నేడే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్..
తుఫాను వచ్చే ముందు ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్నికల ఫలితాల తుఫానును చవిచూడటానికి ముందులా అత్యంత నిశ్శబ్దంగా ఉంది.
తుఫాను వచ్చే ముందు ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్నికల ఫలితాల తుఫానును చవిచూడటానికి ముందులా అత్యంత నిశ్శబ్దంగా ఉంది. అధికార, ప్రతిపక్ష వర్గాలు సైతం సైలెంట్ అయిపోయాయి. అందరి చూపు ఎన్నికల ఫలితాలపైనే ఉన్నాయి. ఈ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టి మరీ పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ కూడా ఆంధ్ర ఎన్నికలపై ఒక అంచనాను వేయలేకపోయాయి. ఈ ఎగ్జిట్ పోల్స్‌లో కూడా వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లే ఉంది. దీంతో ఆంధ్ర ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారింది. కానీ ప్రజల తీర్పు మాత్రం ఈసారి ఆంధ్రప్రదేశ్‌ను తుఫానులా కాదు సునామీలా ఊపుఊపేయనుందని విశ్లేషకులు చెప్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. రాష్ట్రంలో వచ్చేది తమ ప్రభుత్వమే అని రెండు వర్గాలు పునరుద్ఘాటిస్తున్నాయి. తమ నేత జూన్ 9న ప్రమాణ స్వీకారం చేస్తారని, ఆ ప్రమాణస్వీకార వేడుకలో వడ్డించే ఆహార మెనూ ఇదేనంటూ ఇరు పక్షాలు ప్రకటనలు కూడా చేస్తున్న క్రమంలో అసలు ఆంధ్రలో గెలుపెవరిది అనేది సస్పెన్స్ థ్రిల్లర్‌గా మరింది. ఈ సస్పెన్స్‌కు ఈరోజు ఫలితాలు ప్రకటించి ఈసీ తెర దించనుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి పార్టీ వర్గాలు కూడా వళ్లు దగ్గర పెట్టుకుని మసలుకోవాలని, అటూఇటూ తేడాగా ఏమైనా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది.
Live Updates
- 4 Jun 2024 5:10 PM IST
కమలాపురంలో టీడీపీ అభ్యర్థి ఘన విజయం. 24,972 ఓట్ల మెజార్టీతో గెలిచిన చైతన్య రెడ్డి.
- 4 Jun 2024 5:09 PM IST
బీజేపీ అభ్యర్థి ఘన విజయం. 17,181 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి దేవగుడి ఆదినారాయణ గెలుపు.
- 4 Jun 2024 4:47 PM IST
పవన్ గెలుపుపై బన్నీ రియాక్షన్ ఇదే
ఆంధ్ర ఎన్నికల నడుప మెగా, అల్లూరి కుటుంబాల మధ్య వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో విజయం సాధించడంపై బన్నీ స్పందించారు. పవన్ కల్యాణ్‌ను అభినందనలు తెలిపారు. ప్రజాసేవ దిశగా మీరు చేపట్టిన సరికొత్త ప్రయాణం సజావుగా సాగాలని కోరుకుంటూ.. అని ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు.
Heartiest congratulations to @PawanKalyan garu on this tremendous victory . Your hardwork, dedication and commitment to serve the people for years has always been heart touching . Best wishes for your new journey to serve the people .
— Allu Arjun (@alluarjun) June 4, 2024 - 4 Jun 2024 4:43 PM IST
సింగనమల టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి గెలుపు. 8,159 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులుపై టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి గెలుపు.
- 4 Jun 2024 4:42 PM IST
పవన్‌పై చిరంజీవి ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ఘన విజయం సాధించింది. పిఠాపురంలో జనసేనాని పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో గెలవడంపై చిరంజీవి స్పందించారు. చంద్రబాబు, పవన్‌కు ప్రశంసిస్తూ ఎక్స్(ట్వీట్) చేశారు.
డియర్ కళ్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది. నువ్వు Game Changer వి మాత్రమే కాదు, Man of the match వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం…
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 4, 2024ప్రియమైన చంద్రబాబు నాయుడు గారికి , చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్న మీకు ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు.👏👏 💐💐 ఈ మహత్తర విజయం, మీ మీద ప్రజలకు వున్న నమ్మకానికి, మీ నాయకత్వ పటిమకు, రాష్ట్రానికి గత వైభవం తిరిగి తేగలిగిన మీ దక్షతకు నిదర్శనం. రాజకీయ దురంధరులైన మీ మీద, పవన్…
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 4, 2024 - 4 Jun 2024 4:39 PM IST
శ్రీశైలం టీడీపీ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి విజయం. 5,972 ఓట్ల మెజార్టీతో రాజశేఖర్ రెడ్డి గెలుపు.
- 4 Jun 2024 4:38 PM IST
పాలకొండ నియోజకవర్గం నిమ్మక జై కృష్ణ సమీప ప్రత్యర్థి కళావతి పై 22,500 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు డిప్లరేషన్ ఫామ్ కి స్వగ్రామం నుంచి పార్వతిపురం మన్యం జిల్లా ఉల్లి భద్ర కౌంటింగ్ కేంద్రం వద్దకు భారీ వాహన శ్రేణులు బయలుదేరారు
- 4 Jun 2024 4:37 PM IST
జగన్ మించిన లోకేష్
మంగళగిరి లో పదిహేను రౌండ్లు ముగిసే సరికి 70,077 ఓట్లతో నారా లోకేష్ ముందంజలో ఉన్నారు. పులివెందులలో జగన్ కేవలం 61,169 మెజార్టితో గెలుపు సాధించారు.
- 4 Jun 2024 4:35 PM IST
7000 మెజారిటీతో రాయచోటిలో 20 సంవత్సరాల తర్వాత టిడిపి జెండా పాతిన రాంప్రసాద్ రెడ్డి.
రాయచోటిలో సంబరాలు చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు.
రాయచోటి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థికి స్వాగతం పలికేందుకు హారతులతో సిద్ధమైన మహిళలు.