నేడే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్..
తుఫాను వచ్చే ముందు ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్నికల ఫలితాల తుఫానును చవిచూడటానికి ముందులా అత్యంత నిశ్శబ్దంగా ఉంది.
తుఫాను వచ్చే ముందు ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్నికల ఫలితాల తుఫానును చవిచూడటానికి ముందులా అత్యంత నిశ్శబ్దంగా ఉంది. అధికార, ప్రతిపక్ష వర్గాలు సైతం సైలెంట్ అయిపోయాయి. అందరి చూపు ఎన్నికల ఫలితాలపైనే ఉన్నాయి. ఈ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టి మరీ పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ కూడా ఆంధ్ర ఎన్నికలపై ఒక అంచనాను వేయలేకపోయాయి. ఈ ఎగ్జిట్ పోల్స్‌లో కూడా వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లే ఉంది. దీంతో ఆంధ్ర ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారింది. కానీ ప్రజల తీర్పు మాత్రం ఈసారి ఆంధ్రప్రదేశ్‌ను తుఫానులా కాదు సునామీలా ఊపుఊపేయనుందని విశ్లేషకులు చెప్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. రాష్ట్రంలో వచ్చేది తమ ప్రభుత్వమే అని రెండు వర్గాలు పునరుద్ఘాటిస్తున్నాయి. తమ నేత జూన్ 9న ప్రమాణ స్వీకారం చేస్తారని, ఆ ప్రమాణస్వీకార వేడుకలో వడ్డించే ఆహార మెనూ ఇదేనంటూ ఇరు పక్షాలు ప్రకటనలు కూడా చేస్తున్న క్రమంలో అసలు ఆంధ్రలో గెలుపెవరిది అనేది సస్పెన్స్ థ్రిల్లర్‌గా మరింది. ఈ సస్పెన్స్‌కు ఈరోజు ఫలితాలు ప్రకటించి ఈసీ తెర దించనుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి పార్టీ వర్గాలు కూడా వళ్లు దగ్గర పెట్టుకుని మసలుకోవాలని, అటూఇటూ తేడాగా ఏమైనా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది.
Live Updates
- 4 Jun 2024 4:34 PM IST
కూటమి గెలుపుపై అంబటి ఏమన్నారంటే..
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. పలు జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసింది. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చిత్తు చేసింది. తాజాగా కూటమి గెలుపుపై అంబటి రాయుడు స్పందించారు. ఈరోజు ఆంధ్రప్రజలు విజయం సాధించారు. ‘‘టీడీపీ కూటమి సాధించిన విజయం ప్రజలది. జనసేన, బీజేపీ, టీడీపీలకు అభినందనలు. రాష్ట్రాన్ని అభివృద్ధి, సామరస్య మార్గంలో నడిచేలా చంద్రబాబు, పవన్ కల్యాణ్.. రాష్ట్రాన్ని ఏకం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు మంచిరోజులు వస్తున్నాయి. నారాలోకేష్ చేపట్టిన యువగళం యాత్ర కూటమి గెలుపులో కీలక పాత్ర పోషించింది’’ అని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
- 4 Jun 2024 4:08 PM IST
ఘన విజయం సాధించిన అదితి గజపతిరాజు
విజయనగరం నియోజకవర్గంలో ఘన విజయం సాధించిన అదితి గజపతిరాజు
మొదటిసారిగా 50 వేలుకు పైగా మెజార్టీ
రికార్డు సృష్టించిన అదితి.. 57669 ఓట్ల మెజార్టీ
ఘోర ఓటమిని మూటగట్టుకున్న డిప్యూటీ స్పీకర్ కోలగట్ల
పోస్టల్ బాలెట్ ఓట్ల లెక్కింపు తేలాల్సి ఉంది
- 4 Jun 2024 4:07 PM IST
బొత్సకు ఘోర పరాజయం
విజయనగరం జిల్లా చీపురపల్లి నియోజకవర్గంలో వైసీపీ మంత్రి, అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఘోర పరాజయాన్ని చవి చూశారు. ఆయన ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి కళా వెంకట్రావు ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో కళా వెంకట్రావు అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు.
- 4 Jun 2024 4:05 PM IST
జగన్ ఘన విజయం
పులివెందులలో సీఎం జగన్ ఘన విజయం. 61,169 ఓట్ల మెజార్టీతో గెలిచిన జగన్.
- 4 Jun 2024 4:00 PM IST
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో స్వీప్ దిశగా టీడీపీ
ఆత్మకూరు, సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరిలో హోరాహోరీ పోటీలో విజయ ఢంకా మోగించిన టిడిపి అభ్యర్థులు....
నెల్లూరు పార్లమెంట్ స్థానాన్ని భారీ మెజారిటీతో కైవసం చేసుకోబోతున్న తెలుగుదేశం....
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎంపి సీటుతోపాటూ 10 అసెంబ్లీ స్థానాలను తన ఖాతాకీ రెడీ అయిన తెలుగుదేశం పార్టీ...
- 4 Jun 2024 3:57 PM IST
హ్యాట్రిక్ కొట్టి చిన రాజప్ప
పెద్దాపురంలో హ్యాట్రిక్ విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చిన రాజప్ప.
- 4 Jun 2024 3:57 PM IST
జనసేనకు పర్మినెంట్ సింబల్‌గా గాజు గ్లాసు
పోటీ చేసిన 2 లోక్ సభ స్థానాల్లోనూ గెలుపు దిశగా జేఎస్పీ. జనసేనకు శాశ్వత గుర్తుగా మారనున్న గాజు గ్లాస్. ఏపీ అసెంబ్లీలో రెండో పెద్ద పార్టీగా అవతరించిన జనసేన.
- 4 Jun 2024 3:56 PM IST
విశాఖ ఎంపీగా టీడీపీ అభ్యర్థి విజయం
టీడీపీ అభ్యర్థి శ్రీభరత్ విజయం. 2.84 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచిన శ్రీభరత్.
- 4 Jun 2024 3:55 PM IST
డోన్‌లో మంత్రి బుగ్గన ఓటమి
డోన్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ గెలుపు.. మంత్రి బుగ్గనపై 6,450 ఓట్ల మెజార్టీతో కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి గెలుపు
- 4 Jun 2024 3:54 PM IST
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో టీడీపీ విజయం.. స్పీకర్ తమ్మినేని సీతారాంపై 33,285 ఓట్ల మెజార్టితో టీడీపీ నేత కూన రవికుమార్ గెలుపు