41 PM IST
పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎనిమిది రౌండ్ లు పూర్తి అయ్యేసరికి టిడిపి అభ్యర్థి బోడె ప్రసాద్ 26785 ఓట్ల మెజార్టీ తో కొనసాగుతున్నారు
- 4 Jun 2024 12:34 PM IST
పిఠాపురంపై జనసేన జెండా!
53వేల ఓట్ల ఆధిక్యంతో దూసుకెళ్తున్న పవన్ కల్యాణ్. పిఠాపురం పీఠాన్ని దాదాపు ఖరారయినట్లు చెప్తూ జనసేన వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి.
- 4 Jun 2024 12:31 PM IST
రేపల్లెలో టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ 7 రౌండ్లు పూర్తి అయ్యేసరికి 19915 ఓట్లతో ముందంజ
- 4 Jun 2024 12:31 PM IST
తెనాలిలో కుమ్మేస్తున్న కూటమి
కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్..59463
వైసిపి అభ్యర్థి శివకుమార్..34068
టిడిపి ఆదిక్యం..25395