
నేడే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్..
తుఫాను వచ్చే ముందు ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్నికల ఫలితాల తుఫానును చవిచూడటానికి ముందులా అత్యంత నిశ్శబ్దంగా ఉంది.
తుఫాను వచ్చే ముందు ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్నికల ఫలితాల తుఫానును చవిచూడటానికి ముందులా అత్యంత నిశ్శబ్దంగా ఉంది. అధికార, ప్రతిపక్ష వర్గాలు సైతం సైలెంట్ అయిపోయాయి. అందరి చూపు ఎన్నికల ఫలితాలపైనే ఉన్నాయి. ఈ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టి మరీ పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ కూడా ఆంధ్ర ఎన్నికలపై ఒక అంచనాను వేయలేకపోయాయి. ఈ ఎగ్జిట్ పోల్స్‌లో కూడా వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లే ఉంది. దీంతో ఆంధ్ర ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారింది. కానీ ప్రజల తీర్పు మాత్రం ఈసారి ఆంధ్రప్రదేశ్‌ను తుఫానులా కాదు సునామీలా ఊపుఊపేయనుందని విశ్లేషకులు చెప్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. రాష్ట్రంలో వచ్చేది తమ ప్రభుత్వమే అని రెండు వర్గాలు పునరుద్ఘాటిస్తున్నాయి. తమ నేత జూన్ 9న ప్రమాణ స్వీకారం చేస్తారని, ఆ ప్రమాణస్వీకార వేడుకలో వడ్డించే ఆహార మెనూ ఇదేనంటూ ఇరు పక్షాలు ప్రకటనలు కూడా చేస్తున్న క్రమంలో అసలు ఆంధ్రలో గెలుపెవరిది అనేది సస్పెన్స్ థ్రిల్లర్‌గా మరింది. ఈ సస్పెన్స్‌కు ఈరోజు ఫలితాలు ప్రకటించి ఈసీ తెర దించనుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి పార్టీ వర్గాలు కూడా వళ్లు దగ్గర పెట్టుకుని మసలుకోవాలని, అటూఇటూ తేడాగా ఏమైనా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది.
Live Updates
- 4 Jun 2024 1:28 PM IST
14 వ రౌండ్ పూర్తి అయ్యేసరికి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి 13791 మెజారిటీ తో ముందంజలో ఉన్నారు
- 4 Jun 2024 1:25 PM IST
చిత్తూరు జిల్లా ఫలితాలు ఇలా..
పలమనేరు 10 రౌండ్ 10309
తంబళ్లపల్లె 6 రౌండ్ 2279
తిరుపతి 3 రౌండ్ 8767
సత్యవేడు 6 రౌండ్ 249
పూతలపట్టు 11 2రౌండ్ 9443
పుంగనూరు(వైకాపా) 14 రౌండ్ 6156
నగరి 6 రౌండ్ 19491
కుప్పం 8 రౌండ్ 15357
చిత్తూరు 12 రౌండ్ 11987
- 4 Jun 2024 1:25 PM IST
తిరుపతి నాలుగో రౌండ్ అసెంబ్లీ ఫలితాలు
వైసిపి అభినయ రెడ్డి
11746
జనసేన ఆరని శ్రీనివాసులు
22232
జనసేన లీడ్
10486
- 4 Jun 2024 1:24 PM IST
కేతిరెడ్డి ముందంజ
ధర్మవరం 13వ రౌండ్ పూర్తయ్యేసరికి 5979 ఓట్లతో ముందంజలో ఉన్న కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
- 4 Jun 2024 1:22 PM IST
నా అంచనా తప్పయింది: వేణుస్వామి
మరోసారి తాను ప్రెడిక్షన్స్ చెప్పనని వేణుస్వామి చెప్పారు. ‘‘ఎన్నికల ఫలితాల గురించి నేను ఇచ్చిన ప్రెడిక్షన్‌లో మోదీ ప్రాభల్యం తగ్గుందని చెప్పాను. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌మోహన్ రెడ్డి గెలుస్తారని చెప్పాను. నేను నా విద్యను అనుసరించి ఈ ప్రెడిక్షన్స్ చెప్పడం జరిగింది. వీటిలో మోదీ ప్రాభల్యం తగ్గి ఒకటి జరిగింది. రెండోది తప్పింది. సాధారణంగా జాతకాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే నేను ప్రెడిక్షన్ చేప్పడం జరుగుతుంది. అప్పటి నుంచి నన్ను విమర్శిస్తున్న వారు నన్నే లక్ష్యంగా చేశారు. నా ప్రెడిక్షన్ తప్పయిందని నేను ఒప్పుకుంటున్నాను’’ అని వివరించారు.
