
నేడే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్..
తుఫాను వచ్చే ముందు ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్నికల ఫలితాల తుఫానును చవిచూడటానికి ముందులా అత్యంత నిశ్శబ్దంగా ఉంది.
తుఫాను వచ్చే ముందు ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్నికల ఫలితాల తుఫానును చవిచూడటానికి ముందులా అత్యంత నిశ్శబ్దంగా ఉంది. అధికార, ప్రతిపక్ష వర్గాలు సైతం సైలెంట్ అయిపోయాయి. అందరి చూపు ఎన్నికల ఫలితాలపైనే ఉన్నాయి. ఈ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టి మరీ పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ కూడా ఆంధ్ర ఎన్నికలపై ఒక అంచనాను వేయలేకపోయాయి. ఈ ఎగ్జిట్ పోల్స్‌లో కూడా వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లే ఉంది. దీంతో ఆంధ్ర ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారింది. కానీ ప్రజల తీర్పు మాత్రం ఈసారి ఆంధ్రప్రదేశ్‌ను తుఫానులా కాదు సునామీలా ఊపుఊపేయనుందని విశ్లేషకులు చెప్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. రాష్ట్రంలో వచ్చేది తమ ప్రభుత్వమే అని రెండు వర్గాలు పునరుద్ఘాటిస్తున్నాయి. తమ నేత జూన్ 9న ప్రమాణ స్వీకారం చేస్తారని, ఆ ప్రమాణస్వీకార వేడుకలో వడ్డించే ఆహార మెనూ ఇదేనంటూ ఇరు పక్షాలు ప్రకటనలు కూడా చేస్తున్న క్రమంలో అసలు ఆంధ్రలో గెలుపెవరిది అనేది సస్పెన్స్ థ్రిల్లర్‌గా మరింది. ఈ సస్పెన్స్‌కు ఈరోజు ఫలితాలు ప్రకటించి ఈసీ తెర దించనుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి పార్టీ వర్గాలు కూడా వళ్లు దగ్గర పెట్టుకుని మసలుకోవాలని, అటూఇటూ తేడాగా ఏమైనా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది.
Live Updates
- 4 Jun 2024 3:54 PM IST
శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు ఓటమి.. ధర్మానపై 50,593 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ విజయం
- 4 Jun 2024 3:54 PM IST
పెనుకొండలో టీడీపీ విజయం.. మంత్రి ఉష శ్రీ చరణ్ పై 34 వేల ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి సవితమ్మ గెలుపు
- 4 Jun 2024 3:53 PM IST
వైసీపీ నేతల వారసుల ఓటమి
ఏపీ ఎన్నికల్లో వైసీపీ నేతల వారసుల ఓటమి.. తిరుపతిలో భూమన కుమారుడు అభినయ్‌రెడ్డి, చంద్రగిరిలో చెవిరెడ్డి కుమారుడు మోహిత్‌రెడ్డి, బందర్‌లో పేర్నినాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి, జీడీ నెల్లూరులో నారాయణస్వామి కూతురు కృపాలక్ష్మి పరాజయం
- 4 Jun 2024 3:51 PM IST
విజయంపై టిడిపి నేత సోమిరెడ్డి కామెంట్స్
ఆంధ్రలో కూటమి ఘన విజయం సాదించడంపై టీడీపీ నేత సోమిరెడ్డి స్పందించారు. ‘‘ఇది ప్రజల విజయం ప్రజలే టిడిపిని గెలిపించారు.. ప్రజలే ఎన్నికలు చేశారు. జగన్ పాలనలో జరిగిన అరాచకాలను ప్రజలు తట్టుకోలేకపోయారు. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అన్ని రంగాలను విస్మరించారు. టిడిపికి ఎప్పుడూ లేని విజయాన్ని ప్రజలు అందించారు. మాపై చాలా బాధ్యత ఉంది ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మంత్రి పదవి పై నేను ఆలోచించడం లేదు’’ అని వివరించారు.
- 4 Jun 2024 3:49 PM IST
20 ఏళ్లలో కొడాలి నాని తొలిసారి ఓటమి. వరుసగా నాలుగు సార్లు గెలిచి ఐదోసారి కొడాలి నాని ఓటమి.
- 4 Jun 2024 3:49 PM IST
వల్లభనేని వంశీపై టీడీపీ అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు విజయం. 36,524 ఓట్ల మెజార్టీతో గెలిచిన యార్లగడ్డ వెంకట్రావు.