నేడే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్..
x

నేడే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్..

తుఫాను వచ్చే ముందు ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ కూడా ఎన్నికల ఫలితాల తుఫానును చవిచూడటానికి ముందులా అత్యంత నిశ్శబ్దంగా ఉంది.


తుఫాను వచ్చే ముందు ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ కూడా ఎన్నికల ఫలితాల తుఫానును చవిచూడటానికి ముందులా అత్యంత నిశ్శబ్దంగా ఉంది. అధికార, ప్రతిపక్ష వర్గాలు సైతం సైలెంట్ అయిపోయాయి. అందరి చూపు ఎన్నికల ఫలితాలపైనే ఉన్నాయి. ఈ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టి మరీ పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ కూడా ఆంధ్ర ఎన్నికలపై ఒక అంచనాను వేయలేకపోయాయి. ఈ ఎగ్జిట్ పోల్స్‌లో కూడా వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లే ఉంది. దీంతో ఆంధ్ర ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారింది. కానీ ప్రజల తీర్పు మాత్రం ఈసారి ఆంధ్రప్రదేశ్‌ను తుఫానులా కాదు సునామీలా ఊపుఊపేయనుందని విశ్లేషకులు చెప్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. రాష్ట్రంలో వచ్చేది తమ ప్రభుత్వమే అని రెండు వర్గాలు పునరుద్ఘాటిస్తున్నాయి. తమ నేత జూన్ 9న ప్రమాణ స్వీకారం చేస్తారని, ఆ ప్రమాణస్వీకార వేడుకలో వడ్డించే ఆహార మెనూ ఇదేనంటూ ఇరు పక్షాలు ప్రకటనలు కూడా చేస్తున్న క్రమంలో అసలు ఆంధ్రలో గెలుపెవరిది అనేది సస్పెన్స్ థ్రిల్లర్‌గా మరింది. ఈ సస్పెన్స్‌కు ఈరోజు ఫలితాలు ప్రకటించి ఈసీ తెర దించనుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి పార్టీ వర్గాలు కూడా వళ్లు దగ్గర పెట్టుకుని మసలుకోవాలని, అటూఇటూ తేడాగా ఏమైనా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది.

Live Updates

  • 4 Jun 2024 10:15 AM GMT

    RRR ఘన విజయం

    పశ్చిమగోదావరి జిల్లా ..ఉండి నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు 18వ రౌండ్ పూర్తయ్యేసరికి 56,777 ఓట్లతో గెలుపు.

  • 4 Jun 2024 10:09 AM GMT

    హాఫ్ సెంచరీ దాటిన టీడీపీ


    ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ దూసుకెళ్తోంది.

    ప్రస్తుతం 51 స్థానాల్లో విజయం సాధించింది.

    ఇంకా 86 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

  • 4 Jun 2024 10:05 AM GMT

    పిఠాపురంలో పవన్ గెలుపు

    పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి జనసేన అభ్యర్థి పవన్ కల్యాణ్ 70,354 ఓట్ల మెజార్టీతో గెలుపు.

  • నారా వారి ఇంట్లో సంబరాలు
    4 Jun 2024 10:05 AM GMT

    నారా వారి ఇంట్లో సంబరాలు

    చంద్రబాబు ఇంట విజయోత్సవ సంబరాలు భారీగా జరుగుతున్నాయి. కేక్ కటింగ్‌లు చేసుకుని లోకేష్, చంద్రబాబు, భువనేశ్వరి, బ్రహ్మణి అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

  • 4 Jun 2024 10:01 AM GMT

    వైసీపీ ఖాతా తెరవని జిల్లాలు ఇవే

    ఎనిడిమిది జిల్లాల్లో ఇప్పటికీ ఖాతా తెరవని వైసీపీ. కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, నేల్లూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లో వైసీపీకి తమ గెలుపు కనుచూపుమేరలో కనిపించడం లేదు.

  • 4 Jun 2024 8:43 AM GMT

    హిందూపురంలో 9వ రౌండ్ కౌంటింగ్‌ పూర్తి.. టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణకు 18,678 ఓట్ల ఆధిక్యం.. హిందూపురం నుంచి విజయవాడ బయల్దేరిన నందమూరి బాలకృష్ణ

  • 4 Jun 2024 8:42 AM GMT

    135 స్థానాల్లో టీడీపీ, 20 స్థానాల్లో జనసేన, 13 స్థానాల్లో వైసీపీ, 7 స్థానాల్లో బీజేపీ ముందంజ

  • 4 Jun 2024 8:42 AM GMT

    పిఠాపురంలో భారీ ఆధిక్యం దిశగా పవన్‌ కల్యాణ్‌.. 14వ రౌండ్ ముగిసే వరకు 63,234 ఓట్ల ఆధిక్యంలో పవన్

  • 4 Jun 2024 8:39 AM GMT

    ఓటమి దిశగా 20 మంది మంత్రులు

    వెనకబడ్డ మంత్రులు ధర్మాన, సిదిరి అప్పలరాజు, రాజన్నదొర, బొత్స, అమర్నాథ్, ముత్యాలనాయుడు, దాడిశెట్టి రాజా, విశ్వరూప్‌, చెల్లుబోయిన వేణు, కొట్టు సత్యనారాయణ, కారుమూరి, తానేటి వనిత, జోగి రమేష్, అంబటి రాంబాబు, విడదల రజినీ, ఆదిమూలపు సురేష్‌, మేరుగ నాగార్జున, రోజా, అంజాద్‌ బాషా, బుగ్గన, ఉషశ్రీ చరణ్‌

  • 4 Jun 2024 8:39 AM GMT

    కడప జిల్లా...

    ఓటమిని అంగీకరించి కౌంటింగ్ హాల్ నుండి వెన్నుతిరిగిన కమలాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి రఘురాం రెడ్డి, కడప ఎమ్మెల్యే అభ్యర్థి అంజాద్ బాష.

    మొదటి నుంచి టిడిపి ప్రతి రౌండ్‌లో ఆధిక్యత కనబరుస్తూ వచ్చిన టిడిపి అభ్యర్థులు..

    ఏ రౌండ్‌లోను ఆధిక్యత కనబరచకపోవడంతో కౌంటింగ్ హాల్ నుండి వెళ్లిపోయిన వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థులు..

Read More
Next Story