వేణుస్వామి రియలైజేషన్....ఈరోజు వీడియో....👇 pic.twitter.com/QEgl1nPmOl
— Radhika (Leo)🦁 (@sweety_00099) June 4, 2024 - 4 Jun 2024 1:14 PM IST
మరికాసేపట్లో కాకినాడ రాబోతున్న పవన్ కళ్యాణ్ ఎస్పీ ఆఫీస్ పెరేడ్ గ్రౌండ్ లో హెలిపేడ్ పర్మిషన్ తీసుకున్న పవన్ కళ్యాణ్
- 4 Jun 2024 1:13 PM IST
ఏలూరు జిల్లా ఇదీ పరిస్థితి
ఏలూరు అసెంబ్లీకి 9 రౌండ్లు పూర్తయ్యేసరికి వైసిపి అభ్యర్థి నానికి 31315 ఓట్లు పోలవ్వగా, టిడిపి అభ్యర్థి చంటి కి 57261 ఓట్లు పోలయ్యాయి.
ఉంగుటూరు అసెంబ్లీకి రౌండ్లు పూర్తయ్యేసరికి వైసిపి అభ్యర్థి వాసు బాబుకి 31887 ఓట్లు పోలవ్వగా, జనసేన అభ్యర్థి ధర్మరాజుకు కి 46822 ఓట్లు పోలయ్యాయి.
కైకలూరు అసెంబ్లీకి 3 రౌండ్లు పూర్తయ్యేసరికి వైసిపి అభ్యర్థి నాగేశ్వరరావుకు 9957 ఓట్లు పోలవ్వగా, బిజెపి అభ్యర్థి కామినేని కి 17314 ఓట్లు పోలయ్యాయి.
నూజివీడు అసెంబ్లీకి 9 రౌండ్లు పూర్తయ్యేసరికి వైసిపి అభ్యర్థి అప్పారావుకు 46443 ఓట్లు పోలవ్వగా, టిడిపి అభ్యర్థి పార్థసారథి కి 43540 ఓట్లు పోలయ్యాయి.
చింతలపూడి అసెంబ్లీకి 15 రౌండ్లు పూర్తయ్యేసరికి వైసిపి అభ్యర్థి విజయరాజుకు 68400 ఓట్లు పోలవ్వగా, టిడిపి అభ్యర్థి రోషన్ కి 92444 ఓట్లు పోలయ్యాయి.
పోలవరం అసెంబ్లీకి 8 రౌండ్లు పూర్తయ్యేసరికి వైసిపి అభ్యర్థి రాజ్యలక్ష్మి కి 41054 ఓట్లు పోలవ్వగా, జనసేన అభ్యర్థి బాలరాజుకు 42354 ఓట్లు పోలయ్యాయి.
దెందులూరు అసెంబ్లీకి 6 రౌండ్లు పూర్తయ్యేసరికి వైసిపి అభ్యర్థి అబ్బాయి చౌదరికి 29165 ఓట్లు పోలవ్వగా, టిడిపి అభ్యర్థి చింతమనేనికి 36057 ఓట్లు పోలయ్యాయి
- 4 Jun 2024 1:11 PM IST
రాజీనామాకు జగన్ సిద్ధం
కాసేపట్లో రాజ్‌భన్‌కు చేరుకోనున్న సీఎం వైఎస్ జగన్. గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు మరికాసేపట్లో తన రాజీనామానాకు అందించనున్నట్లు సమాచారం.
- 4 Jun 2024 12:53 PM IST
పిఠాపురంలో పవన్ ప్రభంజనం
పిఠాపురంలో పవన్ ప్రభంజనం నడుస్తోంది. కౌంటింగ్ ప్రారంభం నుంచి ఆధిక్యంతో దూసుకెళ్తున్న పవన్ కల్యాణ్.. తొమ్మిదో రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యేసరికి 61వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.