
నేడే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్..
తుఫాను వచ్చే ముందు ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్నికల ఫలితాల తుఫానును చవిచూడటానికి ముందులా అత్యంత నిశ్శబ్దంగా ఉంది.
తుఫాను వచ్చే ముందు ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్నికల ఫలితాల తుఫానును చవిచూడటానికి ముందులా అత్యంత నిశ్శబ్దంగా ఉంది. అధికార, ప్రతిపక్ష వర్గాలు సైతం సైలెంట్ అయిపోయాయి. అందరి చూపు ఎన్నికల ఫలితాలపైనే ఉన్నాయి. ఈ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టి మరీ పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ కూడా ఆంధ్ర ఎన్నికలపై ఒక అంచనాను వేయలేకపోయాయి. ఈ ఎగ్జిట్ పోల్స్‌లో కూడా వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లే ఉంది. దీంతో ఆంధ్ర ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారింది. కానీ ప్రజల తీర్పు మాత్రం ఈసారి ఆంధ్రప్రదేశ్‌ను తుఫానులా కాదు సునామీలా ఊపుఊపేయనుందని విశ్లేషకులు చెప్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. రాష్ట్రంలో వచ్చేది తమ ప్రభుత్వమే అని రెండు వర్గాలు పునరుద్ఘాటిస్తున్నాయి. తమ నేత జూన్ 9న ప్రమాణ స్వీకారం చేస్తారని, ఆ ప్రమాణస్వీకార వేడుకలో వడ్డించే ఆహార మెనూ ఇదేనంటూ ఇరు పక్షాలు ప్రకటనలు కూడా చేస్తున్న క్రమంలో అసలు ఆంధ్రలో గెలుపెవరిది అనేది సస్పెన్స్ థ్రిల్లర్‌గా మరింది. ఈ సస్పెన్స్‌కు ఈరోజు ఫలితాలు ప్రకటించి ఈసీ తెర దించనుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి పార్టీ వర్గాలు కూడా వళ్లు దగ్గర పెట్టుకుని మసలుకోవాలని, అటూఇటూ తేడాగా ఏమైనా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది.
Live Updates
- 4 Jun 2024 10:28 AM IST
రాజంపేటలో వైసీపీ ఎంపీ అభ్యర్థి మిథున్‌రెడ్డి ఆధిక్యం.. బీజేపీ అభ్యర్థి కిరణ్‌కుమార్ రెడ్డిపై 3 వేల ఓటha ఆధిక్యంలో మిథన్‌రెడ్డి
- 4 Jun 2024 10:24 AM IST
పవన్‌కు 60 వేల మెజార్టీ అవకాశం
నాలుగు రౌండ్లు మూసేసరికి పవన్ కళ్యాణ్ కు సుమారు 20 వేల ఆధిక్యం
మొత్తం 18రౌండ్లకు గాను 4రౌండ్లు పూర్తి..ఇంకా జరగాల్సిన 14 రౌండ్ల కౌంటింగ్
పవన్ కళ్యాణ్ కు అన్ని రౌండ్ల లోనూ ఆధిక్యం.1వ రౌండ్.4196. 2వ రౌండ్...3811, 3వ రౌండ్..5497, 4వ రౌండ్ 5640 ఆధిక్యం..
దాదాపుగా 14రౌండ్ల లోనూ ఇదే రీతిలో కొనసాగితే 60 వేలకు పైగా మెజార్టీ వచ్చే అవకాశం
- 4 Jun 2024 10:20 AM IST
ఓటమి దిశగా మంత్రులు
పెద్దిరెడ్డి,
విడదల రజిని,
అంబటి రాంబాబు,
బొత్స సత్యనారాయణ,
ఉషశ్రీ చరణ్,
పినిపె విశ్వరూప్,
ధర్మాన ప్రసాద్ తో పాటు ఇంకో ఇద్దరు వెనుకంజ!
- 4 Jun 2024 10:17 AM IST
కౌంటింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగిన వైసీపీ ఎమ్మెల్యేలు
కౌంటింగ్ కేంద్రం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ వెనుతిరిగారు. ఆయనతో పాటు మాజీ మంత్రి కొడాలినాని.
- 4 Jun 2024 10:15 AM IST
దంచి కొడుతున్న జనసేన
ఆంధ్ర ఎన్నికల్లో జనసేన దూసుకుపోతోంది. పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లోనూ ఆధిక్యంలో దూసుకెళ్తోంది.
- 4 Jun 2024 10:14 AM IST
మూడు ఎంపీ స్థానాలకే వైసీపీ పరిమితం
కడప, రాజంపేట అరకు, ఒంగోలు స్థానాల్లో వైఎస్ఆర్సిపి పార్లమెంటు అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. మిగతా 21 పార్లమెంటు స్థానాల్లో టిడిపి కూటమి అభ్యర్థులు ఆదిత్యంలో కొనసాగుతున్నారు.
- 4 Jun 2024 10:13 AM IST
నరసరావు పేటలో సైకిల్ జోరు
నరసరావుపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ లావు శ్రీ కృష్ణదేవరాయలు 6588 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. నరసరావుపేట వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి 1396 ఆధిక్యం
- 4 Jun 2024 10:12 AM IST
బనగానపల్లి టిడిపి కర్నూల్ టిడిపి తాడిపత్రి టీడీపీ అనంతపురం టిడిపి చిత్తూరు టిడిపి, హిందూపురం టిడిపి