నేడే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్..
x

నేడే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్..

తుఫాను వచ్చే ముందు ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ కూడా ఎన్నికల ఫలితాల తుఫానును చవిచూడటానికి ముందులా అత్యంత నిశ్శబ్దంగా ఉంది.


తుఫాను వచ్చే ముందు ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ కూడా ఎన్నికల ఫలితాల తుఫానును చవిచూడటానికి ముందులా అత్యంత నిశ్శబ్దంగా ఉంది. అధికార, ప్రతిపక్ష వర్గాలు సైతం సైలెంట్ అయిపోయాయి. అందరి చూపు ఎన్నికల ఫలితాలపైనే ఉన్నాయి. ఈ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టి మరీ పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ కూడా ఆంధ్ర ఎన్నికలపై ఒక అంచనాను వేయలేకపోయాయి. ఈ ఎగ్జిట్ పోల్స్‌లో కూడా వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లే ఉంది. దీంతో ఆంధ్ర ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారింది. కానీ ప్రజల తీర్పు మాత్రం ఈసారి ఆంధ్రప్రదేశ్‌ను తుఫానులా కాదు సునామీలా ఊపుఊపేయనుందని విశ్లేషకులు చెప్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. రాష్ట్రంలో వచ్చేది తమ ప్రభుత్వమే అని రెండు వర్గాలు పునరుద్ఘాటిస్తున్నాయి. తమ నేత జూన్ 9న ప్రమాణ స్వీకారం చేస్తారని, ఆ ప్రమాణస్వీకార వేడుకలో వడ్డించే ఆహార మెనూ ఇదేనంటూ ఇరు పక్షాలు ప్రకటనలు కూడా చేస్తున్న క్రమంలో అసలు ఆంధ్రలో గెలుపెవరిది అనేది సస్పెన్స్ థ్రిల్లర్‌గా మరింది. ఈ సస్పెన్స్‌కు ఈరోజు ఫలితాలు ప్రకటించి ఈసీ తెర దించనుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి పార్టీ వర్గాలు కూడా వళ్లు దగ్గర పెట్టుకుని మసలుకోవాలని, అటూఇటూ తేడాగా ఏమైనా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది.

Live Updates

  • 4 Jun 2024 10:58 AM IST

    రైల్వేకోడూరు ఎమ్మెల్యే..


    జనసేన అభ్యర్థి ఆరవ శ్రీధర్ ముందంజ..

    మూడవ రౌండ్ ముగిసే సరికి 3231 ఓట్ల ఆధిక్యం..

  • 4 Jun 2024 10:57 AM IST

    ఐదవ రౌండ్ పూర్తి అయ్యేసరికి 4514 ఓట్ల మెజార్టీతో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి..

    వైఎస్ఆర్సీపీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి: 22847

    టిడిపి సుగవాస బాలసుబ్రమణ్యం: 18333

  • 4 Jun 2024 10:57 AM IST

    ఉమ్మడి అనంతపురంలో టీడీపీ హవా

    ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 శాసనసభ స్థానాలు, రెండు లోక్సభ స్థానాల్లో ధర్మవరం శాసనసభ స్థానం మినహా అన్ని స్థానాల్లో టిడిపి గాలి వీస్తోంది. ధర్మవరంలో మాత్రం వైసీపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి 1000 ఓట్ల లీడ్ లో ఉన్నారు. ధర్మవరం టౌన్ లో ఓట్లు లెక్కిస్తే అక్కడ కూడా బిజెపి లీడ్ వచ్చే అవకాశం వుంది.

  • 4 Jun 2024 10:56 AM IST

    తిరుపతి అసెంబ్లీ మొదటి రౌండ్


    వైసిపి అభినయ రెడ్డి

    2740

    జనసేన ఆరని శ్రీనివాసులు

    5428

    జనసేన లీడ్

    2688

  • 4 Jun 2024 10:56 AM IST

    పిఠాపురం పీఠం పవన్‌దేనా

    నాలుగు రౌండ్లు మూసేసరికి పవన్ కళ్యాణ్ కు సుమారు 20 వేల ఆధిక్యం

    మొత్తం 18రౌండ్లకు గాను 4రౌండ్లు పూర్తి..ఇంకా జరగాల్సిన 14 రౌండ్ల కౌంటింగ్

    పవన్ కళ్యాణ్ కు అన్ని రౌండ్ల లోనూ ఆధిక్యం.1వ రౌండ్.4196. 2వ రౌండ్...3811, 3వ రౌండ్..5497, 4వ రౌండ్ 5640 ఆధిక్యం.

  • 4 Jun 2024 10:55 AM IST

    కౌంటింగ్ కేంద్రం నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థి జంప్

    నరసరావుపేట కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి వెళ్లిన వైసిపి ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్.


  • 4 Jun 2024 10:50 AM IST

    కమలాపురం అసెంబ్లీ రెండవ రెండు ముగిసే సరికి టిడిపి అభ్యర్థి చైతన్య రెడ్డి 2,042 ఓట్ల మెజారిటీ తో ముందంజ

  • 4 Jun 2024 10:34 AM IST

    13వేల ఓట్ల ఆధిక్యంలో కేశినేని చిన్ని

  • 4 Jun 2024 10:33 AM IST

    బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం నాలుగో రౌండ్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేగేసిన నరేంద్ర వర్మ 6512 ఓట్ల ముందంజలో ఉన్నారు.

  • 4 Jun 2024 10:28 AM IST

    కృష్ణా జిల్లాలో 12 చోట్ల టీడీపీ, 2 స్థానాల్లో బీజేపీ, ఒక చోట జనసేన ఆధిక్యం.. గుంటూరు జిల్లాలో 14 చోట్ల టీడీపీ, ఒక స్థానంలో జనసేన ఆధిక్యం

Read More
Next Story